ETV Bharat / city

ఓపీఎస్‌ తప్ప వేరే విధానానికి ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాలు

author img

By

Published : Aug 18, 2022, 10:31 PM IST

ministers-committee-discussion-on-cps-issue-with-employee-unions-they-demand-ops
ministers-committee-discussion-on-cps-issue-with-employee-unions-they-demand-ops

DISCUSSION ON CPS ISSUE ఓపీఎస్‌ తప్ప వేరే విధానానికి ఒప్పుకునేది లేదని ఏపీ ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. ఓపీఎస్‌ అంశంపై ప్రభుత్వంతో వారు చర్చిస్తున్నారు. రాజస్థాన్ విధానాన్ని ఏపీలో అమలు చేస్తారనే ఆశతో వచ్చామని భేటీకి వెళ్లే ముందు ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాజస్థాన్‌లో అమలు చేస్తున్నప్పుడు ఏపీలో ఓపీఎస్ అమలుకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

CPS ISSUE: సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో ఏపీ మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. ఉపాధ్యాయుల సమస్యలపై ఆ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఓపీఎస్​ తప్పా వేరే విధానానికి ఒప్పుకునేది లేదని ఈ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు. రాజస్థాన్ విధానాన్ని ఏపీలో అమలు చేస్తారనే ఆశతో సమావేశానికి వచ్చినట్లు తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. ప్రభుత్వానికి ఏ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. రాజస్థాన్‌లో ఓపీఎస్ అమలు చేస్తుంటే.. ఏపీలో అమలుకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వై.వి.రావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేేతలు హాజరయ్యారు.

ఇదీ సంగతి: ఆంధ్రప్రదేశ్‌లో 1.99 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో లక్ష మందికి ప్రొబేషన్‌ ఖరారు చేశారు. 2019 ఆగస్టు 1న మంత్రుల కమిటీ, అదే ఏడాది నవంబరు 27న అధికారుల కమిటీని ఏర్పాటుచేశారు. తర్వాత పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. చివరికి జీపీఎస్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో 2,93,653 మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వారికి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పాత పింఛన్‌ అమలుపై గెజిట్‌ విడుదల చేశారు. 2004 తర్వాత నియమితులైన వారికి ఛత్తీస్‌గఢ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ని తీసుకొచ్చారు. ఉద్యోగి బేసిక్‌లో 12% సీజీపీఎఫ్‌లో మదుపుచేయాలి. దీనిపై వడ్డీ, రుణాలు ఇస్తుంది. పదవీవిరమణ సమయంలో వెనక్కి ఇచ్చేస్తోంది. పింఛన్లు భారం కాకూడదనే.. గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన పింఛన్ల మొత్తంలో 4% భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పెడుతోంది. సీపీఎస్‌ ఉద్యోగులు, ప్రభుత్వం జమచేసిన మొత్తం నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌)లో రూ.18వేల కోట్లు ఉన్నాయి. ఈ నిధులు వచ్చాక ఉద్యోగుల భాగాన్ని వారి పీఎఫ్‌ ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా రూ.9 వేల కోట్లను పింఛన్ల కోసం ప్రత్యేకంగా ఉంచుతామంది.

రాజస్థాన్‌లో ఏం చేస్తున్నారంటే..: రాజస్థాన్‌లో 5.32 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఏప్రిల్‌ నుంచి ఓపీఎస్‌ అమలు చేస్తోంది. ఉద్యోగులు, ప్రభుత్వం వాటాగా జమ చేసిన మొత్తం ఎన్‌ఎస్‌డీఎల్‌లో రూ.39 వేల కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం వచ్చాక ఉద్యోగుల వాటాను వారి పీఎఫ్‌ ఖాతాలకు మళ్లిస్తుంది. ఉద్యోగి బేసిక్‌లో పీఎఫ్‌కు 12% జమ చేయాలి. ఈ మొత్తానికి వడ్డీ, రుణాలు ఇస్తుంది. పదవీ విరమణ సమయంలో వెనక్కి ఇచ్చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రత్యామ్నాయాన్ని అంగీకరించేది లేదని సీపీఎస్‌ ఉద్యోగులసంఘం,అధ్యక్షుడు, సీఎం దాస్‌ అన్నారు. సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పు. మేం జీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్నామని పేర్కోన్నారు. "ఓపీఎస్‌కు ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోం. సీపీఎస్‌ ఉద్యోగులకు 35 నెలల డీఏ బకాయిలే ఇవ్వలేదు. సెప్టెంబరు ఒకటిలోపు ఓపీఎస్‌ అమలుచేయకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తాం" అని ఆయన అన్నారు.

మోసపూరిత ప్రకటనలను నమ్మబోమాని సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అప్పలరాజు అన్నారు. ప్రభుత్వం చేస్తున్న జీపీఎస్‌లాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మే పరిస్థితి లేదు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జీపీఎస్‌ పేరుతో మభ్యపెడుతున్నారని అన్నారు. ఓపీఎస్‌ ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు.

"సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ అమలుచేస్తే ప్రభుత్వంపై ఆర్థికభారం పడదు. ఉద్యోగుల సంఖ్య పెరిగేకొద్దీ సీపీఎస్‌లో ప్రభుత్వవాటా పెరుగుతుంది. ఓపీఎస్‌ అమలుచేస్తే ఉద్యోగులు 6% జీపీఎఫ్‌, పీఎఫ్‌ కింద జమచేస్తారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం వాడుకోవచ్చు. ఉద్యోగ విరమణ చేసే వరకు ప్రభుత్వం వాటా చెల్లించాల్సిన అవసరం లేనందున భారంఉండదు" అని సీపీఎస్‌ ఉద్యోగులు అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.