ఉపఎన్నిక ఇన్​ఛార్జ్​ పదవికి తీవ్రమైన పోటీ, రేసులో ఆ నలుగురు

author img

By

Published : Aug 18, 2022, 6:56 PM IST

BJP  incharge post
BJP incharge post ()

Munugodu By election BJP Incharge మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా అందుకు తగ్గట్టుగానే దూకుడు పెంచింది. ఇప్పటికే బహిరంగ సభకు మండలాల వారీగా ఇన్​ఛార్జ్​లను నియమించింది. దీంతో ఇప్పుడు నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ పదవికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే నలుగురి పేర్లు పరిశీలనలో ఉండగా ఎవరి పేరు ప్రకటిస్తారనే ఉత్కంఠ నెలకొంది.

Munugodu By election BJP Incharge మునుగోడు ఉప ఎన్నికకు ఇన్​ఛార్జ్​ పదవి కోసం భాజపా నేతల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఆ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ పదవి కోసం ఈటల రాజేందర్‌, జితేందర్‌ రెడ్డి, వివేక్, మనోహర్‌ రెడ్డి పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఒకరిని మునుగోడులో అమిత్‌ షా సభ తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇప్పటికే చౌటుప్పల్‌ ఎంపీపీతో పాటు పలువురు సర్పంచులను భాజపాలోకి తీసుకువచ్చారు. దుబ్బాక, హుజూరాబాద్ సెంటిమెంట్‌తో జితేందర్‌ రెడ్డి, గత ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన అభ్యర్థి, స్థానిక నేత మనోహర్ రెడ్డిని ఉప ఎన్నిక ఇన్​ఛార్జ్​గా నియమిస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో తీవ్రంగా చర్చిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి సన్నిహితుడిగా పార్టీకి దగ్గరగా ఉన్న నేతగా వివేక్‌ పేరును కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మండలాల వారీగా ఇన్​ఛార్జ్​లను ప్రకటించిన భాజపా: మునుగోడు బహిరంగ సభకు మండలాలా వారీగా భాజపా ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు జితేందర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను నియమించారు. చౌటుప్పల్ పురపాలిక బాధ్యతలను గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డికి అప్పగించారు. మునుగోడుకు ఈటల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డికి బాధ్యతలిచ్చారు.

సంస్థాన్ నారాయణాపూర్‌ మండలానికి కూన శ్రీశైలం గౌడ్, రవీంద్ర నాయక్ పేర్లను ఖరారు చేశారు. నల్గొండ జిల్లాలోని చండూరు మండలానికి చాడా సురేష్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ నియామిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. చండూరు మున్సిపాలిటీకి రాజాసింగ్, విజయపాల్ రెడ్డి నియమించగా.. గట్టుప్పల్‌కు రఘునందన్ రావు, రాపోలు ఆనందభాస్కర్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. మర్రిగూడెంకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తల్లోజు ఆచారిని పేర్లను ఖరారు చేయగా.. నాంపల్లి మండలానికి చంద్రశేఖర్, ధర్మారావును నియమించారు.

ఇవీ చదవండి: మునుగోడులో గెలుపే లక్ష్యంగా కమలనాథుల కసరత్తు, 21న భారీ బహిరంగ సభ

కోర్టు నుంచి పరారైన హత్యాచారం నిందితుడిని కొట్టి చంపిన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.