ETV Bharat / city

KTR Comments: జేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా.. కేరాఫ్‌ ఎర్రగడ్డ: కేటీఆర్

author img

By

Published : Jan 5, 2022, 4:14 PM IST

Updated : Jan 5, 2022, 5:11 PM IST

KTR Comments: బండి సంజయ్‌కు, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదు: కేటీఆర్
KTR Comments: బండి సంజయ్‌కు, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదు: కేటీఆర్

16:10 January 05

KTR Comments: బండి సంజయ్‌కు, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదు: కేటీఆర్

KTR Comments: జేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా.. కేరాఫ్‌ ఎర్రగడ్డ: కేటీఆర్

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్​ ఖండించారు. కేసీఆర్‌ పట్ల జేపీ నడ్డా వ్యాఖ్యలు హేయంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కు, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. ఏడున్నరేళ్లలో కేంద్రంలో భాజపా చేసిందేమీ లేదని ఆరోపించారు. ఏ పార్టీ అయినా చేసిన అభివృద్ధి చెప్పుకుని ఓట్లు కోరుతారని.. కానీ యూపీలో గతంలో గూండాగిరి ఉండేదని, ఇప్పుడు గూండాగిరి లేనందుకు ఓటేయాలని కోరుతున్నారని విమర్శించారు. సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

మోదీ.. రైతు విరోధిగా మారారు..

ఎన్‌డీఏలో భాగస్వామ్య పక్షాల గురించి ఎవరైనా చెబుతారని.. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు.. భాజపా, ఈడీ, ఎన్‌ఐఏ, సీబీఐ అంటూ ఎద్దేవా చేశారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని పాలన చేస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై కేటీఆర్​ విమర్శలు గుప్పించారు. దిల్లీలోని కొన్ని మీడియా సంస్థలను మోడియాగా మార్చారని విమర్శించారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ.. రైతు విరోధిగా మారారన్నారు. పంజాబ్‌లో ప్రధాని మోదీని రైతులు అడ్డుకున్నారని వెల్లడించారు. అన్నదాతలు అడ్డుకుంటే 20 నిమిషాల పాటు మోదీ రోడ్డుపైనే ఉన్నారని తెలిపారు.

ఆ నీతి కూడా నడ్డాకు లేదు..

2022 కల్లా ప్రతి భారతీయుడికి ఇళ్లు అని మోదీ చెప్పారని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఇప్పటివరకు ప్రతి భారతీయుడికి ఇళ్లు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ సహా 28 రాష్ట్రాల ప్రజలకు ఇళ్లు అనే హామీ కూడా జుమ్లా అంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ గురించి జేపీ నడ్డా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. "జేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా.. కేరాఫ్‌ ఎర్రగడ్డ" అంటూ నడ్డాపై విరుచుకుపడ్డారు.నీతి ఆయోగ్‌కు ఉన్న నీతి కూడా నడ్డాకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ప్రయోగిస్తారని ఆరోపించారు. తెలంగాణ రైతులు పండించిన పంటను కొనలేమని ఎఫ్‌సీఐ చేతులెత్తేసిందని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు.

నకలు కొట్టారు..

కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్రమే పార్లమెంటులో చెప్పింది. మోదీ హయాంలో సామాన్యుడికి శోకం మాత్రమే మిగిలింది. రైతుబంధును నకలు కొట్టి కిసాన్‌ సమ్మాన్‌ నిధి తీసుకువచ్చారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి రైతుబంధు స్పూర్తి. హర్‌ ఘర్‌ జల్‌ స్ఫూర్తి మిషన్‌ భగీరథ కాదా?. మిషన్‌ భగీరథ నీళ్లు కేసీఆర్‌ ఇల్లు, ఫామ్‌హౌస్‌కే వెళ్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మిషన్‌ భగీరథ గొప్ప పథకమని కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించారు.మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లిస్తున్నట్లు ప్రశంసించారు. -కేటీఆర్​, రాష్ట్ర మంత్రి

నడ్డా అత్త జయశ్రీ బెనర్జీ మంత్రిగా లేరా?

రైతుబంధు, రైతుబీమా తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. రాష్ట్ర పథకాలను నకలు కొట్టిన దౌర్భాగ్య పరిస్థితి భాజపాదంటూ విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబపాలన అని విమర్శలు చేస్తున్నారన్న మంత్రి..ఉద్యమంలో పాల్గొన్న నాయకులు పాలించకూడదా అంటూ ప్రశ్నించారు. భాజపాలో కుటుంబపాలన గురించి ఎందుకు చెప్పట్లేదని మండిపడ్డారు. కుటుంబపాలన అంటూ నడ్డా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న కేటీఆర్​.. జేపీ నడ్డా అత్త జయశ్రీ బెనర్జీ మంత్రిగా లేరా అంటూ ప్రశ్నించారు. అమిత్‌షా కుమారుడికి బీసీసీఐ పదవి ఎలా వచ్చిందన్నారు. గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసింది భాజపా కాదా అని ప్రశ్నలు గుప్పించారు.

జీవో గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు..

8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చింది మీరు కాదా?. రాష్ట్రంలో ఉద్యోగులకు 87 శాతం జీతాలు పెంచాం. కేంద్రం మాత్రం ఉద్యోగులకు 15 శాతం పెంచింది. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం నాయకత్వంలో ముందుకెళ్తాం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోం. ప్రతి అంశంలో భాజపా పాలనను చీల్చిచెండాడుతాం. పునర్విభజన చట్టంలో హామీల గురించి నిలదీస్తాం. ప్రజల తరఫున తప్పకుండా నిలదీస్తాం. జీవో 317 గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు. 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు రావాలనేది ప్రభుత్వ ఉద్దేశం. -కేటీఆర్​, రాష్ట్ర మంత్రి

ఆ గెలుపు ఓ గెలుపేనా?

భాజపా 107 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్న మంత్రి కేటీఆర్​.. దుబ్బాకలో కేవలం వెయ్యి ఓట్లతో గెలిచారని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ఈటల గెలుపూ ఓ గెలుపేనా అంటూ ఎద్దేవా చేశారు. ఈటల హుజూరాబాద్‌లో ఏడుస్తూ ప్రచారం చేశారన్నారు. నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారా.. అని ఈటల ప్రచారం చేశారని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 5, 2022, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.