ETV Bharat / city

భాగ్యనగరంలో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం..

author img

By

Published : Jun 15, 2022, 11:13 AM IST

Updated : Jun 15, 2022, 11:23 AM IST

Rain in Hyderabad Today: భాగ్యనగరంలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది. రుతుపవనాలు చురుగ్గా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రమంతటా పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షం కురవడంతో... వరద నీరు ఇళ్లలోకి చేరింది. పాతబస్తీలోని రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Rain in Hyderabad
Rain in Hyderabad

Rain in Hyderabad Today: హైదరాబాద్​లో నైరుతి రుతుపవనాల జోరు కనిపిస్తోంది. రాత్రి నుంచి జీహెచ్​ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ, చార్మినార్, బహదూర్​పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్ నుమ, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నంలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. పాతబస్తీలోని ఛత్రినాక, శివాజీ నగర్, శివ గంగనగర్​, లోతట్టు ప్రాంతాల్లోని వీధుల్లో రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది.

భారీవర్షాలు, వరదతో పలు ఇళ్లలోకి కొంతమేర వరదనీరు వచ్చి చేరింది. భారీ వర్షం ధాటికి పలు కాలనీల వాసులు ఇంటికే పరిమితం అయ్యారు. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో రోడ్డుపై భారీగా వరద నీరు నిల్వడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటు ఉప్పల్, తార్నాక, దిల్​సుఖ్​నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, పెద్ద అంబర్​పేట్, అబ్దుల్లాపూర్ మెట్​ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో ఈదురు గాలులతో వర్షం పడుతోంది.

జిల్లాలోని ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, షాద్​నగర్​లో రాత్రి నుంచే వానలు కురుస్తున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్​ పరిసరాల్లో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. సుమారు రెండు గంటలపాటు వర్షం కురిసిన సమయంలో కరెంటు కోత విధించారు. విడతల వారిగా కురుస్తున్న వర్షంతో నగరవాసులు తొలకరిని ఆస్వాదిస్తున్నా... స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచి పలుచోట్ల ట్రాఫిక్ ఆలస్యంగా సాగుతోంది.

భాగ్యనగరంలో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం..

ఇవీ చదవండి:Rain in Telangana Today : తెలంగాణలో వర్షం.. తడిసిముద్దవుతున్న జనం

Last Updated :Jun 15, 2022, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.