ETV Bharat / city

ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి: పవన్

author img

By

Published : Sep 7, 2020, 10:53 PM IST

గ్రామాల డబ్బు గ్రామాల్లోనే ఉండాలి.. నగరాల ఆదాయం పల్లెలకు రావాలనేదే ప్రకృతి వ్యవసాయ ఫలితమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రకృతి వ్యవసాయం గురించి అందరికీ తెలియాలని... ఈ తరహా సాగు విధానంతో చిన్నపాటి భూమిలో ఒక కుటుంబంలోని నలుగురు కలిసి పని చేసుకుంటే ఎంత ఆదాయం వస్తుందనే విషయాలపై ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి : పవన్
ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి : పవన్

ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి : పవన్

ప్రకృతి వ్యవసాయ విధాన ఆవశ్యకత, దాని విశిష్టతను తెలిపే అనుభవం ప్రకృతి వ్యవసాయ రైతు విజయరామ్‌కి ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంపై విజయరామ్‌ అనుభవాలను పవన్‌ తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పే ముందు తాను ముందు ఆచరించాలని... అందుకే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఆరు ఎకరాలు భూమి కొనుగోలు చేసి అక్కడ చెరువు తవ్వానని వెల్లడించారు. అనంతరం పాలేకర్ విధానాలను అనుసరించానని పవన్ చెప్పుకొచ్చారు.

అందుకే కన్నడనాట ఆగ్రస్థానంలో ఉంది..

ప్రకృతి వ్యవసాయంలో దేశంలోనే కర్ణాటక అగ్ర స్థానంలో ఉందని విజయ్​రామ్​ పేర్కొన్నారు. దానికి కారణం అక్కడ గోవుని పూజించే స్వాములు, పీఠాధిపతులు, వారి ఆశ్రమాలు ఎక్కువ సంఖ్యలో ఉండటమేనని ఆయన తెలిపారు. తమ భక్తులకు ప్రకృతి వ్యవసాయం గురించి వారు వివరిస్తున్నారని విజయ్​రామ్ స్పష్టం చేశారు. అలాంటి బాధ్యత తెలుగు రాష్ట్రాల స్వాములంతా తీసుకోవాలని విజయరామ్‌ కోరారు.

ఆ విశ్వాసం నాకు ఉంది : విజయ్​రామ్

పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే రాష్ట్రం ప్రకృతి వ్యవసాయంలో ముందు వరుసలో తప్పక ఉంటుందనే విశ్వాసం తనకు ఉందన్నారు.

ప్రతి ఒక్కరికీ మంచి ఆహారమే అందాలి..

అందరికీ విషతుల్యం కాని ఆహారం ఇవ్వాలని... ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలగాలని విజయరామ్‌ ఆకాంక్షించారు.

ఇవీ చూడండి : యాదాద్రి క్షేత్రంలో.. పంచ నరసింహులకు.. పంచ మండపాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.