ETV Bharat / city

సీపీ కార్యాలయంలో స్వీపర్లకు నిత్యావసరాల పంపిణీ

author img

By

Published : Apr 17, 2020, 8:45 AM IST

లాక్​డౌన్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటిస్తూ... స్వీయ నిర్బంధంలో ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కోరారు. బషీర్​బాగ్​లోని పోలీస్​ కమిషనర్​ కార్యాలయంలో పనిచేస్తున్న స్వీపర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

cp food distribution
సీపీ కార్యాలయంలో స్వీపర్లకు నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్ సమయంలో పేదలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సీపీ అంజనీకుమార్​ పేర్కొన్నారు. బషీర్​బాగ్​లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పని చేస్తున్న స్వీపర్లకు నెలకు సరిపడా నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు గజారావు భోపాల్, సునీత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.