ETV Bharat / city

మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

author img

By

Published : Feb 26, 2021, 9:14 PM IST

మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నా.. స్కోచ్​ అవార్డు పేరిట పట్టభద్రులను ప్రభావితం చేశారని సీఈసీ సునీల్​ అరోడాకు లేఖ రాశారు.

congress complaint to election commission on skoch awards
మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

మంత్రి కేటీఆర్​, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​ రంజన్​పై కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్​ నిరంజన్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. స్కోచ్​ అవార్డు విషయంలో ​ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ... జయేశ్​ రంజన్​.. ప్రగతి భవన్​కు వెళ్లి మరీ బెస్ట్ ఫర్​ఫార్మింగ్ ఐటీ మినిస్టర్ అవార్డును కేటీఆర్​కు అందించారని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​ సునీల్​ ఆరోడాకు ఫిర్యాదుచేశారు. పట్టభద్రులను ప్రభావితం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించారని వివరించారు. స్కోచ్ అవార్డుకు సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలను లేఖతో పాటు జతపరిచారు.

ఇవీచూడండి: రాష్ట్రానికి మరోసారి స్కోచ్‌ అవార్డులు.. ఉత్తమ మంత్రిగా కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.