ETV Bharat / city

CM KCR Dussehra Wishes : 'లక్ష్యసాధనలో విశ్రమించకూడదనేదే దసరా స్ఫూర్తి'

author img

By

Published : Oct 15, 2021, 11:52 AM IST

రాష్ట్రప్రజలకు పలువురు రాజకీయ ప్రముఖులు దసరా శుభాకాంక్షలు(CM KCR Dussehra Wishes) తెలిపారు. లక్ష్యసాధనలో విశ్రమించకూడదనేది దసరా స్ఫూర్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చెడుమీద మంచి విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు.

CM KCR Dussehra Wishes
CM KCR Dussehra Wishes

రాష్ట్ర ప్రజలకు పలువురు రాజకీయ ప్రముఖులు దసరా శుభాకాంక్షలు(CM KCR Dussehra Wishes) తెలిపారు. తెలంగాణకు దసరా ప్రత్యేకమైన పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లక్ష్యసాధనలో విశ్రమించకూడదనేది దసరా స్ఫూర్తి అని చెప్పారు. తెలంగాణ ప్రజానీకానికి ఆరోగ్యం, సిరిసంపదలు కలగాలని దుర్గాదేవిని ప్రార్థించినానని పేర్కొన్నారు.

  • CM Sri KCR conveyed greetings to the people of Telangana on the occasion of #Dussehra, a festival of great spiritual significance and grand celebrations. Dussehra underscores the 'never give up until the goal is reached' spirit and reaffirms that good always triumphs over evil. pic.twitter.com/nygCh55Jpf

    — Telangana CMO (@TelanganaCMO) October 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దసరాను మించిన పండుగ లేదు. హిందువులకు అతిపెద్ద పండుగ. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలి. దసరా పండుగలో సంస్కృతి, సంప్రదాయంతో పాటు ఆత్మీయత కూడా ఉంటుంది. చెడుపై మంచి విజయానికి ప్రతీక ఈ పండుగ. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాగా.. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలవాలి. రాష్ట్ర ప్రజలకు అమ్మ ఆశీస్సులు కలగాలి. అందరికి దసరా శుభాకాంక్షలు" అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

  • @TelanganaGuv Dr Tamilisai Soundararajan message on the occasion of “Vijaya Dasami” Festival -On the joyous occasion of Vijaya Dasami, I extend my warm and cordial greetings to the people of Telangana.

    — IPRDepartment (@IPRTelangana) October 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, పలువురు ప్రజాప్రతినిధులు ట్విటర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు.. వారి అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

  • మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు 🙏#HappyDussehra to all

    — KTR (@KTRTRS) October 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెెెెడ్డి.. ధర్మానిదే అంతిమ విజయమని విజయదశమి చాటిచెప్పిందని అన్నారు. ప్రజలందరి జీవితాల్లో ఈ పండుగ వెలుగులు నింపాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.