ETV Bharat / city

ఏపీకి ప్రత్యేక హోదాపై.. కేంద్రానిది మళ్లీ అదే మాట..!

author img

By

Published : Jul 19, 2022, 5:03 PM IST

Updated : Jul 19, 2022, 5:25 PM IST

Central Govt. on AP Special Status: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి పాత మాటే చెప్పింది. హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ మరోసారి లోక్‌సభకు తెలిపింది. విభజన చట్టం హామీలను చాలా వరకు నెరవేర్చామన్న హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్.. హామీల్లో కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

'ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం'
'ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం'

Special Status: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు జవాబిచ్చారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచిందని వెల్లడించారు. అలాగే రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించిందని చెప్పారు.

15వ ఆర్థిక సంఘం కూడా ఆ సిఫారసులను కొనసాగించిందని వివరించారు. విభజన చట్టం ప్రకారం ఇచ్చిన ఇతర హామీలను చాలా వరకు నెరవేర్చామన్న నిత్యానందరాయ్.. కొన్ని మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదాల పరిష్కారానికి 28 సమావేశాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..

పెద్దాసుపత్రికి పెరిగిన తాకిడి.. పెచ్చులూడుతూ భయపెడుతున్న భవనం

'అగ్నిపథ్​పై​ పిటిషన్లన్నీ దిల్లీ హైకోర్టుకే.. అప్పటి వరకు ఆగండి!'

Last Updated :Jul 19, 2022, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.