ETV Bharat / city

జూబ్లీహిల్స్​ పోలీస్​స్టేషన్​ వద్ద ఉద్రిక్తత.. నిందితులను అరెస్ట్​ చేయాలని ఆందోళన..

author img

By

Published : Jun 3, 2022, 8:13 PM IST

BJP Protest at Jubilee Hills Police station against gang rape on 17 years girl
BJP Protest at Jubilee Hills Police station against gang rape on 17 years girl

BJP Protest at Jubilee Hills Police station: 17 ఏళ్ల బాలికపై అత్యాచార కేసు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ ఘటనలోని నిందితుల్లో అధికార పార్టీ ప్రతినిధుల కుమారులున్నారన్న ఆరోపణలతో విపక్షాలు.. భగ్గుంటున్నాయి. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్​ పోలీస్​స్టేషన్​ వద్ద భాజపా, బీజేవైఎం శ్రేణులు ఆందోళనకు దిగాయి.

జూబ్లీహిల్స్​ పోలీస్​స్టేషన్​ వద్ద ఉద్రిక్తత.. నిందితులను అరెస్ట్​ చేయాలని ఆందోళన..

BJP Protest at Jubilee Hills Police station: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పబ్​కు వచ్చిన 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ.. పెద్దఎత్తున భాజపా, బీజేవైఎం శ్రేణులు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించాయి. హోంమంత్రి మహమూద్​ అలీ రాజీనామా చేయాలని భాజపా శ్రేణులు నినాదాలు చేశాయి. ఎఫ్‌ఐఆర్‌ ఆలస్యంగా నమోదు చేయడంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి.

పెద్దఎత్తున నిరనస తెలుపుతుండటంతో.. భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని మోహరించాయి. నిరసనకారులతో పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడినా.. ఫలితం లేకపోయింది. భాజపా శ్రేణుల నిరసనలతో జూబ్లీహిల్స్ ప్రధానరహదారిపై పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఇక చేసేదేమీలేక.. ఆందోళనకారులను పోలీస్​ సిబ్బంది అరెస్ట్​ చేశారు. ఈ క్రమంలో.. అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. భాజపా కార్యకర్తల అరెస్ట్‌పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఘటన జరిగి 6 రోజులైనా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పోలీసులను నిలదీశారు. తెరాస, ఎంఐఎం వ్యక్తులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు ప్రభుత్వానికి భయపడి నిందితులపై చర్యలు తీసుకోవట్లేదన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని డిమాండ్​ చేశారు. డ్రగ్స్‌ అడ్డాగా హైదరాబాద్‌ మారిందన్న చింతల.. రాష్ట్రంలో మాదకద్రవ్యాలను రూపుమాపాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.