ETV Bharat / business

ఎక్కువ క్రెడిట్​ కార్డులు ఉన్నాయా? స్కోరుపై ప్రభావం పడుతుందా? ఇలా చేయకూడదట!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 7:29 AM IST

Multiple Credit Cards Good or Bad : ఎక్కువ క్రెడిట్​కార్డులను ఉపయోగించడం వల్ల క్రెడిట్​స్కోర్​పై ఏమైనా ప్రభావం పడుతుందా అని చాలామందికి డౌట్ రావచ్చు. అసలు క్రెడిట్​స్కోర్​ను ఏవిధంగా లెక్కిస్తారు? క్రెడిట్​స్కోర్​ను లెక్కించేటప్పుడు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు తదితర వివరాలు మీ కోసం.

Multiple Credit Cards Affect on Credit Score
Multiple Credit Cards Affect on Credit Score

Multiple Credit Cards Good or Bad : అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలా మంది క్రెడిట్ కార్డును వాడుతుంటారు. అయితే కొంతమంది రెండూ లేదా అంతకన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల క్రెడిట్ స్కోర్​పై ప్రభావం పడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆ వివరాలు మీ కోసం.

  • క్రెడిట్​స్కోర్​ను ఏవిధంగా లెక్కిస్తారు?
    Payment History (35%) : క్రెడిట్​స్కోర్​ను లెక్కించడానికి పరిగణనలోకి తీసుకునే వాటిలో ముఖ్యమైనది పేమెంట్ హిస్టరీ. మీరు తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తేనే క్రెడిట్​ స్కోర్​ ఎక్కువగా ఉంటుంది. లేనట్లయితే దాని ప్రభావం క్రెడిట్ స్కోర్​పై పడుతుంది. ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉపయోగిస్తుంటే వాటి చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండలి. లేదంటే మీ క్రెడిట్ స్కోర్​ తగ్గే అవకాశం ఉంది.
  • Debt-to-credit ratio : అందుబాటులో ఉన్న క్రెడిట్​లో మీరు ఎంతమేరకు ఉపయోగించారనే విషయాన్ని డెబిట్​ టు క్రెడిట్ రేషియో లెక్కిస్తుంది. ఈ డెబిట్-టు-క్రెడిట్ నిష్పత్తి 30శాతాన్ని మించకుండా చూసుకోవాలి. ఎక్కువ క్రెడిట్​కార్డులు డెబిట్​-టు- క్రెడిట్ రేషియోను పెంచుతాయి.
  • Average age of your credit cards : ఎక్కువ కాలం పాటు క్రెడిట్​కార్డు ద్వారా లోన్ తీసుకుని సమయానికి చెల్లించేవారికి మంచి క్రెడిట్ స్కోర్​ ఉంటుంది. ఈ మధ్యనే క్రెడిట్​లోన్ తీసుకున్నవారికి క్రెడిట్​స్కోర్ తక్కువగా ఉంటుంది.
  • Types of credit : క్రెడిట్ స్కోర్ ఆధారంగా మీకు లోన్​ ఇచ్చేటప్పుడు మీరు ఎన్ని క్రెడిట్​కార్డులను కలిగి ఉన్నారనే విషయాన్ని బ్యాంకు పరిశీలిస్తుంది. దీంతోపాటు తనఖాపై తీసుకున్న లోన్​లు, వాయిదా చెల్లింపులు మొదలైన వివరాలను కూడా చూస్తారు.

కొత్త క్రెడిట్ కార్డులు : మీరు ఓ కొత్త క్రెడిట్​కార్డును తీసుకుంటే తాత్కాలికంగా తక్కువ స్కోర్ ఉండే అవకాశం ఉంది. అందువల్ల స్వల్పకాలంలో మరీ ఎక్కువ క్రెడిట్​కార్డులను తీసుకోకపోవడమే మంచింది. ఏక కాలంలో ఎక్కువ క్రెడిట్​కార్డులను తీసుకొంటున్నట్లయితే మీ క్రెడిట్​స్కోర్​పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒకటి లేదా రెండు క్రెడిట్​కార్డులను క్రమం తప్పకుండా ఉపయోగించుకోండి. మీ చెల్లింపులను గమనిస్తూ ఉండండి. క్రెడిట్​కార్డుపై తీసుకునే లోన్​ 30 శాతానికి మించకపోవడమే మేలు.

Reasons For Credit Card Limit Decrease : మీ క్రెడిట్ కార్డ్‌ లిమిట్​ తగ్గిందా?.. కారణాలు ఇవే!

Credit Score Improvement Tips : క్రెడిట్ స్కోర్‌ పెంచుకోవాలా?.. ఈ టిప్స్​ పాటించండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.