ETV Bharat / business

Credit Score Improvement Tips : క్రెడిట్ స్కోర్‌ పెంచుకోవాలా?.. ఈ టిప్స్​ పాటించండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 12:42 PM IST

credit card usage tips
Credit Score Improvement Tips

Credit Score Improvement Tips In Telugu : నేటి కాలంలో రుణాలు పొందాలంటే క్రెడిట్ స్కోర్ అత్యవసరం. కానీ చాలా మంది తెలియక తమ క్రెడిట్ కార్డు వినియోగంలో అనేక తప్పులు చేస్తూ ఉంటారు. దీని వల్ల వారి క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. ఫలితంగా రుణాలు పొందే అవకాశం కూడా పోతుంది. అందుకే క్రెడిట్​ స్కోర్​ తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Score Improvement Tips : ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ కలిగి ఉండడం గొప్ప విషయం కాదు.. దానిని మెరుగ్గా నిర్వహించడంలోనే గొప్పతనమంతా ఇమిడి ఉంది. నేడు ఏ బ్యాంక్​ రుణం పొందాలన్నా కూడా మంచి క్రెడిట్​ స్కోర్​ తప్పనిసరి. క్రెడిట్​ స్కోర్​ లేదా సిబిల్ స్కోర్​ అనేది తక్కువగా ఉంటే, బ్యాంకు రుణాలు అంత సులువుగా లభించవు.

క్రెడిట్​ స్కోర్​ బాగా ఉండాలంటే.. ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. కానీ చాలా మంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అలాగే మరెన్నో ఆర్థికపరమైన తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు ఏమిటి? వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం. ( Credit Card Usage Tips )

క్రెడిట్ కార్డ్​ బిల్​ బాకాయిలు వద్దు!
Credit Card Bill Payment Tips : క్రెడిట్‌ కార్డు బిల్లులను గడువు తేదీకి ముందే తిరిగి చెల్లించాలి. ఒక వేళ గడువులోగా మీరు బకాయిని చెల్లించకపోతే.. మీ క్రెడిట్‌ స్కోరు తగ్గిపోతుంది. ఒక వేళ మొత్తం బిల్లు చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే.. మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం పడకుండా, కనీస మొత్తాన్ని అయినా చెల్లించే ప్రయత్నం చేయండి. వాస్తవానికి కనీస మొత్తాన్ని చెల్లించినంత మాత్రాన మీ బాధ్యత తీరిపోదు. కనీస మొత్తాన్ని చెల్లించడం అలవాటు చేసుకుంటే పూర్తి రుణం తీర్చడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. వడ్డీ భారం కూడా తీవ్రంగా పెరిగిపోతుంది. అందువల్ల సాధ్యమైనంత త్వరగా మిగిలిన క్రెడిట్​ కార్డ్​ బకాయిలను చెల్లించడానికి నిధులను సిద్ధం చేసుకోవాలి. ఆలస్య చెల్లింపులు, డిఫాల్ట్‌లు మీ క్రెడిట్‌ నివేదికలో 7 సంవత్సరాల వరకు ఉంటాయి. కనుక, మీ బిల్లులను సకాలంలో చెల్లించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అవసరమైతే చెల్లింపుల తేదీలు మరిచిపోకుండా మీ ఫోన్‌లో క్యాలెండర్‌ రిమైండర్‌లు, ఇ-మెయిల్‌ నోటిఫికేషన్లను సెటప్‌ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లులను ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లించేందుకు.. బ్యాంక్​ అకౌంట్​లో ఆటోమేటిక్ డెబిట్​ ఆప్షన్​ను​ ఏర్పాటు చేసుకోవడం మంచిది.

ఈఎంఐలు సకాలంలో చెల్లించాలి!
EMI Payment Tips : క్రెడిట్‌ కార్డు బకాయిల మాదిరిగానే, లోన్‌ ఈఎంఐ డిఫాల్డ్‌లు కూడా మీ క్రెడిట్‌ లేదా సిబిల్​ స్కోర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. వాస్తవానికి ఈఎంఐ డిఫాల్ట్‌లు మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లో నమోదవుతూ ఉంటాయి. అంతేకాదు.. తరచూ పునరావృతమయ్యే డిఫాల్డ్‌లు మీ క్రెడిట్‌ స్కోర్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయి. ఫలితంగా భవిష్యత్‌లో మీరు రుణాలు పొందడం చాలా కష్టమవుతుంది. అందుకే మీ క్రెడిట్‌ స్కోరును పెంచుకునేందుకు లోన్‌ ఈఎంఐలను సకాలంలో చెల్లించేలా చూసుకోవాలి.

కార్డు పరిమితిని మీరవద్దు!
Do not Cross Credit Card Limit : ప్రతి క్రెడిట్​ కార్డ్​కు ఒక పరిమితి ఉంటుంది. అయితే మీరు క్రెడిట్‌ కార్డును పరిమితి ఉన్నంతవరకు ఉపయోగించినట్లు అయితే.. కచ్చితంగా మీ క్రెడిట్‌ స్కోరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సాధారణంగా క్రెడిట్‌ కార్డు లిమిట్‌లో కేవలం 30% మాత్రమే ఉపయోగించుకోవడం మంచిది. ఇంత కంటే ఎక్కువ మొత్తాన్ని తరచూ వాడుతూ ఉంటే మాత్రం.. మీ క్రెడిట్‌ స్కోరు బాగా తగ్గుతుంది. ఒక వేళ మీ ఖర్చులు అధికంగా ఉంటే.. క్రెడిట్‌ కార్డు లిమిట్‌ను పెంచాలని క్రెడిట్‌ కార్డును జారీ చేసిన సంస్థను అభ్యర్థించాలి. లేదా మీ అర్హతను అనుసరించి సాధ్యమైనంత త్వరలో మరొక క్రెడిట్‌ కార్డును తీసుకొవాలి. అప్పుడు మీ రెండు కార్డులను సమానంగా వినియోగించి, మీ క్రెడిట్​ కార్డు వినియోగ పరిమితిని 30%లోపు ఉంచుకోవచ్చు.

క్రెడిట్‌ కార్డ్​ను క్లోజ్‌ చేయవద్దు!
Credit Card Closure Pros And Cons : ఒకసారి క్రెడిట్​ కార్డు​ను తీసుకున్న తరువాత దానిని మంచిగా నిర్వహిస్తూ ఉండాలి. అంతేగానీ క్లోజ్ చేయకూడదు. వాస్తవానికి క్రెడిట్‌ కార్డును క్లోజ్‌ చేస్తే ఏం జరుగుతుందనేది చాలా మందికి తెలియదు. ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగిన వారు, ఒక్కోసారి ఎక్కువ కాలం నుంచి ఉపయోగిస్తున్న క్రెడిట్‌ కార్డును మూసి వేస్తూ ఉంటారు. వాస్తవానికి పాత క్రెడిట్‌ కార్డు మెరుగైన క్రెడిట్‌ రికార్డును కలిగి ఉన్నప్పుడు.. దానిని రద్దు చేయడం వల్ల మీ క్రెడిట్‌ రికార్డు పోతుంది.

ఉదాహరణకు మీరు 5 సంవత్సరాల నుంచి ఒక కార్డు, 2 సంవత్సరాల నుంచి మరొక కార్డు కలిగి ఉన్నారని అనుకుందాం. అప్పుడు మీకు సగటున 3.5 సంవత్సరాల క్రెడిట్‌ రికార్డ్​ ఉన్నట్లు లెక్క. ఒక వేళ మీరు 5 సంవత్సరాల పాత కార్డును మూసి వేస్తే, మీ క్రెడిట్‌ వయస్సు కేవలం 2 సంవత్సరాలకు తగ్గిపోతుంది. అంతేకాకుండా వినియోగం పెరిగినప్పుడు ఖర్చంతా ఒకే కార్డు మీద పడుతుంది. అందువల్ల మీ కార్డు వినియోగ పరిమితిని దాటవలసి వస్తుంది. ఇది మీ క్రెడిట్‌ స్కోరు తగ్గడానికి కారణం అవుతుంది.

బహుళ రుణాలు తీసుకోవద్దు!
Do Not Take Over Credit Risks : మీ పేరు మీద అనేక రుణాలు ఉంటే.. మీ ఆర్థిక నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ బహుళ రుణాల వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. కనుక రుణాలు చెల్లించడం కష్టమవుతుంది. ఫలితంగా మీ క్రెడిట్‌ స్కోరు బాగా తగ్గుతుంది.

ఒకేసారి ఎక్కువ రుణ దరఖాస్తులు వద్దు!
Do Not Apply For Too Many Bank Loans : మీరు లోన్​ కోసం అప్లై చేసిన ప్రతిసారీ మీ క్రెడిట్‌ యోగ్యతను నిర్ధరణ చేసుకునేందుకు మీ క్రెడిట్‌ నివేదికను రుణ సంస్థలు పరిశీలిస్తాయి. మీరు తక్కువ సమయంలో ఎక్కువ సార్లు రుణం కోసం ప్రయత్నిస్తే.. ఈ ఎంక్వైరీలు అన్నీ రికార్డవుతాయి. ఆ దరఖాస్తులు అన్నీ క్రెడిట్​ రిపోర్ట్​ ద్వారా బ్యాంకులకు తెలుస్తాయి. ఇది మిమ్మల్ని ఆర్థిక సమస్యలున్న వ్యక్తిగా, క్రెడిట్‌ కోసం తాపత్రయ పడే వ్యక్తిగా పరిగణించేలా చేస్తాయి. ఈ అంశం కూడా క్రెడిట్‌ స్కోరు తగ్గడానికి కారణం అవుతుంది. అందువల్ల, రుణం కోసం దరఖాస్తు చేయాలని అనుకున్నప్పుడు.. ఒకేసారి అనేక రుణసంస్థల్లో దరఖాస్తు చేయకుండా, అన్ని అంశాలను పరిశీలించి ఒకే సంస్థను ఆశ్రయించడం ఉత్తమం.

క్రెడిట్‌ నివేదికలోని తప్పులు సరిచేసుకోవాలి!
How To Fix Errors On My Credit Report : మీ క్రెడిట్‌ రిపోర్ట్‌.. మీ ఆర్థిక చరిత్రను ప్రతిబింబించే అద్దం లాంటిది. మీకు తెలియకుండానే కొన్నిసార్లు మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లో తప్పుడు సమాచారం నమోదు అవుతూ ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్‌ నివేదికలో రుణ మొత్తం, చెల్లింపు తేదీలు, బకాయి మొత్తం, లోన్‌ రీపేమెంట్‌ వివరాలు అన్నీ ఉంటాయి. ఒకవేళ మీ క్రెడిట్‌ నివేదికలో లోన్‌ రీపేమెంట్‌ వివరాలు సరిగ్గా నమోదు కాకపోయినా.. అది మీ క్రెడిట్‌ స్కోరును తగ్గించే అవకాశం ఉంటుంది. కనుక మీ క్రెడిట్‌ రిపోర్టును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. ఏవైనా తప్పులు దొర్లితే.. వెంటనే వాటిని సరిచేసుకోవాలి.

లోన్​ సెటిల్‌మెంట్‌ విషయంలో జాగ్రత్త!
Loan Settlement Issues : బ్యాంకులు కొన్ని సార్లు తాము ఇచ్చిన రుణ మొత్తంలో కొంత భాగాన్ని తగ్గించుకుని రుణ గ్రహీతతో సెటిల్​మెంట్ చేసుకుంటుంది. ఇలాంటి సందర్భంలో చెల్లించాల్సిన లోన్​ మొత్తంలో కొంత సొమ్ము కలిసి వస్తుందని రుణగ్రహీతలు అనుకుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే లోన్ సెటిల్​మెంట్​ చేసుకున్న వ్యక్తుల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. కనుక భవిష్యత్​లో బ్యాంక్​ రుణాలు పొందే అవకాశం పూర్తిగా సన్నగిల్లుతుంది. అందుకే ఇలా సెటిల్‌మెంట్‌ చేసుకోవడానికి బదులుగా, రుణం తీర్చేందుకు మరికొంత సమయం కావాలని బ్యాంకును కోరడం మంచిది.

యాడ్‌-ఆన్‌ కార్డుల విషయంలో జాగ్రత్త!
Add On Credit Card Risks : యాడ్‌-ఆన్‌ కార్డులు అంటే ప్రాథమిక క్రెడిట్‌ కార్డుకు అనుబంధ కార్డులు అని అర్థం. వీటిని ఖాతాదారు జీవిత భాగస్వామికి, పిల్లలకు బ్యాంకులు జారీ చేస్తుంటాయి. ఈ యాడ్‌-ఆన్‌ కార్డులు ఎవరు ఉపయోగించినా, ఎంత ఖర్చు చేసినా, అది అంతా ప్రాథమిక వినియోగదారుడి క్రెడిట్‌ కార్డు బిల్లులోనే కలుస్తుంది. ఆ బకాయిని చెల్లించాల్సింది కూడా ప్రైమరీ కార్డు హోల్డరే. కనుక యాడ్‌-ఆన్‌ కార్డుదారులు అధికంగా ఖర్చు పెట్టకుండా పరిమితి విధించాలి. లేకపోతే మీరు కష్టాల్లో పడ్డట్లే. ఒక వేళ యాడ్​-ఆన్​ కార్డుదారులు చేసిన బిల్లులను మీరు సకాలంలో చెల్లించలేకపోతే.. మీ క్రెడిట్‌ స్కోరు కచ్చితంగా ప్రభావితమవుతుంది.

ఏటీఎం నుంచి విత్​డ్రా చేయవద్దు!
Do Not Withdraw Money From ATM With Credit Card : మీ క్రెడిట్‌ కార్డుతో ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేసిన రోజు నుంచే వడ్డీ ప్రారంభమవుతుంది. సాధారణ కొనుగోళ్లకు ఉండే గ్రేస్‌ పీరియడ్‌ దీనికి వర్తించదు. అంతేకాకుండా నగదు అడ్వాన్సు రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా అడ్వాన్స్‌లో 3% నుంచి 5% వరకు ఉండవచ్చు. అంతేకాదు ఏటీఎం నుంచి తీసుకున్న డబ్బుపై వడ్డీ కూడా అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా నెలకు 3% నుంచి 4% వరకు వడ్డీ ఉండవచ్చు. చాలా మంది ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసిన తర్వాత సకాలంలో చెల్లించడం మరిచిపోతారు. దీనితో వారి క్రెడిట్‌ స్కోరు బాగా తగ్గిపోతుంది. కనుక మీరు ఇలాంటి తప్పులు చేయకుండా, మీ క్రెడిట్​ కార్డును సురక్షితమైన పద్ధతిలో వినియోగించి, క్రెడిట్ స్కోర్​ను పెంచుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.