ETV Bharat / business

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ బుకింగ్స్​​ షురూ.. కొత్త ఎస్​యూవీ ప్రత్యేకతలు ఇవే..

author img

By

Published : May 8, 2023, 4:23 PM IST

Hyundai Exter SUV Bookings : హ్యుందాయ్ మోటార్స్‌కు చెందిన ఎక్స్‌టర్‌ ఎస్​యూవీ.. మరికొద్ది రోజుల్లో మార్కెట్​లోకి విడుదల కానుంది. దీనికి సంబంధించి ప్రీ బుకింగ్స్​ను సంస్థ ప్రారంభించింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.

hyundai-exter-suv-bookings-and-hyundai-commenced-bookings-for-exter-in-india
హ్యుందాయ్ ఎక్స్‌టర్

Hyundai Exter SUV Bookings : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్‌ ఇండియా.. తన ఎక్స్‌టర్‌ ఎస్​యూవీని మార్కెట్​లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మరికొద్ది వారాల్లోనే ఈ కారును భారత్​ మార్కెట్​లో లాంఛ్​ చేసేందుకు సంస్థ సిద్ధమైంది. అందుకోసం బుకింగ్స్ ప్రారంభించినట్లు హ్యుందాయ్ సంస్థ సోమవారం ప్రకటించింది. దేశీయ మార్కెట్​లో ప్రీ-బుకింగ్​లను స్వీకరిస్తున్నట్లు తెలిపిన సంస్థ.. భారత్​లో ఉన్న తమ డీలర్ల ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చని పేర్కొంది. రూ.11 వేల టోకెన్​తో ఆన్​లైన్​లోనూ​ ముందుస్తు బుకింగ్​ చేసుకోవచ్చని తెలిపింది.

Hyundai Exter SUV Bookings Features : ఐదు సీట్ల సామర్థ్యం కలిగిన హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ ఎస్​యూవీ.. భారత మార్కెట్​లోని ఎంట్రీ-టు మిడ్-లెవల్ వేరియంట్‌లు అయిన టాటా పంచ్, సిట్రోయెన్ సీ3, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లతో పోటీ పడనుంది. ఈ ఎస్​యూవీని కూడా గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా వంటి కార్ల మాదిరిగానే సంస్థ రూపొందించింది. 1.2 లీటర్ల నేచురల్​ ఆస్పిరేటెడ్​ ఇంజిన్​తో.. కంపెనీ దీన్ని తయారు చేసింది. ఐదు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్లు ఇందులో ఉన్నాయి. 84 హార్స్​ పవర్ ఇంజిన్​తో​, 113 న్యూటన్ మీటర్ టార్క్‌ సామర్థ్యంతో ఈ కారు మార్కెట్​లోకి విడుదల కానుంది.

hyundai-exter-suv-bookings-and-hyundai-commenced-bookings-for-exter-in-india
హ్యుందాయ్ ఎక్స్‌టర్

హ్యుందాయ్ ఎక్స్‌టర్​ పెట్రోల్​తో పాటు సీఎన్​జీ వెర్షన్​లోనూ వస్తుంది. కారు ఇంటీరియర్​ చాలా భాగం.. గ్రాండ్​ ఐ10 మాదిరిగానే ఉంటుంది. ఈ కారులో టచ్ స్క్రీన్​, యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కంపాటబిలిటీ సౌకర్యాలు ఉన్నాయి. అదే విధంగా.. మౌంటెడ్ కంట్రోల్​తో మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్స్​, సెమీ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్​ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. EX, S, SX, SX(O), SX(O)కనెక్ట్​.. వంటి ఐదు వెరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంటుంది. కాస్మిక్ బ్లూ, రేంజర్ ఖాకీ అనే రెండు కొత్త రంగులు సహా మరికొన్ని స్పెషల్​ కలర్లతో.. 6 సింగిల్-టోన్, 3 డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లలో ఎక్స్​టర్​ను హ్యుందాయ్ సంస్థ తీసుకొస్తోంది.

భారత్​లో విడుదల కానున్న కొత్త కార్లు.. ధర రూ.10 లక్షల లోపే..
Upcoming Compact SUVs : మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్​లోకి సరికొత్త కార్లు విడుదల కానున్నాయి. ఇప్పుడున్న కార్లకే కొత్తగా మార్పులు చేసి.. పలు కంపెనీలు మార్కెట్​లోకి విడుదల చేస్తున్నాయి. వాటి ధర కేవలం రూ.10 లక్షల లోపే ఉండనున్నాయి. ఆ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​..
Tata Nexon Facelift : ఇప్పుడున్న నెక్సాన్​ మోడల్​కే కాస్త మార్పులు చేసి.. టాటా కంపెనీ ఈ కారును విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ కారు ప్రయోగ​ దశలో ఉంది. 2023 ఆగస్టులో ఈ కారును.. సంస్థ మార్కెట్​లో తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. 1.2 లీటర్​ డీఐ టర్బో ఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​తో.. 125 హార్స్​ పవర్​, 225 న్యూటన్ మీటర్ టార్క్‌ సామర్థాన్ని ఈ కారు కలిగి ఉంటుంది. అదే విధంగా 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సౌకర్యం ఇందులో ఉంది.

Tata Nexon Facelift
టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​

టాటా పంచ్ సీఎన్​జీ​..
Tata Punch CNG : 2023 ఆటో ఎక్స్​పోలో.. టటా సంస్థ ఆల్ట్రోజ్‌ సీఎన్​జీ కారుతో పాటు ఈ మోడల్​ కారును కూడా ఆవిష్కరించింది. ఈ కారును సంస్థ మే నెలలోనే లాంఛ్​ చేసే అవకాశాలు ఉన్నాయి. డెలివరీలు కూడా త్వరలోనే జరగనున్నాయి. 1.2 లీటర్ల నాచురల్​ ఆస్పిరేటెడ్​ ఇంజిన్​తో మూడు సిలిండర్లు, రెండు ఇంధన ​ట్యాంక్​లను కారు కలిగి ఉంటుంది. ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్లు ఈ కారులో ఉంటాయి.

Tata Punch CNG
టాటా పంచ్ సీఎన్​జీ

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​..
Kia Sonet Facelift : సోనెట్​ మోడల్ కారుకే​ కొన్ని మార్పులు చేసి తిరిగి కొత్తగా రూపొందించింది కియా కంపెనీ. కొద్ది వారాల క్రితమే మొదటి సారిగా ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్​లో కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా 2023 చివర్లో గానీ.. లేదంటే 2024 మొదట్లో గానీ మార్కెట్లోకి ఈ కారు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్ భారత్​లో 2024లో విడుదల కావచ్చు.

Kia Sonet Facelift
కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.