ETV Bharat / business

How to Apply for Aadhaar Card Franchise : బిజినెస్​ ఆలోచన చేస్తున్నారా..? ప్రభుత్వంతోనే వ్యాపారం చేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 12:36 PM IST

Aadhaar Card Franchise
How to Apply for Aadhaar Card Franchise

How to Apply for Aadhaar Center Franchise : మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా? సొంత పట్టణంలో ఉంటూ.. వ్యాపారం చేయాలని చూస్తున్నారా? అయితే.. మీకోసం ఓ చక్కటి ఆప్షన్ సిద్ధంగా ఉంది. అదే.. ఆధార్ ఫ్రాంఛైజీ! మరి, అది ఎలా పొందాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

How to Apply for Aadhaar Card Center in Telugu : మీరు ఏదైనా బిజినెస్(Business) పెట్టాలని చూస్తున్నారా? అయితే.. నేరుంగా ప్రభుత్వంతోనే మీరు వ్యాపారం చేయొచ్చు. దీనికోసం ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే.. ఎలాంటి సమస్యలనూ ఎందుర్కొవాల్సిన అవసరం లేదు. అదే.. ఆధార్ బిజినెస్. మరి, దీని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Aadhaar Card Franchise Application Process : ఇప్పుడు దేశంలోని ముఖ్య‌మైన గుర్తింపు కార్డుల్లో ఆధార్ అత్యంత ప్రధానమైనదిగా మారిపోయింది. దీని ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆసుపత్రి నుంచి బ్యాంకులు, కళాశాలలు, రేషన్‌ షాపులు ఇలా ప్రతిదగ్గర అందరికీ ఆధార్‌ కార్డ్‌ (Aadhaar card) అవసరం పడుతోంది. అలాగే ఎలాంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు పొందాలన్నా.. ఇది తప్పనిసరి. ఇలా రోజువారీ జీవితంలో ఏ పని చేయాలనుకున్నా ఆధార్​ కార్డు తప్పనిసరి అయింది. ఈ క్రమంలో మీరు ఆధార్ కార్డు ఫ్రాంచైజీ తీసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. ఎలాంటి పెట్టుబడి లేకుండానే నెలలో లక్షల రూపాయలు సంపాదించవచ్చు. పైగా ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు(Deposits), ముందస్తు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మరి, ఈ ఫ్రాంఛైజీని ఎలా సాధించాలి..? అన్నది చూద్దాం.

How to Get Aadhaar Card Franchise : మీరు ఆధార్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే.. మొదట దీని కోసం మీరు UIDAI నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించడానికి లైసెన్స్ ఇస్తారు. అప్పుడు మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి. దీని తర్వాత.. కామన్ సర్వీస్ సెంటర్ నుంచి రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఇక ఆధార్ ఫ్రాంచైజీ పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

How to Download Masked Aadhaar Card Online : ముఖానికి సరే.. ఆధార్​కు మాస్క్ తగిలించారా..? లేకపోతే...

ఆధార్ ఫ్రాంచైజీ లైసెన్స్ కోసం దరఖాస్తు ఇలా..

How to Apply for Aadhaar Franchise Licence :

  • ముందుగా మీరు NSEIT అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • అక్కడ 'Create New User' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీకు కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో షేర్ కోడ్‌ను నమోదు చేయమని అడుగుతారు.
  • ఆ షేర్ కోడ్ కోసం.. మీరు ఆఫ్‌లైన్ ఈ-ఆధార్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇలా మీరు షేర్ కోడ్, xml ఫైల్ రెండింటినీ డౌన్‌లోడ్ చేస్తారు. తర్వాత ప్రక్రియ ఇలా ఉంటుంది.
  • దరఖాస్తు చేసుకునేటప్పుడు స్క్రీన్‌పై ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన మొత్తం సమాచారాన్ని పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
  • దీంతో మీ యూజర్ ఐడీ, పాస్​వర్డ్ మీ ఫోన్, ఈ-మెయిల్​కు వస్తాయి.
  • ఆ తర్వాత వాటిని ఉపయోగించి ఆధార్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ పోర్టల్‌కి సులభంగా లాగిన్ కావచ్చు.
  • ఆపై మీకు కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది.. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు ఓపెన్ అయిన ఫారమ్​లో అడిగిన సమాచారాన్ని అందించాలి.
  • అనంతరం మీ వివరాలు చెక్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది.
  • ఆ తరువాత మీరు వినియోగదారులకు సేవలను అందించటం ప్రారంభించవచ్చు.

ప్రతి నెలా ఎంత సంపాదిస్తారంటే.. ఇలా మీరు ఆధార్ కార్డ్ సెంటర్ ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా సంపాదించడానికి మంచి అవకాశం ఉంటుంది. దీని ద్వారా రూ.30,000 నుంచి రూ.35,000 వరకు సులభంగా సంపాదించవచ్చు. అయితే ఇది ఈ సెంటర్‌కి వచ్చే కస్టమర్లపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది వస్తే ప్రతి నెల భారీగా ఆదాయం పొందవచ్చు.

Aadhaar Free Update Last Date : గుడ్ ​న్యూస్.. ఆధార్​ ఫ్రీ-అప్డేట్​కు అప్పటి వరకు​ గడువు పెంపు.. ఆన్​లైన్​లో చేసుకోండిలా..

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై బర్త్​ సర్టిఫికెట్​తో పాటు ఆధార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.