ETV Bharat / bharat

How to Check Aadhaar Update History in Online : ఆధార్ అప్​డేట్ చేసుకున్నారా.. లేదా..? ఇది చదవాల్సిందే..!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 3:05 PM IST

Aadhaar Update Status
Aadhaar Update

How to Get Aadhaar Update Status : ప్రతీ పదేళ్లకోసారి ఆధార్ కార్డు అప్​డేట్ చేసుకోవాలి. అయితే.. ఎలా అప్​డేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండానే మొబైల్​లో సింపుల్​గా మీ ఆధార్ కార్డు అప్​డేట్ చేసుకోవచ్చు. అలాగే అప్​డేట్ హిస్టరీ, స్టేటస్​ తెలుసుకోవచ్చు.. ఎలాగో మీరే చూడండి.

How to Check Aadhaar Update History in Telugu : దేశంలో ఆధార్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ.. పదేళ్లకోసారి ఆధార్​కు సంబంధించిన వివరాలను అప్​డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఎవరు ఆధార్ అప్​డేట్(Aadhaar Update) చేసుకోలేదో వారందరినీ అప్​డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. మొదట జూన్ 14 వరకూ ఉచిత అప్​డేట్ అవకాశాన్ని కల్పించిన యూఐడీఏఐ.. గడువును సెప్టెంబర్ 14 వరకు పెంచుతున్నట్లు పేర్కొంది.

Check Aadhaar Update History Online : ఈ ఉచిత సర్వీస్ అవకాశం ప్రత్యేకంగా మైఆధార్ పోర్టల్​లో అందుబాటులో ఉంటుంది. అదే ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం సర్వీస్ ఛార్జీ నిమిత్తం రూ.50 కట్టాలి. అలాగే మీ మొబైల్​ ఫోన్​లోనే యూఐడీఏఐ(UIDAI) అధికారిక వెబ్​సైట్​ https://myaadhaar.uidai.gov.inలో లాగిన్​ అయ్యి మీ ఆధార్​ను ఉచితంగా అప్​డేట్ చేసుకోండి. ఆధార్​లో పేరు, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా, ఫొటో లాంటి డేటాలో మార్పులు ఆన్​లైన్​లో ఇప్పుడే అప్​డేట్ చేసుకోండి. అయితే ఆన్​లైన్​లో ఆధార్​ కార్డు అప్​డేట్​, అప్​డేట్ స్టేటస్, అప్​డేట్ హిస్టరీ ఎలా చెక్​ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..

How to Update Aadhaar Card Details in Online Process :

ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోండిలా..

  • మొదట మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.inలో ఆధార్ స్వీయ-సేవ పోర్టల్‌ను సందర్శించాలి.
  • ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ, క్యాప్చా కోడ్ ఉపయోగించి పోర్టల్​కి లాగిన్ అవ్వాలి. ఈ ప్రక్రియను ప్రామాణికరించడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్​ నంబర్​కు ఓటీపీ వస్తుంది. దానిని టైప్ చేసి లాగిన్ అవ్వాలి.
  • అనంతరం డాక్యుమెంట్ అప్​డేట్ విభాగానికి వెళ్లాలి. అక్కడ ఇప్పటికే నమోదై ఉన్న వివరాలను సమీక్షించాలి.
  • ఆ తర్వాత డ్రాప్-డౌన్ జాబితా నుంచి మీరు దేనిని అప్​డేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోవాలి. ఆపై అసలు పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్​లోడ్ చేయాలి.
  • చివరగా Submit బటన్​పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ అప్​డేట్ ప్రక్రియ కొనసాగుతోంది.

Mobile Number Link To Aadhaar Card Online: ఆధార్​తో మొబైల్ నెంబర్‌ లింక్ చేశారా..? ఇలా నిమిషాల్లో చేసేయండి!

How to Check Aadhaar Update Status in Telugu :

ఆధార్ కార్డ్ అప్​డేట్ స్టేటస్ ఎలా చెక్​ చేసుకోవాలంటే..

  • మీరు ఆధార్ కార్డును అప్​డేట్ చేసిన తర్వాత.. ప్రక్రియ పూర్తయిందా? లేదా? చూడాలంటే.. ఈ ఈ స్టెప్స్ ఫాలోకావాలి.
  • మీరు మొదట UIDAI అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. హోమ్​పేజీలో My Aadhaar అనే ఆప్షన్​పై క్లిక్ చేసి.. Get Aadhaarలోకి వెళ్లి Aadhaar Update Status అనే ఆప్షన్​కు నావిగేట్ అవ్వాలి.
  • అనంతరం అక్కడ వచ్చిన అప్​డేట్ రశీదు స్లిప్​లో పేర్కొన్న ఎన్​రోల్​మెంట్ ఐడీని నమోదు చేయాలి. అలాగే మీ రిజిస్టర్​డ్ మొబైల్​ నంబర్​కు వచ్చిన క్యాప్చా కోడ్​ను టైప్ చేయాలి.
  • అప్పుడు మీ ఆధార్ కార్డు అప్​డేట్​ స్టేటస్​ను డ్రాఫ్ట్ స్టేజ్, చెల్లింపు దశ, ధ్రువీకరణ దశ, కంప్లీట్ అనే దశలలో స్టేటస్​ను స్క్రీన్​పై చూస్తారు.

మీరు రసీదు స్లిప్‌ను పోగొట్టుకుంటే..?

  • రసీదు పోగొట్టుకున్నా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.
  • మొదట మీరు ఎన్‌రోల్‌ మెంట్ నంబర్‌ తిరిగి పొందడానికి myAadhaar వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • అక్కడ అవసరమైన విభాగంలో.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో OTP పొందడానికి మీ పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా, సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయాలి.
  • ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి.. Verify OTPని క్లిక్ చేయాలి.
  • వెరిఫికేషన్ అనంతరం మీరు మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాలో నమోదు సంఖ్యను అందుకుంటారు.
  • చివరగా మీ ఈ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ని ఉపయోగించడం ద్వారా మీరు మీ ఆధార్ స్టేటస్​ను తెలుసుకోవచ్చు.

PVC Aadhar Card Apply : 'ఆధార్'​ పోయిందా? PVC కార్డ్​ కోసం అప్లై చేసుకోండిలా..

ఆధార్ అప్​డేట్ హిస్టరీని చెక్​ చేసుకోండిలా..

How to Check Aadhaar Update History in Online Method :

  • మొదట మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి www.uidai.gov.inని సందర్శించాలి.
  • ఆ తర్వాత My Aadhaar అనే ఆప్షన్​పై క్లిక్ చేసి.. Update Your Aadhaar అనే విభాగంలోకి వెళ్లాలి.
  • అక్కడ ఆధార్ Update History అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ వంటి మీ ఆధార్ వివరాలను నమోదు చేయాలి.
  • అనంతరం మీకు సెక్యూరిటీ కోడ్​ను ఎంటర్ చేయాలి.
  • అది కచ్చితంగా అందించకపోతే.. కొత్త సెక్యూరిటీ కోడ్​ను పొందడానికి 'Try Another' ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని అందుకోవడానికి Send OTPపై క్లిక్ చేయాలి.
  • చివరగా మీకు వచ్చిన OTPని నమోదు చేసి, Submit ఆప్షన్​పై క్లిక్ చేస్తే స్క్రీన్​పై మీ ఆధార్ కార్డు అప్​డేట్ హిస్టరీని చూడవచ్చు.

How To Lock And Unlock Aadhaar Card Online : ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ సేవలను లాక్, అన్‌లాక్ చేయడం తెలుసా..? చాలా ఈజీ..

How to Check Pan Aadhaar Link Status : లాస్ట్ డేట్ ముగిసిపోయింది.. మీ పాన్-ఆధార్ లింక్ అయ్యిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.