ETV Bharat / business

Mobile Number Link To Aadhaar Card Online: ఆధార్​తో మొబైల్ నెంబర్‌ లింక్ చేశారా..? ఇలా నిమిషాల్లో చేసేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 4:34 PM IST

Aadhaar–Mobile Linking: మీరు మీ మొబైల్ నెంబర్‌కి ఆధార్‌ను లింక్ చేశారా..?, ఒకవేళ చేయనట్లయితే.. ఈ స్టోరీలో పేర్కొన్న దశలను అనుసరించి ఇప్పుడే లింక్ చేయండి. లింక్ చేయని పక్షంలో అనేక రకాలుగా నష్టపోయే అవకాశాలు దండిగా ఉన్నాయి.

How to Link  Mobile Number With Aadhaar Card Online
Mobile Number Link To Aadhaar Card Online

How To Link Phone Number To Aadhaar: ఆధార్​తో మొబైల్ నంబర్‌కి లింక్ చేయాడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఆధార్‌ కార్డ్ విషయంలో బయోమెట్రిక్స్, అడ్రస్ ప్రూఫ్, ఫొటోతో సహా యూజర్ గుర్తింపు ధృవీకరణకు అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇటీవలే మొబైల్ నంబర్‌కి ఆధార్‌ను లింక్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రజలందరూ తమ మొబైల్ నంబర్‌కి ఆధార్‌ను లింక్ చేయడం ప్రారంభించారు. కానీ, చాలా మంది మొబైల్ నంబర్‌కి ఆధార్‌ను ఎలా లింక్ చేయాలో తెలియక సతమతమవుతున్నారు. సరైన అవగాహన లేక మొబైల్ నంబర్‌కి ఆధార్ కార్డ్ లింక్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి, మొబైల్ నెంబర్‌కి ఆధార్ కార్డ్‌ను ఎలా లింక్ చేయాలి..?, అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి..?, మొబైల్ నెంబర్‌ను లింక్ చేయకపోతే కలిగే నష్టాలు ఏమిటి..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మొబైల్ నెంబర్‌కి ఆధార్ కార్డ్ లింక్ చేయడం ఎలా..?
How To Link Aadhar Card To Mobile Number: మొబైల్ నంబర్‌కి ఆధార్‌‌ను అనుసంధానం చేయడాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే, ఒక వ్యక్తి తన మొబైల్ నెంబర్‌ను ఆధార్ కార్డ్‌కు స్వయంగా లింక్ చేసుకోవచ్చు. లేదా టెలికాం ఆపరేటర్ల సహాయం తీసుకుని లింక్ చేయవచ్చు. అదే సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల కోసం టెలికాం సంస్థలు రీ-వెరిఫికేషన్‌ పేరుతో డోర్ స్టెప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. లింకింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సర్వీస్ సెంటర్లలో ఐరిస్ స్కానింగ్ పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

How to Check Pan Aadhaar Link Status : లాస్ట్ డేట్ ముగిసిపోయింది.. మీ పాన్-ఆధార్ లింక్ అయ్యిందా?

మొబైల్ నెంబర్‌కి ఆధార్‌ను లింక్‌ చేసే మార్గాలు
Ways to Link Aadhaar To Mobile Number:

  • వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)
  • ఏజెంట్ అసిస్టెడ్ అథెంటికేషన్
  • IVRS సౌకర్యం
  • SMS ఆధారిత లింకింగ్

వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)
One Time Password (OTP): దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం ఆపరేటర్లు తమ వినియోగదారుల కోసం మొబైల్ ఫోన్‌లోనే ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింక్ చేసేలా OTP సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం టెలికాం ఆపరేటర్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. లేదా మీ సమీపంలో ఉన్న స్టోర్‌‌కి వెళ్లి ఆధార్‌కు మీ ఫోన్ నెంబర్‌ను లింక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఆపరేటర్లు OTPని ఉపయోగించి.. మీ మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌కు లింక్ చేస్తారు.

గడువులోగా పాన్​-ఆధార్​ లింక్ చేయలేకపోయారా?.. అయితే పాన్​ను ఇలా యాక్టివేట్​ చేసుకోండి!

మొబైల్ నెంబర్‌ను ఈ దశల ద్వారా ఆధార్‌కి లింక్ చేయొచ్చు
Mobile Number Can Be Linked With Aadhaar Through These Steps:

  • మొదటి దశ (First Step): ముందుగా మీ సంబంధిత టెలికాం ఆపరేటర్ వెబ్ పోర్టల్‌ని ఓపెన్ చేయండి
  • రెండవ దశ (Second Step): ఆధార్ నంబర్‌కు లింక్ చేయాల్సిన మీ మొబైల్ నెంబర్‌ను నమోదు చేయండి
  • మూడవ దశ (Third Step): ఆ తర్వాత మీ టెలికాం ఆపరేటర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి OTPని పంపుతుంది
  • నాల్గవ దశ (Fourth Step): OTPని నమోదు చేసి, సమర్పించు అనే బటన్‌పై క్లిక్ చేయండి
  • ఐదవ దశ (Fifth step): స్క్రీన్‌పై ఒక మేసేజ్ కనిపిస్తుంది. మరింత ముందుకు కొనసాగించడానికి మీ అనుమతిని కోరుతుంది
  • ఆరవ దశ (Sixth Step): ఆ తర్వాత లింక్ చేయాల్సిన మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను జాగ్రత్తగా నమోదు చేయండి
  • ఏడవ దశ (Seventh Step): ఆ తర్వాత OTP కోసం మీ టెలికాం ఆపరేటర్ UIDAIకి రిక్వెస్ట్ పంపుతారు
  • ఎనిమిదవ దశ (Eighth Step): ఆ తర్వాత మీరు e-KYC వివరాల గురించి UIDAI నుండి అనుమతి సందేశాన్ని అందుకుంటారు. దాన్ని పూర్తిగా చదివి అంగీకరించు అనే ఆప్షన్‌పై క్లికి చేయండి.
  • తొమ్మిదవ దశ (Ninth Step): ఆ తర్వాత మీ ఫోన్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.
  • పదవ దశ (Tenth Step): ఆ తర్వాత మీ ఆధార్‌కు మీ ఫోన్ నంబర్‌ లింక్ అయినట్లు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

PAN Aadhaar Link : ఆధార్​తో పాన్​ లింక్​ మర్చిపోకండి.. మరో 10 రోజులే గడువు​.. జత చేయండిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.