ETV Bharat / business

Honda New Model Launch 2023 : స్టన్నింగ్​ ఫీచర్స్​తో.. హోండా, కేటీఎం డ్యూక్​ బైక్స్​ లాంఛ్​​.. ధర ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 3:00 PM IST

2023 Honda CB300F Specifications And Price
Honda New Bike Launch Honda CB300F 2023

Honda New Model Launch 2023 : హోండా మోటార్​సైకిల్​ అండ్​ స్కూటర్​ ఇండియా సరికొత్త బైక్​ను ఇండియన్​ మార్కెట్​లో లాంఛ్​ చేసింది. అలాగే 2023 Honda CB300F పేరుతో విడుదలైన ఈ మోడల్​ ధర ఎంతంటే..

Honda New Model Launch 2023 : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్స్​ మరో సరికొత్త మోడల్​ 2023 Honda CB300F బైక్​ను భారత విపణిలో విడుదల చేసింది. హోండా డీలక్స్​ ప్రో వేరియెంట్​ల తరహాలోనే దీన్ని కూడా తీర్చిదిద్దారు. స్పోర్ట్స్​ రెడ్​, మ్యాట్​ మార్వెల్​ బ్లూ మెటాలిక్​, మ్యాట్​ యాక్సిస్​ గ్రే మెటాలిక్​ కలర్స్​ వేరియంట్స్​లో ఈ మోడల్​ను తీసుకువచ్చారు. ఈ నయా బైక్​ బుకింగ్స్​​ సెప్టెంబర్​ 11 నుంచి ప్రారంభమయ్యాయి.

స్పెక్స్​ అండ్​ ఫీచర్స్​!
Honda CB300F Specs And Features :

  • స్మార్ట్​ఫోన్​ వాయిస్​ కంట్రోల్​ సిస్టమ్​(HSVCS)
  • డ్యుయెల్​ డిస్క్ బ్రేక్స్ ​(276mm ఫ్రంట్​ & 220mm రియర్​)
  • 5 లెవెల్స్​ కస్టమైజెబుల్​ బ్రైట్​నెస్​తో డిజిటల్​ ఇన్​స్ట్రూమెంటల్​ ప్యానెల్​
  • అసిస్ట్​ స్లిప్పర్​ క్లచ్​
  • 6 స్పీడ్​ గేర్​​బాక్స్​
  • LED లైటింగ్​ సిస్టమ్​
  • డ్యూయెల్ ఛానల్​ ABS
  • 5 స్టెప్​ అడ్జెస్టెబుల్​ రియర్​ మోనో షాక్స్
  • సస్పెన్షెన్​ కోసం గోల్డెన్​ USD ఫ్రంట్​ ఫోర్క్స్​
  • స్పీడోమీటర్,​ ఓడోమీటర్​, ట్యాకోమీటర్​, ఫ్యూయెల్​ గేజ్​, ట్విన్​ ట్రిప్​ మీటర్స్​, గియర్​ పోజిషన్​ ఇండికేటర్​, క్లాక్​.

ఇంజిన్​ స్పెసిఫికేషన్స్​
Honda CB300F Engine Specs : ఈ లేటెస్ట్ బైక్​లో BS6 OBD II కంప్లైయంట్​ 293cc సింగిల్​-సిలిండర్​ పెట్రోల్​ ఇంజీన్​ను అమర్చారు. ఇది 24 bhp​ పవర్​, 25.6 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

హోండా సీబీ300ఎఫ్​ ధర
Honda CB300F Price : హోండా సీబీ300ఎఫ్ బైక్​ ధర రూ.1.70 లక్షలు (ఎక్స్​-షోరూం)గా ఉంది.

KTM నుంచి మరొ రెండు కొత్త Duke మోడల్స్​!
KTM New Bike Deals : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేటీఎం​.. రెండు ప్రీమియం బైక్​ల​ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. 2024 కేటీఎం జెన్​-3 డ్యూక్​ 390, డ్యూక్​ 250 పేర్లతో ఈ సరికొత్త మోడళ్లను లాంఛ్​ చేసింది. 2024 Gen-3 KTM Duke సిరీస్​కు అప్​డేటెట్​ వెర్షెన్​గా పలు కీలక మార్పులతో వీటిని తీసుకువచ్చారు. అడ్వాన్స్​డ్​ ఫీచర్స్​ను ఈ రెండు మోడల్స్​లో చూడవచ్చు. కాగా, వీటికి సంబంధించిన బుకింగ్ ధరలు​ రూ.4,499 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మోడల్స్​లో అత్యాధునిక టెక్నాలజీని వాడారు. సింగిల్​ సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్స్​తో తక్కువ బరువు(లైట్​వెయిట్​)తో వస్తున్న వీటి స్పెక్స్​ అండ్​ ఫీచర్స్​ ఇలా ఉన్నాయి.

KTM New Bike Launch In India
KTM 250 Duke Bike

స్పెక్స్​ అండ్​ ఫీచర్స్​!
KTM Duke Bike Features :

  • స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీ
  • రైడ్​ బై వైర్​ టెక్నాలజీ
  • టైప్​-సీ ఛార్జింగ్​ పోర్ట్
  • టర్న్​ బై టర్న్​ నావిగేషన్
  • 5 అంగుళాల TFT డిస్​ప్లే
  • సూపర్​మోటో ABS సిస్టమ్
  • ఆఫ్​సెట్​ రియర్​ మోనో-షాక్​
  • LC4c సింగిల్​-సిలిండర్​ ఇంజీన్స్​
  • WP APEX అడ్జెస్టెబుల్ సస్పెన్షన్​
  • కంప్రెషన్​ అడ్జెస్టెబుల్​ ఫోర్క్స్​ అప్​ఫ్రంట్​
  • ఆప్టిమైజ్డ్​ సిలిండర్​ హెడ్స్​, గియర్​బాక్సెస్​
  • 10-క్లిక్​ ప్రీలోడ్​ అడ్జెస్టెబుల్​ రియర్​ మోనో-షాక్​
  • భద్రత కోసం మోటార్​సైకిల్​ ట్రాక్షన్​ కంట్రోల్​ (MTC)

ఇంజీన్​ వివరాలు!

  • KTM 390 Duke - 399-cc ఇంజీన్​
  • KTM 250 Duke - 250-cc ఇంజీన్

కలర్​ ఆప్షన్స్​!

  • అట్లాంటిక్​ బ్లూ
  • ఎలక్ట్రానిక్​ ఆరెంజ్​ మెటాలిక్​

Duke ప్రైజ్​ ట్యాగ్​!

  • Gen-3 Duke 390 ధర - రూ.3.10 లక్షలు
  • Gen-3 Duke 250 ధర - రూ.2.39 లక్షలు
    KTM New Bike Launch In India
    KTM 250 Duke Bike
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.