ETV Bharat / business

Gold Rate Today 5th October 2023 : స్వల్పంగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 9:34 AM IST

Updated : Oct 5, 2023, 10:28 AM IST

Gold PRICE Today 5th October 2023
Gold Rate Today 5th October 2023

Gold Rate Today 5th October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 5th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.58,335 ఉండగా.. గురువారం రూ.50 పెరిగి రూ.58,385కు చేరింది. బుధవారం కిలో వెండి ధర రూ.68,875 ఉండగా.. గురువారం రూ.420 పెరిగి రూ.69,295కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 5th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.58,385గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.69,295గా ఉంది.
  • Gold Price In Vijayawada 5th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.58,385గా ఉంది. కిలో వెండి ధర రూ.69,295కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 5th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,385గా ఉంది. కిలో వెండి ధర రూ.69,295గా ఉంది.
  • Gold Price In Proddatur 5th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.58,385కిలో వెండి ధర రూ.69,295కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 5th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1820 డాలర్లుగా ఉండగా.. గురువారం 8 డాలర్లు పెరిగి, ప్రస్తుతం 1828 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 21.22 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 5th October 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.23,03,900 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,03,900
ఇథీరియంరూ.1,36,797
టెథర్రూ.83.20
బైనాన్స్ కాయిన్ రూ.17,721
యూఎస్​డీ కాయిన్​రూ.83.20

స్టాక్​ మార్కెట్ అప్​డేట్స్​
Stock Market Today 5th October 2023 : గురువారం దేశీయ స్టాక్​మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తున్న నేపథ్యంలో.. దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 383 పాయింట్లు లాభపడి 65,609 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 108 పాయింట్లు వృద్ధి చెంది 19,545 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : టైటాన్​, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టీసీఎస్​, టాటా మోటార్స్​, విప్రో, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్​, ఎస్​బీఐ
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : పవర్​గ్రిడ్​, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్​టెల్​, యాక్సిస్ బ్యాంక్​

రూపాయి విలువ!
Rupee Open 5th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి రూ.83.20 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 5th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 5th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.71 మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 86.42 డాలర్లుగా ఉంది.

How Is Gold Price Calculated In India : భారతదేశంలో బంగారు ఆభరణాల విలువను ఎలా లెక్కిస్తారో.. మీకు తెలుసా?

Cheapest Gold Market In The World : చౌకగా బంగారం కొనాలా?.. ఆ 7 దేశాల్లో డెడ్​ చీప్​గా పసిడి నగలు దొరుకుతాయ్!

Last Updated :Oct 5, 2023, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.