ETV Bharat / business

Cheapest Gold Market In The World : చౌకగా బంగారం కొనాలా?.. ఆ 7 దేశాల్లో డెడ్​ చీప్​గా పసిడి నగలు దొరుకుతాయ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 1:48 PM IST

Cheapest Gold Market In The World In Telugu : మీరు బంగారం కొనాలని అనుకుంటున్నారా? తక్కువ ధరకే పసిడి నగలు దొరికితే బాగుంటుందని ఆశపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో బంగారం, నగలు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఆ దేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

cheapest countries to buy gold
Cheapest Gold Market In The World

Cheapest Gold Market In The World : భారతీయ మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ప్రతి శుభకార్యానికి, పండగలకు కొత్తగా బంగారు నగలు కొనాలని ఆశపడుతూ ఉంటారు. కానీ పండగల సీజన్​లో మార్కెట్​లోని పసిడి ధరలు బాగా పెరిగిపోతుంటాయి. అందువల్ల ధర అధికంగా ఉన్నప్పటికీ, కొనకతప్పని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.

ఆ దేశాల్లో కారుచౌకగా బంగారం!
Country With Lowest Gold Price : మన దేశంలో సాధారణంగానే బంగారానికి డిమాండ్​ ఎక్కువగా ఉంటుంది. కనుక బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పండుగ సీజన్​లో ధరలు మరింతగా పెరుగుతాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం పండగ సీజన్​లో చాలా తక్కువ ధరకే బంగారం లభిస్తుంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. హాంకాంగ్​ : ఆసియాలోని ప్రముఖ బంగారం మార్కెట్లలో హాంకాంగ్​ ఒకటి. వాస్తవానికి ఇది అత్యంత ప్రధానమైన ఆర్థిక, వ్యాపార కేంద్రం అని చెప్పుకోవచ్చు. హాంకాంగ్​లోని వివిధ నగరాలు, ప్రదేశాల్లో చాలా తక్కువ ధరకే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
  2. యూఎస్​ఏ : అమెరికాలో కారుచౌకగా బంగారం లభిస్తుంది అంటే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజం. వాస్తవానికి హాంకాంగ్ కంటే కూడా చాలా తక్కువ ధరకే పసిడి ఆభరణాలను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. మంచిగా బేరం ఆడేవాళ్లు.. కచ్చితంగా యూఎస్​లో అత్యంత తక్కువ ధరకే బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు.
    gold ornaments
    బంగారు నగలు
  3. దుబాయ్​ : దుబాయ్​లో బంగారంపై జీరో టాక్స్ లేదా లో టాక్స్ విధానం ఉంది. అంటే పసిడి ఆభరణాలపై ఎలాంటి పన్ను విధించడం జరగదు. ఒకవేళ విధించినా అది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది దుబాయ్​ వెళ్లి మరీ బంగారు నగలు కొంటుంటారు.
  4. సౌదీ అరేబియా : పండుగలు, ప్రత్యేకమైన సందర్భాల్లో సౌదీ అరేబియాలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కానీ అక్కడ గోల్డ్ టాక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా తక్కువ ధరకే బంగారు నగలు లభిస్తూ ఉంటాయి.
  5. తుర్కియే (టర్కీ) : బంగారు హస్తకళలో టర్కీకి సుదీర్ఘమైన, అద్భుతమైన చరిత్ర ఉంది. చరిత్రను చూసుకుంటే.. ఇస్తాంబుల్ నగరం ఎన్నో వేల ఏళ్ల క్రితం నుంచే సుప్రసిద్ధమైన పసిడి మార్కెట్​గా భాసిల్లుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే.. ఇక్కడ పసిడి ఆభరణాలు చాలా తక్కువ ధరకే లభిస్తాయి.
    gold jewelry
    బంగారు ఆభరణాలు
  6. మలేసియా : ఆసియా ఖండంలోని మలేసియాలో గోల్డ్ మార్కెట్ క్రమంగా, విస్తృతంగా పెరుగుతోంది. కౌలాలంపూర్​లో ప్రసిద్ధమైన బంగారం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ పండుగలు, వేడుకల సమయంలో చాలా తక్కువ ధరకే పసిడి నగలు లభిస్తూ ఉంటాయి.
    gold items
    పసిడి ఆభరణాలు
  7. సింగపూర్​ : సింగపూర్​లో చాలా పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలను అనుసరించి బంగారం విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి వ్యాపారులు.. బంగారు నగలపై మంచి డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ మీకు చాలా తక్కువ ధరకే పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
    gold
    పుత్తడి ఆభరణాలు

నోట్​ : మార్కెట్ పరిస్థితులను అనుసరించి బంగారం ధరల్లో మార్పులు వస్తూ ఉంటాయి. కనుక కొనుగోలు చేసే ముందు వివిధ మార్కెట్లలోని ధరలను ఒకసారి సరిచూసుకొని పసిడి నగలు కొనుగోలు చేయడం మంచిది.

How much Gold We Can Buy in Cash? : ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎంత వరకు బంగారం కొనుగోలు చేయవచ్చు.. పరిమితి దాటితే..!

Bank Holidays In October 2023 : అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.