ETV Bharat / business

Gold Storage Limit : టాక్స్ లేకుండా ఇంట్లో బంగారమెంత ఉంచొచ్చు?

author img

By

Published : Jul 13, 2023, 8:11 PM IST

gold storage limit in india
gold storage limit in india

Gold Income Tax Rules : బంగారం అంటే ఇష్టపడని భారతీయులు ఎవరుంటారు? అందులోనూ మన దేశ మగువలు బంగారమంటే చాలా ఇష్టపడతారు? పసిడి లేని ఇళ్లు చాలా తక్కువ ఉంటాయి. పన్ను లేకుండా ఎంత బంగారాన్ని నిల్వ చేసుకోవచ్చు?.. అసలు పసిడి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఎలా విధిస్తారు అనే అంశాలు తెలుసుకోండి.

Gold Income Tax Rules : అత్యంత ప్రజాదరణ పొందిన లోహాల్లో బంగారం ఒకటి. దీని వ్య‌క్తిగ‌తంగా వాడ‌ుతుంటారు. పెట్టుబ‌డి గానూ వినియోగిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్​ది మొదటి స్థానం. ఇది చాలు మనోళ్లకు బంగారమంటే ఎంత ఇష్టమో చెప్పటానికి. ముఖ్యంగా మన ఆడపడుచులు పసిడిని ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్షయ తృతీయ లాంటి పండగలు మొదలు.. పెళ్లి, సందర్భం ఏదైనా జువెల్లరీ షాపుల గడప తొక్కాల్సిందే. మన దేశంలో బంగారం లేని ఇల్లు చాలా తక్కువనే చెప్పాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) ఇటీవలే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత.. గోల్డ్​కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆయా నివేదికలు దీన్ని స్పష్టం చేశాయి. మీరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇంట్లో గరిష్ఠంగా ఎంత వరకు బంగారం నిల్వ చేసుకోవచ్చు?.. పసిడి ద్వారా వచ్చే ఆదాయంపై ఎంత పన్ను విధిస్తారో తదితర విషయాల్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

Gold Storage Limit In India : జనరల్​గా మీ ఇంట్లో బంగారం ఉంచుకోవడానికి పరిమితి లేదు. ఎంతైనా ఉంచుకోవచ్చు. కానీ ఒకవేళ ఇన్​కమ్ టాక్స్ రైడ్స్ జరిగితే.. మీరు ఆ ఆభరణాలు కొనుగోలు చేయడానికి, గోల్డ్ పెట్టుబడికి ఆదాయం ఎలా వచ్చింది అనే విషయాలు చూపగలగాలి. అన్ని లెక్కలు సరిగ్గా ఉంటేనే పరిమితి లేకుండా ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు. లేని పక్షంలో పన్ను కట్టాల్సి ఉంటుంది.

మరోవైపు బంగారం నిల్వపై కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. Central Board of Direct Taxes (CBDT) ప్రకారం.. ఎలాంటి పన్ను చెల్లింపుల గోల లేకుండా, ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేకుండా కొంత బంగారం ఉంచుకోవచ్చు. పెళ్లైన మహిళలు 500 గ్రాములు, పెళ్లికాని మహిళలు 250 గ్రాములు ఉంచుకోవచ్చు. అదే పురుషులు విషయానికి వస్తే.. ఎలాంటి ఆధారాలు చూపించకుండా 100 గ్రాముల బంగారం నిల్వ చేసుకోవచ్చు.

''బంగారాన్ని వ్యక్తిగత అవసరాలకు, పెట్టుబడి పెట్టేందుకు రెండు రకాలుగా కొనుగోలు చేస్తారు. అయితే చాలా మంది తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. దీనికోసం మార్కెట్​ను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటారు. కానీ పసిడిని ఎప్పుడు కొన్నా.. దానిపై పన్ను కూడా ఉంటుంది'' అని రాధికా విశ్వనాథన్ అనే నిపుణులు తెలిపారు. ఏది ఏమైనా పసిడి కొనుగోలుపై ప్రత్యక్ష పన్ను ఉండదు. కానీ కొనుగోలు చేసే సమయంలో అందించే పాన్ కార్డు ఆధారంగా వివరాల్ని అధికారులు తెలుసుకుంటారు.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పన్ను పరోక్షంగా ఉంటుంది. మొదటగా ఇది బంగారు కడ్డీలు, నాణేలు, ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. అదే మేకింగ్, గోల్డ్ స్మిత్ సేవల ఛార్జీల విషయంలో 2 శాతం అదనంగా అంటే 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇక విదేశాల నుంచి స్వర్ణం దిగుమతి చేసుకుంటే.. కస్టమ్స్ డ్యూటీ, అగ్రికల్చర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, డెవలప్​మెంట్ సెస్, జీఎస్టీ రూపంలో మరింత చెల్లించాల్సి ఉంటుంది.

మరి ఇన్​కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు బంగారం సంబంధించిన సమాచారం చూపించాలా అనే ప్రశ్నకు విశ్వనాథన్ సమాధానం చెప్పారు. పన్ను చెల్లింపు దారుల ఆదాయం మొత్తం రూ. 50 లక్షలకు మించి ఉంటే వారు ఐటీఆర్లో దేశీల ఆస్తుల్లో (డొమెస్టిక్ అసెట్స్) భాగంగా బంగారం నిల్వ వివరాలు చూపించాలి. మరి గోల్డ్ అమ్మితే టాక్స్ ఉంటుందా అంటే.. హోల్డింగ్ పిరయడ్ 3 ఏళ్లలోపు ఉంటే 20 శాతం పన్ను కట్టాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.