ETV Bharat / business

Gold Rate Today 3rd October 2023 : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 10:13 AM IST

gold-rate-today-3rd-october-2023-and-cryptocurrency-trading-today-petrol-and-deiseal-prices-today
ఈ రోజు బంగారం ధరలు

Gold Rate Today 3rd October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 3rd October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.59,150 ఉండగా.. మంగళవారం రూ.750 తగ్గి రూ.58,400కి చేరింది. సోమవారం కిలో వెండి ధర రూ.71,800 ఉండగా.. మంగళవారం రూ.2800 తగ్గి రూ.69,000 చేరుకుంది.

  • Gold Price In Hyderabad 3rd October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.58,400గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.69,000గా ఉంది.
  • Gold Price In Vijayawada 3rd October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.58,400గా ఉంది. కిలో వెండి ధర రూ.69,000గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 3rd October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,400గా ఉంది. కిలో వెండి ధర రూ.69,000గా ఉంది.
  • Gold Price In Proddatur 3rd October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.58,400కిలో వెండి ధర రూ.69,000గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 3rd October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1844 డాలర్లుగా ఉండగా.. మంగళవారం కూడా 1848 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 21 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 3rd October 2023 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,95,595 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,95,595
ఇథీరియంరూ.1,38,617
టెథర్రూ.83.19
బైనాన్స్ కాయిన్రూ.17,916
యూఎస్​డీ కాయిన్​రూ.83.18

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 3rd October 2023 : అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 347 పాయింట్లు నష్టపోయి 65,481 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 117 పాయింట్లు కోల్పోయి 19,521 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ :
మారికో, మహానగర్ గ్యాస్, ఫెడరల్ బ్యాంక్, వేదాంత, ఎల్​ అండ్​ టీ.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ :
ఓఎన్​జీసీ, ఎమ్​సీఎక్స్​ ఇండియా, ఐచర్ మోటార్స్, హిండాల్కో, ఎస్కార్ట్స్ కుబోటా.

రూపాయి విలువ!
Rupee Open 3rd October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు తగ్గి రూ.83.23 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 3rd October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 3rd October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు భారీగా తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 88.04 డాలర్లుగా ఉంది.

How To Get Fancy Registration Number For Vehicle : మీ బండికి ఫ్యాన్సీ నంబర్ కావాలా?.. సింపుల్​గా అప్లై చేసుకోండిలా!

How To Save Money Using Credit Card : పండుగ షాపింగ్ చేయాలా?.. ఈ క్రెడిట్ కార్డ్​ టిప్స్​తో.. మస్త్​ డబ్బులు ఆదా చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.