ETV Bharat / business

Gold Rate Today 10th October 2023 : క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 9:24 AM IST

Updated : Oct 10, 2023, 10:54 AM IST

Gold Price Today 10th October 2023
Gold Rate Today 10th October 2023

Gold Rate Today 10th October 2023 : దేశంలో గోల్డ్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు సిల్వర్​ రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 10th October 2023 : దేశంలో పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.59,080 ఉండగా.. మంగళవారం రూ.320 పెరిగి రూ.59,400కు చేరింది. సోమవారం కిలో వెండి ధర రూ.70,845 ఉండగా.. మంగళవారం రూ.20 తగ్గి రూ.70,825కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 10th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.59,400గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.70,825గా ఉంది.
  • Gold Price In Vijayawada 10th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,400గా ఉంది. కిలో వెండి ధర రూ.70,825కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 10th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,400గా ఉంది. కిలో వెండి ధర రూ.70,825గా ఉంది.
  • Gold Price In Proddatur 10th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,400గా ఉంది. కిలో వెండి ధర రూ.70,825కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 10th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1851 డాలర్లుగా ఉండగా.. మంగళవారం ఏకంగా 12 డాలర్లు పెరిగి 1863 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 21.85 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 10th October 2023 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,95,123 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,95,123
ఇథీరియంరూ.1,31,313
టెథర్రూ.83.20
బైనాన్స్ కాయిన్రూ.17,154
యూఎస్​డీ కాయిన్రూ.83.21

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 10th October 2023 : మంగళవారం దేశీయ స్టాక్​మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఏషియన్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 293 పాయింట్లు లాభపడి 65,805 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 86 పాయింట్లు వృద్ధి చెంది 19,598 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : టాటామోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​సీఎల్ ​టెక్, యాక్సిస్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఏషియన్ పెయింట్స్​, టీసీఎస్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​

రూపాయి విలువ!
Rupee Open 10th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి రూ.83.24 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 10th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Amazon Great Indian Festival 2023 Offers : అమెజాన్​​ బంపర్ బొనాంజా​.. ట్యాబ్లెట్స్​పై 80%.. స్మార్ట్​టీవీలపై 63% డిస్కౌంట్​!

Cars Discounts In October 2023 : కొత్త కారు కొనాలా?.. ఆ కారుపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్​.. బెస్ట్ ఆఫర్స్​ కూడా!

Last Updated :Oct 10, 2023, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.