ETV Bharat / business

Gold Forecast : బంగారం​ కొనాలా?.. వచ్చే వారం గోల్డ్​ రేట్లు తగ్గే ఛాన్స్​!

author img

By

Published : Aug 6, 2023, 11:37 AM IST

gold rate today
Gold Forecast

Gold Forecast : బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సమయంలో అత్యవసరంగా బంగారం కొనాలని భావిస్తున్నవారు.. కాస్త రేట్లు తగ్గితే బాగుంటుందని ఆశిస్తూ ఉంటారు. అయితే వచ్చే వారం గోల్డ్ రేట్లు కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దానికి కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Gold Forecast : మీరు బంగారం కొనాలని అనుకుంటున్నారా? గోల్డ్ రేట్లు మరింత దిగివస్తే బాగుంటుందని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్​ న్యూస్. వచ్చే వారంలో గోల్డ్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గింది!
గ్లోబల్ రేటింగ్​ ఏజెన్సీ ఫిచ్​.. అమెరికా క్రెడిట్ రేటింగ్​ను AAA నుంచి AA+ కి తగ్గించింది. గత ముడేళ్ల వ్యవధిలో యూఎస్​ అప్పుల భారం పెరగడం, ప్రభుత్వ పరిపాలనా ప్రమాణాలు తగ్గడమే ఇందుకు కారణం.

పెరిగిన యూఎస్ దిగుమతులు!
యూఎస్​ దిగుమతుల గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. ముఖ్యంగా 2022 అక్టోబర్​ తరువాత అమెరికా దిగుమతులు 4.2 శాతం మేర పెరిగాయి. ఇది కూడా యూఎస్​ ఎకానమీపై నెగిటివ్​ ఇంపాక్ట్​ చూపిస్తోందని ఫిచ్​ పేర్కొంది. అయితే బైడెన్​ ప్రభుత్వం ఫిచ్​ నివేదికను తీవ్రంగా వ్యతిరేకించింది.

ఆయిల్​ సరఫరా కోత!
సౌదీ అరేబియా తన ముడిచమురు ఉత్పత్తిపై 1 mbpd మేరకు స్వచ్ఛందంగా కోత విధించుకుంది. ఈ ముడిచమురు ఉత్పత్తి కోత సెప్టెంబర్​ వరకు కొనసాగనుంది. మరోవైపు రష్యా కూడా ముడి చమురు ఎగుమతులపై కోత విధించింది. దీని వల్ల రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా భారీగా పెరిగే అవకాశం ఉంది.

చైనాతో కష్టమే!
చైనా ఇబ్బందుల్లో ఉన్న తన ఆర్థిక వ్యవస్థను మరింత ఉత్తేజపరచడానికి, వినియోగం పెంచడానికి చర్యలు చేపడుతోంది. దీని వల్ల పారిశ్రామిక ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ముడిచమురు వినియోగం కూడా బాగా పెరుగుతుంది. దీని వల్ల కచ్చితంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు దీనిని నియంత్రించడం కేంద్ర బ్యాంకులకు కష్టతరమవుతుంది.

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్​ ఆఫ్​ ఇంగ్లాండ్​
అందరూ ఊహించిన విధంగానే బ్యాంక్​ ఆఫ్ ఇంగ్లాండ్​ వడ్డీ రేట్లను 25 బేసిస్​ పాయింట్లు మేర పెంచింది. అయితే ఇంగ్లాండ్ భవిష్యత్​ మానిటరీ పాలసీ మేకింగ్​ కోసం ఇంకా చాలా డేటాను పరిశీలించాల్సి ఉంటుంది.

ఉద్యోగిత తగ్గుతోంది!
యూఎస్​ వ్యవసాయేతర పేరోల్​ రిపోర్ట్​ ప్రకారం, అమెరికన్​ కంపెనీలు జులైలో కేవలం 1,87,000 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించాయి. గత రెండు నెలల గణాంకాలతో పోల్చితే దాదాపు 49 వేలు ఉద్యోగాలు తక్కువగా కల్పించబడ్డాయి. అంటే యూఎస్​లో నిరుద్యోగ రేటు పెరిగింది. ఫలితంగా యువత ఆదాయం కూడా బాగా తగ్గింది.

బలహీనపడిన డాలర్​ ఇండెక్స్
అమెరికాలో ఒక వైపు యూఎస్​ డాలర్ ఇండెక్స్​ బలహీనపడితే, మరోవైపు బాండ్లు మంచి లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం బంగారం ధరలు 0.47 శాతం మేర పెరిగాయి. ఫలితంగా ఔన్స్​ గోల్డ్​ ధర 1942.90 వద్ద ముగిసింది. అదే సమయంలో యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.44 శాతం తగ్గి 102.01 వద్ద ముగిసింది.

ద్రవ్యోల్బణం పెరుగుతుందా?
వచ్చేవారం, ఇన్వెస్టర్లు యూఎస్​ సీపీఐ ఇన్​ఫ్లేషన్​ (జులై), పీపీఐ (జులై), ఆగస్టు ద్రవ్యోల్బణం అంచనాలపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. ఇది కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

గోల్డ్ రేట్లు తగ్గే అవకాశం!
ప్రస్తుతం గోల్డ్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్​గా లేవు. వరల్డ్ గోల్డ్​ కౌన్సిల్​ ప్రకారం, కేంద్ర బ్యాంకులు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కేవలం రూ.102.9 మెట్రిక్​ టన్నుల బంగారం మాత్రమే కొనుగోలు చేశాయి. గతేడాది ఇదే సమయంలో కేంద్ర బ్యాంకులు 158.6 మెట్రిక్​ టన్నుల మేర బంగారాన్ని కొనుగోలు చేయడం గమనార్హం. అంటే ఈ ఏడాది గోల్డ్​ కొనుగోళ్లు బాగా తగ్గాయి.

ఆగస్టు 3 వరకు ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్​ హోల్డింగ్స్​ వరుసగా 9 రోజుల పాటు నష్టాల్లో కొనసాగాయి. మరోవైపు యూఎస్​ డాలర్​ ఇండెక్స్ మరింత దిగజారే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సెంట్రల్​ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో బంగారం ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని మార్కెట్​ నిపుణులు అంచనా వేస్తున్నారు.

నోట్​: ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. బులియన్​ మార్కెట్​ను ప్రిడిక్ట్​ చేయడం దీని ఉద్దేశం కాదు. ఈ విషయాన్ని మీరు గమనించగలరు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.