ETV Bharat / business

Bank Holidays In September 2023 : బ్యాంక్​ హాలీడే అలెర్ట్​.. సెప్టెంబర్​ చివరి వారంలోని సెలవులు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 3:05 PM IST

Bank Holidays In September 2023 In Telugu : బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్​. సెప్టెంబర్​ నెల మరో 5 రోజుల్లో ముగియనుంది. అయితే వీటిలో 4 రోజులపాటు బ్యాంకులకు సెలవు. అందువల్ల అర్జెంట్​గా చేయాల్సిన బ్యాంకింగ్ పనులు ఏమైనా ఉంటే, త్వరగా చక్కబెట్టుకోండి. మీ కోసం సెలవుల జాబితా ఇక్కడ ఇస్తున్నాం.

September 2023 Bank Holidays
Bank Holidays In September 2023

Bank Holidays In September 2023 : రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, సెప్టెంబర్​ చివరి వారంలో 4 రోజులు బ్యాంకులకు సెలవు. కనుక బ్యాంక్ పనులు ఉన్నవారు, వీలైనంత వరకు త్వరగా తమ పనులు చేసుకోవడం మంచిది.

పండుగ సెలవులు!
Festivals In September 2023 : సెప్టెంబర్​ నెలలో దాదాపు 16 రోజులు బ్యాంకులకు సెలవు దినాలుగా ఉన్నాయి. వీటిలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారం సెలవులు కూడా కలిసి ఉన్నాయి. అయితే సెప్టెంబర్​ చివరి వారంలో 4 బ్యాంక్ హాలీడేస్ ఉన్నాయి. ఇవన్నీ ఆయా రాష్ట్రాల్లోని పండుగలను అనుసరించి వచ్చిన సెలవులు.

బ్యాంకింగ్ సేవలు ఆగవు!
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లేదా నగరాల్లో పండగులు ఉన్నప్పటికీ, బ్యాంక్​ బ్రాంచ్​లు మాత్రం పనిచేస్తాయి. ఒక వేళ బ్యాంకులు పనిచేయకపోయినా, ఆన్​లైన్ బ్యాంకింగ్ సర్వీసులు మాత్రం కచ్చితంగా పనిచేస్తాయి. అందువల్ల ఆర్థిక లావాదేవీలు, బ్యాలెన్స్ చెకింగ్​ సహా ఇతర ముఖ్యమైన బ్యాంకింగ్ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు.

ఆర్​బీఐ సెలవులను ఎలా ప్రకటిస్తుంది?
హాలీడే అండర్ నెగోషియబుల్​ ఇన్​స్ట్రుమెంట్స్​​ యాక్ట్​​; హాలీడే అండర్​ నెగోషియబుల్​ ఇన్​స్ట్రుమెంట్స్​ యాక్ట్​ అండ్​ రియల్​ టైమ్​ గ్రాస్​ సెటిల్మెంట్​ హాలీడే; బ్యాంక్స్​ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్​.. ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తుంది.

రాష్ట్రానికి రాష్ట్రానికి సెలవులు మారతాయి!
వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లోనూ ఒక విధంగా సెలవులు ఉండవు. జాతీయ, ప్రాంతీయ పండుగలు ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా గుర్తించుకోవాలి.

సెప్టెంబర్ చివరి వారంలోని బ్యాంక్ సెలవులు!
List Of Bank Holidays In September 2023 :

  • సెప్టెంబర్ 25 : శ్రీమంత శంకర్​దేవ్ జన్మోత్సవం సందర్భంగా అసోంలోని అన్ని బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.
  • సెప్టెంబర్​ 27 : మిలాద్-ఇ-షెరీఫ్​ అంటే ముహమ్మద్ ప్రవక్త జన్మదినం. అందువల్ల జమ్ము, కేరళ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు ఇవ్వడం జరిగింది.
  • సెప్టెంబర్​ 28 : ఈద్​-ఇ-మిలాద్​/ ఈద్-ఇ-మీలాదున్నబి/ బారావఫత్​ అంటే ప్రవక్త మొహమ్మద్ పుట్టిన రోజు. అందుకే ఈ రోజున గుజరాత్​, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్​, తెలంగాణ, మణిపుర్​, ఉత్తరప్రదేశ్​, దిల్లీ, ఛత్తీస్​ఘర్​, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • సెప్టెంబర్​ 29 : ఇంద్రజాత్ర/ ఈద్​-ఇ-మిలాద్​-ఉత్​-నబీ సందర్భంగా జమ్ము, శ్రీనగర్​, సిక్కిం రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.