ETV Bharat / business

క్యూ4లో ఇన్ఫీ అదుర్స్​- రూ.9,200 కోట్ల బై బ్యాక్ ఆఫర్​

author img

By

Published : Apr 14, 2021, 5:05 PM IST

కరోనా సంక్షోభంలోను 2020-21 క్యూ4కి గానూ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​ రూ.5,076 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సర నికర లాభం రూ.19,351 కోట్లుగా తెలిపింది.

Indian IT firm Infosys
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి గానూ రూ.5,076 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ లాభం 17.5 శాతం ఎక్కువని తెలిపింది. ఇదే సమయానికి ఆదాయం కూడా 13.1 శాతం పెరిగి.. రూ.26,311 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది.

2020-21 పూర్తి సంవత్సర నికర లాభం రూ.19,351 కోట్లుగా పేర్కొంది ఇన్ఫీ. ఆదాయం రూ.1,00,472 కోట్లుగా వివరించింది.

కోరనా వంటి సంక్షోభంలోనూ భారీ లాభాలను గడించిన ఇన్ఫోసిస్​.. రూ.9,200 కోట్లతో షేర్ల బై బ్యాక్ ఆఫర్​ను ప్రకటించింది. ఇందుకు సంస్థ డైరెక్టర్ల బోర్డు ఆమోదం కూడా తెలిపినట్లు వెల్లడించింది. ఒక్క షేర్​ను గరిష్ఠంగా రూ.1,750తో బై బ్యాక్​ చేయనున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి:ఫ్లిప్​కార్ట్​లో స్మార్ట్​ఫోన్లపై 50% వరకు డిస్కౌంట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.