ETV Bharat / business

మెగా ఐపీఓకు పేటీఎం రెడీ- టార్గెట్ రూ.18,300 కోట్లు!

author img

By

Published : Oct 28, 2021, 5:40 PM IST

డిజిటల్​ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం పబ్లిక్‌ ఇష్యూ ఆఫర్​ (ఐపీఓ) నవంబరు 8న ప్రారంభం కానుంది. ఐపీఓ ద్వారా 18,300 కోట్లు సమీకరించాలని పేటీఎం భావిస్తోంది.

Paytm
పేటీఎం ఐపీఓ

డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం పబ్లిక్‌ ఇష్యూ ఆఫర్​(ఐపీఓ) నవంబరు 8న ప్రారంభం కానుంది. అదే నెల 10 తేదీతో ముగియనుంది. ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.2,080-రూ.2,150గా ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపాయి.

దీంతో దేశంలో అతిపెద్ద ఐపీఓ ఇదే కానుంది. దశాబ్దం క్రితం కోల్‌ ఇండియా ఐపీఓ ద్వారా రూ.15,000 కోట్లను సమీకరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.