ETV Bharat / business

Jio Recharge: డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్లాన్లు

author img

By

Published : Sep 1, 2021, 7:03 AM IST

jio new plans
జియో కొత్త ప్లాన్లు

డిస్నీ+ హాట్‌స్టార్‌(Disney Plus Hotstar) కంటెంట్‌ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను జియో(Jio new plans) విడుదల చేసింది. ఇవి సెప్టెంబరు 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్‌ ధరలను పెంచిన నేపథ్యంలోనే జియో(Jio Recharge) కూడా ప్లాన్ల ఖరీదును సవరించింది. ఈ కొత్త ప్లాన్లతో అపరిమిత వాయిస్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌, జియో యాప్స్‌ వంటి ప్రయోజనాలు అందనున్నాయి.

డిస్నీ+ హాట్‌స్టార్‌ కంటెంట్‌(Disney Plus Hotstar) సబ్‌స్క్రిప్షన్లతో కూడిన కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను జియో(Jio new plans) విడుదల చేసింది. త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్‌ సీజన్‌కు ముందు వీటిని తీసుకురావడం గమనార్హం. ఇవి సెప్టెంబరు 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్‌కు పాత ప్లాన్లతో సబ్‌స్క్రైబ్‌ అయిన వారికి ఆయా ప్లాన్ల ప్రయోజనాలు(Jio recharge) కాలపరిమితి ముగిసే వరకు అందనున్నాయి.

డిస్నీ+ హాట్‌స్టార్‌ ధరలను పెంచిన నేపథ్యంలోనే జియో కూడా ప్లాన్ల ఖరీదును(Jio prepaid recharge plans) సవరించింది. ఈ కొత్త ప్లాన్లతో డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత వాయిస్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌, జియో యాప్స్‌ వంటి ప్రయోజనాలు అందనున్నాయి. అలాగే డిస్నీ+ ఒరిజినల్స్‌, డిస్నీ టీవీ షోలు, మార్వెల్‌, స్టార్‌ వార్స్‌, నేషనల్‌ జియోగ్రాఫిక్‌, హెచ్‌బీఓ, ఎఫ్‌ఎక్స్‌, షోటైం వంటి ఇంటర్నేషనల్‌ కంటెంట్‌నూ వీక్షించవచ్చు.

  • 28 రోజుల కాలపరిమితి కలిగిన రూ.499 ప్లాన్‌ కింద డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ప్రతిరోజు 3 జీబీ డేటా లభిస్తుంది. ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, వాయిల్‌ కాల్స్‌ కూడా ఉంటాయి.
  • 56 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ.666 మరో ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ప్రతిరోజు 2 జీబీ డేటా లభిస్తుంది. ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, వాయిల్‌ కాల్స్‌ యథావిధిగా ఉంటాయి.
  • రూ.888 ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌, 84 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2 జీబీ డేటా, ఉచిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇవే ప్రయోజనాలతో ఏడాది కాలపరిమితి కలిగిన ప్లాన్‌ కూడా ఉంది. దీని ధర రూ.2,599.
  • వీటితో పాటు ఓ యాడ్‌ఆన్‌ ప్లాన్‌ని కూడా ప్రవేశపెట్టారు. రూ.549లతో 56 రోజుల వ్యాలిడిటీ, డైలీ 1.5 జీబీ డేటా లభిస్తుంది. అయితే, ఎలాంటి ఉచిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు లభించవు.

ఇదీ చూడండి: దేశ జీడీపీ రికార్డు- క్యూ1లో 20.1 శాతం వృద్ధి

ఇదీ చూడండి: Digital Gold: ఒక్క రూపాయితో బంగారం కొనొచ్చు.. కానీ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.