క్రెడిట్ కార్డ్​ ఉందా? ఈ ఆఫర్స్ అస్సలు మిస్​ అవ్వొద్దు!

author img

By

Published : Mar 11, 2022, 4:03 PM IST

credit card

credit card with multiple offers: క్రెడిట్‌ కార్డు మీ చేతిలో నగదుతో సమానం. మీకు అవసరమైనప్పుడు తోడుండే ఒక నేస్తం. ఖర్చు చేసిన తర్వాత లభించే వ్యవధి, ఈఎంఐ సౌకర్యం, మంచి క్రెడిట్‌ స్కోరును పొందేందుకు వీలు ఇలా ఈ కార్డుతో వెసులుబాట్లు ఎన్నో ఉన్నాయి. నగదు, యూపీఐతో లావాదేవీలు చేయడం సాధ్యం కానప్పుడు క్రెడిట్‌ కార్డునే ఉపయోగిస్తుంటారు. వీటి ద్వారా చేసిన ఖర్చుకు కొంత రాయితీలు, ప్రత్యేక ఆఫర్లూ లభిస్తుంటాయి. కాబట్టి, వాటి గురించి తెలుసుకుంటే.. పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం సాధ్యం అవుతుంది.

credit card with multiple offers: క్రెడిట్ కార్డు ఉంటే చేతిలో నగదు ఉన్నట్లే. ఖర్చు చేసిన తర్వాత లభించే వ్యవధి, ఈఎంఐ సౌకర్యం, మంచి క్రెడిట్‌ స్కోరును పొందేందుకు వీలు ఇలా ఈ కార్డుతో వెసులుబాట్లు ఎన్నో ఉన్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా చేసిన ఖర్చుకు కొంత రాయితీలు, ప్రత్యేక ఆఫర్లూ లభిస్తుంటాయి. ఇటీవల కాలంలో పలు సంస్థలు కో బ్రాండెడ్‌ కార్డులను విడుదల చేస్తున్నాయి. వీటిపై ప్రత్యేక రాయితీలను అందిస్తున్నాయి. కొన్ని అప్పటికప్పుడే అందుతుండగా, మరికొన్ని దీర్ఘకాలంలో ఉపయోగపడతాయి. కో బ్రాండెడ్‌ ట్రావెల్‌ కార్డు తీసుకున్నప్పుడు విమానం టిక్కెట్లపై 5 శాతం వరకూ నగదు వెనక్కి సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఇది ప్రతిసారీ ఉంటుంది. మరికొన్ని క్రెడిట్‌ కార్డులు సందర్భానుసారంగా రాయితీలు, ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. మరి వీటి గురించి ఎలా తెలుసుకోవాలి..

ఇ-మెయిల్‌ చూస్తుండండి..

క్రెడిట్‌ కార్డు సంస్థలు తరచూ ఆఫర్‌ల గురించి కార్డుదారుడికి ఇ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేస్తాయి. కాబట్టి, మీ మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్లు కార్డు సంస్థ దగ్గర అప్‌డేట్‌ చేసుకోవాలి. కొన్నిసార్లు మెయిల్‌ వచ్చినా స్పామ్‌ ఫోల్డర్‌లోకి వెళ్లిపోతుంది. దీన్ని పట్టించుకోకపోతే ఆఫర్ల విషయం తెలియకపోవచ్చు. కాబట్టి, ఒకసారి ఆ మెయిల్‌ను ఇన్‌బాక్స్‌లోకి తీసుకెళ్లాలి. అప్పుడు మీకు క్రెడిట్‌ కార్డు నుంచి వచ్చే ప్రతి సమాచారమూ తెలుస్తుంది.

వెబ్‌సైటులో..

కార్డు ద్వారా అందుతున్న ప్రయోజనాలను సంస్థలు ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్లలో పెడుతుంటాయి. బ్యాంకు మొబైల్‌ యాప్‌లోనూ ఆ వివరాలు కనిపిస్తాయి. అప్పుడప్పుడూ ఈ సమాచారాన్ని చూస్తుండాలి. మీరు క్రెడిట్‌ కార్డు పరిమితి పెంచుకునేందుకు, వేరే రకం కార్డును తీసుకోవాలనుకున్నా.. దానికి సంబంధించిన సమాచారం వెబ్‌సైటులోనే అందుబాటులో ఉంటుంది.

వ్యాపారుల నుంచి..

ఇ-కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి, పెద్ద బ్రాండ్‌ షోరూంల వరకూ క్రెడిట్‌ కార్డులపై కొనుగోలు చేసేవారికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంటాయి. ఇలాంటివి ఏమున్నాయో గమనిస్తూ ఉండండి. మీకు నచ్చిన వస్తువు కొనుగోలు చేసేటప్పుడు దానికి ఎవరు ఎంత రాయితీ ఇస్తున్నారన్నది చూసుకోండి. కొన్ని ఆఫర్‌లు పరిమిత కాలం వరకూ ఉంటాయి. కాబట్టి, లావాదేవీలు నిర్వహించే ముందు గడువు తేదీని
తనిఖీ చేయండి.

సేవా కేంద్రంలో..

మీ క్రెడిట్‌ కార్డుపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి మీకు సరైన సమచారం లభించడం లేదు అనుకుందాం. ఇలాంటప్పుడు మీరు కార్డు సంస్థ వినియోగదారుల సహాయ కేంద్రాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఒక వెబ్‌సైటు నుంచి విమాన టిక్కెట్‌ బుక్‌ చేయాలనుకున్నప్పుడు రూ.500 తగ్గింపు లభిస్తుందనుకుందాం. కానీ, కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి, ఇంతకన్నా మంచి ఆఫర్‌ ఏమన్నా ఉందా అని వాకబు చేయొచ్చు. కొన్నిసార్లు రూ.1,000 తగ్గింపు దొరికే అవకాశమూ లేకపోలేదు.

క్రెడిట్‌ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు ఏమున్నాయో తెలుసుకునేందుకు కొన్ని ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లూ ఉన్నాయి. వీటిని పరిశీలించవచ్చు. మీకు కావాల్సిన వస్తువును కొనేముందు, దాని వాస్తవ ధర ఎంతో తెలుసుకోవాలి. అప్పుడు నిజంగా రాయితీ లభిస్తుందా లేదా తెలుస్తుంది. ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులుంటే.. ఏ కార్డుతో ఎక్కువ ప్రయోజనాలున్నాయో సరిచూసుకోండి. అధిక రాయితీ ఇస్తున్న కార్డునే వినియోగించండి. నిబంధనలు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కార్డు వివరాలు, ఓటీపీ లాంటివి ఎవరితోనూ పంచుకోవద్దు.

ఇదీ చదవండి: రాబడి హామీ పాలసీలు లాభమేనా?

ఊగిసలాటలో స్టాక్​ మార్కెట్లు.. ఫ్లాట్​గా సూచీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.