ETV Bharat / briefs

ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్​కు హైకోర్టులో ఊరట!

author img

By

Published : Jun 10, 2019, 5:06 PM IST

Updated : Jun 10, 2019, 7:18 PM IST

హైకోర్టులో ఊరట!

ఐటీగ్రిడ్స్ డైరెక్టర్ అశోక్​కు పలు షరతులతో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్ట్ కోర్టుకు అప్పగించాలని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ధర్మాసనం షరతులు విధించింది.

ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్​కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆధార్, ఇతర వ్యక్తిగత వివరాలు చౌర్యం చేశారన్న కేసులో అశోక్​కు ధర్మాసనం పలు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్టు కోర్టుకు అప్పగించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. విచారణకు ప్రతిరోజూ పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు విధించింది. మాదాపూర్​లో ప్రధాన కార్యాలయం ఉన్న ఐటీగ్రిడ్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్, ఇతర వ్యక్తిగత డేటా చోరీ చేసిందని మాదాపూర్, ఎస్​ఆర్​నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఐటీగ్రిడ్స్​కు సంబంధించిన కేసులన్నీ కలిపి విచారణ జరిపేందుకు ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటయింది. తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని అశోక్ వాదించారు. అశోక్​కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని... ఇప్పటికే విచారణకు సహకరించడం లేదని నోటీసులు ఇచ్చినా.. స్పందించడం లేదని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. అశోక్​కు పలు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్​కు హైకోర్టులో ఊరట!

ఇవీ చూడండి: అంతర్జాతీయ క్రికెట్​కు యువరాజ్​ గుడ్​బై

Last Updated :Jun 10, 2019, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.