ETV Bharat / bharat

ఎంపీల సస్పెన్షన్​పై వెంకయ్య కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Dec 2, 2021, 1:34 PM IST

Venkaiah on MPs suspension: 12 మంది సభ్యులను పెద్దల సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని అప్రజాస్వామికమని ఎందుకు అభివర్ణిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గత ప్రభుత్వాలు సైతం ఈ విధంగా సస్పెన్షన్​లు విధించాయని గుర్తు చేశారు. సస్పెన్షన్ ఎందుకు విధించారన్న విషయంపై ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు.

Venkaiah on MPs suspension
Venkaiah on MPs suspension

Venkaiah on MPs suspension:పెద్దల సభ నుంచి 12 మంది సభ్యులను సస్పెండ్ చేయడంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సస్పెన్షన్​ను ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎందుకు అభివర్ణిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఇలా సస్పెన్షన్ విధించడం ఇదే తొలిసారి కాదని, 1962 నుంచి 2010 వరకు 11 సార్లు జరిగిందని చెప్పారు. నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు.. సస్పెన్షన్​ ఎందుకు విధించారన్న కారణాలపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అన్నారు.

"12 మంది సభ్యులపై సస్పెన్షన్ విధించడాన్ని కొందరు సభ్యులు, నేతలు.. అప్రజాస్వామికంగా అభివర్ణిస్తున్నారు. వారి ప్రచారంలో ఏదైనా వాస్తవికత ఉందేమోనని ఆలోచించా. కానీ నేను అర్థం చేసుకోలేకపోయా. గత ప్రభుత్వాలు సైతం ఇలాంటి సస్పెన్షన్​లు విధించాయి. అవన్నీ అప్రజాస్వామికమే అవుతాయా? అలా అయితే.. ఎందుకు అన్ని సార్లు సస్పెన్షన్ విధించారు?"

-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్

Rajya Sabha Members suspended:

గత సమావేశాల్లో సభను అపవిత్రం చేసేలా ప్రవర్తించినందుకే సభ్యులపై వేటు వేసినట్లు వెంకయ్య తెలిపారు. ఈ విషయాన్ని సభలోనూ స్పష్టంగా చెప్పానని తెలిపారు. సభను అపవిత్రం చేసే చర్యను ప్రజాస్వామ్యయుతంగా.. వారిపై వేటు వేయడాన్ని అప్రజాస్వామికంగా ప్రచారం చేయాలని చూడటం దురదృష్టకరమని అన్నారు. అయితే, దేశ ప్రజలు ఇలాంటి కొత్త పోకడలను పరిగణనలోకి తీసుకోరని విశ్వాసం వ్యక్తం చేశారు.

Suspension on Rajya Sabha MPs:

గత వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన ఎంపీలపై క్రమశిక్షణా చర్యల కింద వేటు వేశారు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​ నారాయణ్​ సింగ్. కాంగ్రెస్​ సహా పలు పార్టీలకు చెందిన 12 మందిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు​. శీతాకాల సమావేశాల తొలిరోజే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి 12 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్​ చేయడం చరిత్రలో ఇదే తొలిసారి.

Pressure on Centre MPs suspension:

దీనిపై విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్​డీయేతర పార్టీలకు చెందిన చాలా వరకు ఎంపీలు సస్పెన్షన్​ను వ్యతిరేకిస్తున్నారు. నిరసనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనకు లెఫ్ట్ పార్టీ ఎంపీలు సైతం వచ్చి మద్దతు ఇచ్చారు.

ప్రభుత్వంపై వీలైనంత ఒత్తిడి పెడుతున్నామని సీపీఎం ఎంపీ ఎలవరం కరీం పేర్కొన్నారు. తెరాస వంటి పార్టీలు తమకు మద్దతు ప్రకటించాయని చెప్పారు. ప్రస్తుతం కేంద్రం ఒత్తిడికి లోనవుతోందని అన్నారు. మోదీ సర్కారు భయపడటం.. సానుకూల అంశమని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: 'కాలుష్యం తగ్గకపోయినా పాఠశాలలు ఎందుకు తెరిచారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.