ETV Bharat / bharat

చిన్న పిల్లల బుగ్గ గిల్లడం నేరమా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Aug 29, 2021, 2:43 PM IST

Touching cheeks of child without sexual intent not offence: HC
చిన్న పిల్లల బుగ్గ గిల్లడం నేరమా?.. హైకోర్టు తీర్పుతో క్లారిటీ

ఓ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారి బుగ్గలు గిల్లిన ఓ వ్యక్తికి బెయిల్​ మంజూరు చేసింది. ఇలా చేయడం నేరంగా పరిగణించలేమని పేర్కొంది.

చిన్నపిల్లల బుగ్గలు గిల్లడం నేరమా? ఓ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్​​ విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు దీనిపై స్పష్టత ఇచ్చింది. లైంగిక ఉద్దేశం లేకుండా చిన్నపిల్లల చెంపలు తాకడం నేరంగా పరిగణించలేమని తెలిపింది. జస్టిస్ సందీప్ శిందేతో కూడిన ఏక సభ్య ధర్మాసనం నిందితుడికి బెయిల్​ మంజూరు చేస్తూ ఆగస్టు 27న ఈ తీర్పునిచ్చింది.

" నా అభిప్రాయంలో లైంగిక ఉద్దేశం లేకుండా చెంపలు తాకడం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాదు. పోక్సో చట్టంలోని సెక్షన్​ 7లో ఇదే ఉంది. నిందితుడు లైంగిక ఉద్దేశంలోనే చిన్నారి చెంపను తాకినట్లు రికార్డులోని ప్రాథమిక మూల్యంకనం సూచించడం లేదు" అని కోర్టు తెలిపింది.

అయితే తన పరిశీలనలు బెయిల్ పిటిషన్ల విచారణకు మాత్రమే వర్తిస్తాయని జస్టిస్ సందీప్ శిందే స్పష్టం చేశారు. ఇతర కేసుల విచారణను ఇది ఏమాత్రం ప్రభావితం చేయదని పేర్కొన్నారు.

ఏం జరిగిందంటే..

ముంబయిలో మాంసం దుకాణం నడిపే 46 ఏళ్ల ఉల్లా.. 2020 జులైలో ఓ ఎనిమిదేళ్ల చిన్నారిని తన షాపులోకి తీసుకెళ్లి బుగ్గలు గిల్లాడు. అనంతరం తన చొక్కా విప్పి బాలికపై అఘాయిత్యం చేయబోయాడు. అయితే చిన్నారిని ఇల్లా దుకాణంలోకి తీసుకెళ్లడం గమనించిన ఓ మహిళ అనుమానంతో అక్కడికి వెళ్లింది. అప్పుడే నిందితుడు తన ప్యాంటు విప్పబోతున్నాడు. వెంటనే ఆ మహిళ చిన్నారిని అక్కడి నుంచి తీసుకెళ్లి పోలీసులకు సమాచారం అందించింది.

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని నవీ ముంబయిలోని తలోజా జైల్లో ఉంచారు.

వ్యాపారంలో శత్రువులు కావాలనే తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు మోపుతున్నారని ఉల్లా బెయిల్ పిటిషన్​లో పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: వ్యక్తిని చితకబాది.. ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.