ETV Bharat / bharat

వ్యక్తిని చితకబాది.. ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లి..

author img

By

Published : Aug 29, 2021, 11:16 AM IST

బండికి అడ్డువచ్చి కిందపడేందుకు కారణమయ్యాడనే కోపంతో ఓ గిరిజన వ్యక్తిని చితకబాది(attack on tribals), ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లిన(person dragged by truck) సంఘటన మధ్యప్రదేశ్​ నీమచ్​ జిల్లాలో జరిగింది. చికిత్స పొందుతూ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్​గా(Viral news) మారాయి.

dragged with a car
బాధితుడు కన్హయలాల్​ భీల్

ట్రక్కుకు కట్టి వ్యక్తిని ఈడ్చుకెళ్లిన దుండగులు

ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది(attack on tribals), తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన(person dragged by truck) అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్​ నీమచ్​ జిల్లాలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా(Viral news) మారాయి.

ఇదీ జరిగింది..

జిల్లాలోని సింగోలీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బండ గ్రామానికి చెందిన కన్హయలాల్​ భీల్​(40) సింగోలీ- నీమచ్​ ప్రధాన రహదారిపై గత గురువారం నిలుచుని ఉన్నాడు. ఛితర్​ మాల్​ గుర్జార్​ అనే పాల వ్యాపారి ద్విచక్రవాహనంపై వచ్చి భీల్​ను ఢీకొట్టి కిందపడిపోయాడు. పాలు మొత్తం ఒలికిపోయాయి. పాలు నేలపాలయ్యాయనే కోపంతో భీల్​పై దాడి చేశాడు గుర్జార్​. ఆ తర్వాత తన స్నేహితులను పిలిచి.. కొట్టించాడు. అందరు కలిసి భీల్​ కాళ్లకు తాడు కట్టి.. పికప్​ ట్రక్కు వెనకాల కట్టేసి కొంత దూరం ఈడ్చుకెళ్లారు(person dragged by truck).

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే.. దాడికి పాల్పడిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు.. బాధితుడిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ భీల్​ మృతి చెందాడు.

మొత్తం ఎనిమిది మందిపై ఐపీసీ సెక్షన్​ 302, సహా ఇతర సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సూరజ్​ కుమార్​ వర్మ తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్​ చేశామని.. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ద్విచక్రవాహనం, ఓ పికప్​ ట్రక్కు సహా నాలుగు వాహనాలు, బాధితుడికి కట్టిన తాడును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

అమానవీయం..​

ఈ ఘటనపై ట్వీట్​ చేశారు మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు కమల్​నాథ్​. ఈ సంఘటన అమానవీయమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కారకులను కఠినంగా శిక్షించాలన్నారు.

  • ये मध्यप्रदेश में हो क्या रहा है…?

    अब नीमच ज़िले के सिंगोली में कन्हैयालाल भील नाम के एक आदिवासी व्यक्ति के साथ बर्बरता की बेहद अमानवीय घटना सामने आयी है ?

    मृतक को चोरी की शंका पर बुरी तरह से पीटने के बाद उसे एक वाहन से बांधकर निर्दयता से घसीटा गया, जिससे उसकी मौत हो गयी ? pic.twitter.com/96r1zUQBDs

    — Kamal Nath (@OfficeOfKNath) August 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ఫోన్​ దొంగలించి.. యజమానిని ఈడ్చుకెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.