ETV Bharat / bharat

ఒలింపిక్​ వీరులకు పార్లమెంట్​లో హర్షధ్వానాలు

author img

By

Published : Aug 9, 2021, 1:18 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై పార్లమెంట్​ ఉభయ సభలు ప్రశంసలు కురిపించాయి. లోక్​సభలో బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు సభ్యులు. 2020 ఒలింపిక్స్​ భారత్​కు మరిచిపోలేనిదిగా కొనియాడారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శనతో ఎదురవుతున్న నిరాశ, నిస్పృహ, అవిశ్వాస భావాలను ఈ ఒలింపిక్​ తొలగించిందన్నారు.

Tokyo Olympics
పార్లమెంట్​లో హర్షధ్వానాలు

టోక్యో ఒలింపిక్స్​లో భారత ప్రదర్శనపై రాజ్యసభలో ప్రశంసలు కురిపించారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. 121 ఏళ్ల విశ్వక్రీడల ప్రయాణంలో 2020 ఒలింపిక్స్​ భారత్​కు అత్యున్నతమైనదని కొనియాడారు. 'ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పేలవమైన ప్రదర్శనతో ఎదురయ్యే నిరాశ, నిస్పృహ, అవిశ్వాస భావాలను తొలగిస్తూ.. మేము కూడా చేయగలం అని చెప్పేందుకు చాలా సమయం పట్టింద'న్నారు.

"1980 వరకు మన హాకీ పురుషుల జట్టుకు గోల్డెన్​ రికార్డు ఉంది. కొంత మంది అథ్లెట్ల ద్వారా మంచి ప్రదర్శనలు చూశాం. కొన్నేళ్లుగా ఒలింపిక్స్​లో పేలవమైన ప్రదర్శనతో మన దేశం ఆత్మగౌరవం, విశ్వాసం, నమ్మకం, ఆశను కోల్పోయే స్థాయికి చేరుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ దేశమూ తలెత్తుకోలేదు. మెడల్స్​ సాధించటం కంటే క్రీడల్లో పాలుపంచుకోవాలనే స్ఫూర్తిని ఈ ఒలింపిక్స్​ నింపింది. అయితే.. పతకాల సంఖ్య ఏ దేశానికైనా క్రీడా నైపుణ్యాలకు తుది సాక్ష్యంగా నిలుస్తుంది. ఒలింపిక్​​ మెడల్స్​ సాధించటం వల్ల అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు అంతర్జాతీయంగా ఆదరణ చూరగొంటాయి. ఒలింపిక్​ పతకాల సంఖ్య పరంగా చూస్తే.. భారత్​ చాలా కాలంగా నిరాశకు గురైంది. అత్యధిక పతకాలు గెలవటంలోనే కాదు, చాలా మంది అథ్లెట్లు మెడల్​ గెలిచే రౌండ్ల వరకు వెళ్లటంలోనూ... టోక్యో ఒలింపిక్స్​ భారత్​కు అత్యుత్తమం."

-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్

జావెలిన్​ త్రోలో గోల్డ్​ మెడల్​ సాధించిన నీరజ్​ చోప్డాను ప్రశంసించారు వెంకయ్య. అదే రోజున రెజ్లర్​ బజరంగ్​ పునియ కాంస్యం సాధించినట్లు గుర్తు చేసుకున్నారు. మహిళా అథ్లెట్లు సైతం పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు, బాక్సర్​ మేరీ కోమ్​ విజయాలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే, ఆర్మీ, ఇతర రంగాలు, కోచ్​లు, సహాయ సిబ్బంది, క్రీడల విభాగాలను ప్రశంసించారు.

లోక్​సభలోనూ..

టోక్యో ఒలింపిక్స్​లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. పతకాలు సాధించిన వారికి అభినందనలు తెలిపారు. జావెలిన్​ త్రోలో పసిడి పతకం సాధించిన నీరవ్​ చోప్డా పేరు చెప్పగానే బల్లలు చరుస్తూ.. అభినందనలు తెలిపారు సభలోని ఎంపీలు. టోక్యో ఒలింపిక్స్​లో భారత్​ అత్యధిక మెడల్స్​ సాధించటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శన యువతలో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు స్పీకర్​.

ఇదీ చూడండి: Tokyo Olympics: ఆటలో ఓడినా.. స్ఫూర్తి రగిలించారు..!

Olympics 2020: ఈ ఒలింపిక్స్​లో 'భారత' పతక విజేతలు వీరే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.