ETV Bharat / bharat

అట్టహాసంగా పలమేడు జల్లికట్టు పోటీలు

author img

By

Published : Jan 15, 2021, 9:14 AM IST

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు అట్టహాసంగా సాగుతోంది. శుక్రవారం మధురై జిల్లాలోని పలమేడులో ఈ పోటీలు జరుగుతున్నాయి. సుమారు 650 ఎద్దులు బరిలో నిలిచాయి.

jallikattu
అట్టహాసంగా పలమేడు జల్లికట్టు పోటీలు

తమిళనాడువ్యాప్తంగా సంక్రాంతి సందడి కొనసాగుతోంది. సంప్రదాయ జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. మధురై జిల్లాలోని పలమేడులో ఈ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బసవన్నల రంకెలు, వాటిని అదుపు చేసేందుకు యువకుల ప్రయత్నాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ పోటీలు చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు.

అట్టహాసంగా పలమేడు జల్లికట్టు పోటీలు

పలమేడు జల్లికట్టులో సుమారు 650 ఎద్దులు పాల్గొన్నాయని నిర్వహకులు తెలిపారు. మరోవైపు.. కొవిడ్​-19 నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో పోటీదారుల సంఖ్య 150, ప్రేక్షకుల సంఖ్య 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. బరిలో నిలిచే యువకులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్​ నివేదిక అందించాలని తెలిపింది.

jallikattu
ఎద్దును అదుపు చేసేందుకు పోటీదారుల యత్నం

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 31 వరకు జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. ఇప్పటికే మధురై జిల్లాలోని అవనియపురంలో ఈ పోటీలు జరిగాయి. అలంగానల్లూర్​లో జరగాల్సి ఉంది.

jallikattu
బసవన్నను అదుపు చేస్తున్న యువకుడు
jallikattu
జల్లికట్టు పోటీలో ఉత్సాహంగా యువకులు
jallikattu
రంకెలేస్తోన్న బసవన్న
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.