ETV Bharat / bharat

బోల్డ్​ కంటెంట్​తో 'ఎక్స్ఎక్స్ఎక్స్' వెబ్​ సిరీస్.. నిర్మాత ఏక్తా కపూర్​పై సుప్రీం సీరియస్​..

author img

By

Published : Oct 14, 2022, 10:50 PM IST

Updated : Oct 15, 2022, 7:14 AM IST

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్​కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అనవసరంగా పిటిషన్​ వేసినందుకు కోర్టు ఫీజులు చెల్లించాలని ఆదేశించింది. తనపై జారీ అయిన అరెస్టు వారెంట్లను సవాల్​ చేస్తూ సుప్రీం కోర్డును ఆశ్రయించింది.

supreme court slams ekta kapoor
ఏక్తా కపూర్​

బాలీవుడ్​ నిర్మాత ఏక్తా కపూర్​పై సుప్రీం కోర్టు మండిపడింది. ఆమె నిర్మించిన 'ఎక్స్ఎక్స్ఎక్స్' వెబ్​ సిరీస్​లో అభ్యంతరకరమైన కంటెంట్​ ఉందని తేల్చిచెప్పింది. "దీని గురించి ఏదైనా చేయాలి. మీరు ఈ దేశ యువ తరం మైండ్లను కలుషితం చేస్తున్నారు" అని జస్టిస్​ అజయ్​ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఇదే విషయంపై ఏక్తా కపూర్ తరఫున న్యాయవాది ముకుల్​ రోహత్గిని.. 'మీరు ఎలాంటి ఛాయిస్​ను ప్రజలకు అందిస్తున్నారు?' అని కోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన ముకుల్..​ ఇంతకుముందు ఇలాంటి విషయంలో కపూర్​కు రక్షణ కల్పించారని ఒప్పుకున్నారు. అయితే ఈ దేశంలో ఎవరికి నచ్చిన పని వారు చేయొచ్చని.. ఆ కంటెంట్​ చందాదారులు మాత్రమే చూడొచ్చని సమాధానమిచ్చారు.

ముకుల్​ సమాధానానికి చిర్రెత్తుకొచ్చిన ధర్మాసనం.. 'ప్రతిసారి ఇలాగే చేస్తే.. దాన్ని కోర్టు సమర్థించదు' అని ఘాటుగా వ్యాఖ్యనించింది. ఇలాంటి పిటిషన్​ అత్యున్నత ధర్మాసనంలో వేసినందుకు కోర్టు ఖర్చులన్నీ మీరే కట్టాలంది. ఈ విషయం తన క్లయింట్ కపూర్​​కు చెప్పమని ముకుల్​ అడిగింది. అనంతరం ఇలాంటి అన్యాయాన్ని ఎదురించలేని వారి కోసం మాత్రమే ఈ అత్యున్నత ధర్మాసనం పని చేస్తుందని వ్యాఖ్యానించింది.
అయితే సైనికులను కించపరిచేలా, వారి కుటుంబాల మనోభావాలు దెబ్బతినేలా ఏఎల్​టీ బాలాజీ ఓటీటీ ప్లాట్​ఫాంలో వచ్చిన 'ఎక్స్​ఎక్స్​ఎక్స్​' వెబ్​ సిరీస్​పై శంభు కుమార్ అనే రిటైర్డ్​ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. దీంతో​ నిర్మాత ఏక్తా కపూర్​పై అరెస్ట్​ వారంట్లు జారీ అయ్యాయి. దీంతో కపూర్​ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే కపూర్​పై తీవ్ర స్థాయిలో మండిపడిన ధర్మాసనం.. హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరాలను ఎప్పటికప్పడు తెలియజేసేందుకు ఓ లోకల్​ లాయర్​ని నియమించింది.

Last Updated : Oct 15, 2022, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.