ETV Bharat / bharat

అటవీ సిబ్బంది చొరవ- పక్షుల కోసం ప్రత్యేక ఆస్పత్రి

author img

By

Published : Nov 6, 2021, 2:49 PM IST

అక్కడ అడుగుపెట్టగానే కిలకిల రావాలతో పక్షులు పలకరిస్తాయి. పిట్టల ఘనమైన కూతలతో స్వాగతం పలుకుతాయి. నెమళ్లు పురి విప్పి నాట్యమాడతాయి. ఇంత అద్భుతంగా, ఆహ్లదకరంగా ఉన్న ఈ సన్నివేశాలు పార్కులోవే అనుకుంటే మీరు పొరబడినట్లే! గాయపడిన పక్షులను రక్షించే లక్ష్యంతో.. కేవలం పక్షుల కోసమే రూపుదిద్దుకున్న ప్రత్యేక ఆసుపత్రి ఇది.

birds hospital
పక్షుల హాస్పిటల్

పక్షులకూ ఉందో హాస్పిటల్.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో ఒదిగిపోయి ఉన్న కోయంబత్తూర్.. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పర్యటక కేంద్రాల్లో ఒకటి. ఇక్కడకు సందర్శకులతో పాటు వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పక్షులు వలస వస్తుంటాయి. ఇక్కడి అడవులు, నదీ పరీవాహక ప్రాంతంలో అధిక సంఖ్యలో పక్షులు ఉన్నాయి.

అటవీ సిబ్బంది చొరవ..

ఈ ప్రాంతంలోని పక్షులకు మానవ కార్యకలాపాలతో ముప్పు కలుగుతోంది. వాడి పడేసిన వస్తువుల కోసం ఎగురుకుంటూ వచ్చే పక్షులు గాయాలపాలవుతున్నాయి. అంతేగాక ఇక్కడి విద్యుత్ తీగలు, వేటగాళ్ల వలలకు చిక్కి మరికొన్ని పక్షులు గాయల బారిన పడుతున్నాయి. ఇటువంటి వాటిని సకాలంలో గుర్తించి రక్షించకపోవడం వాటి ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. గాయపడిన పక్షులకు చికిత్సా కేంద్రం ఉంటే చాలా వరకు బతుకుతాయని గ్రహించిన కోయంబత్తూరు డివిజనల్ అటవీ కార్యాలయ సిబ్బంది ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆరేళ్ల క్రితం ఇక్కడ 'పక్షుల పునరావాస కేంద్రాన్ని' ప్రారంభించారు. గాయపడిన పక్షులను రక్షించడం, చికిత్స చేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.

birds hospital
సంరక్షించిన నెమళ్లు

ఇక్కడ కేవలం మనుషుల చేతిలోనే గాక.. తోడేళ్లు, ఇతర జంతువుల దాడిలో గాయపడిన పక్షులను ఈ కేంద్రానికి తీసుకొచ్చి సంరక్షిస్తున్నారు. వారానికోసారి వైద్యుడు వచ్చి గాయపడిన పక్షులను పరిశీలిస్తారు. అవి పూర్తిగా కోలుకున్న తరువాత తిరిగి అడవిలో వదిలేస్తారు.

birds hospital
పక్షులకు శస్త్ర చికిత్స చేసేందుకు ఆపరేషన్ గది

ఈ మధ్యే సూళ్లూరు ప్రాంతంలో గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న అరుదైన ఈజిప్ట్​ మాంసాహార డేగను (carnivorous eagle) ఈ కేంద్రానికి తీసుకొచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. 'రెక్కకు అయిన గాయం కారణంగా ఎగరలేకపోయిన ఆ డేగకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు' వివరించారు.

birds hospital
ఇంక్యుబేటర్​లోని అడవి కోళ్లు

పక్షుల చికిత్స కోసం ఏర్పాటైన ఈ ఆసుపత్రిలో.. ఎక్స్ రే, శస్త్రచికిత్స వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేగాక తల్లి లేక గుడ్డు నుంచి బయటకొచ్చే కోడిపిల్లలను రక్షించేందుకు ఇంక్యుబేటర్ కూడా ఏర్పాటు చేయడం విశేషం.

ఈ పునరావాస కేంద్రంలో మొత్తం 100 గాయపడిన చిలుకలు, నాలుగు నెమళ్లు, ఏడు పావురాలు, మూడు పిట్టలు, రెండు డేగలు ఉన్నాయి.

birds hospital
ఇంక్యుబేటర్

పక్షులకూ శ్మశానవాటిక..!

అడవిలో చనిపోయిన పక్షులను దహనం చేసేందుకు మూడు నెలల క్రితం గ్యాస్ ఆధారిత శ్మశానవాటికనూ ఇక్కడ నిర్మించారు. తమిళనాడులో ఇలాంటిది మొదటిది కావడం విశేషం. ఇప్పటివరకు 40కి పైగా పక్షుల మృతదేహాలను ఈ శ్మశానవాటికలో దహనం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.