ETV Bharat / bharat

రైలు పట్టాలపై కూర్చొని పబ్​జీ- అన్నదమ్ములు దుర్మరణం

author img

By

Published : Jan 9, 2022, 5:56 AM IST

Updated : Jan 9, 2022, 7:05 AM IST

Siblings Run Over by Train: పబ్​జీ ఆట ఆ సోదరుల ప్రాణాలను తీసింది. రైలు పట్టాలపై కూర్చొని ఫోన్​లో పబ్​జీ ఆడుతూ రైలు కిందపడి చనిపోయారు. ఈ ఘటన రాజస్థాన్​లోని అల్వార్ జిల్లాలో జరిగింది.

siblings run over by train
పబ్​జీ

Siblings Run Over by Train: రాజస్థాన్​, జైపుర్​లో విషాదఘటన జరిగింది. పట్టాలపై పబ్​జీ ఆడుతూ ఇద్దరు తోబుట్టువులు రైలు కిందపడి చనిపోయారు. అల్వార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..

'లోకేశ్​ మీనా(22), రాహుల్​(19) రూప్​బాస్ పట్టణంలో వారి అక్క ఇంటి దగ్గరే ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. వారి తండ్రి జిల్లాలోని తెల్హా గ్రామంలో నివసిస్తున్నారు. సోదరులు ఖాలీ సమయంలో పబ్​జీ ఆడుతూ కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలో రూప్​బాస్ పట్టణం సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని ఫోన్​లో పబ్​జీ ఆటలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఆ మార్గంలో రైలు వచ్చింది. ట్రైన్​ను గమనించని అన్నదమ్ములు అలాగే ఆటలో పూర్తిగా లీనమయ్యారు. దీంతో రైలు వారిని ఢీకొట్టింది' అని ఎస్​ఐ మనోహర్ లాల్ తెలిపారు.​

ఇదీ చదవండి: Cab Drivers Murdered: రూ.600 కోసం ఇద్దరు క్యాబ్ డ్రైవర్ల హత్య

Last Updated : Jan 9, 2022, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.