ETV Bharat / bharat

10,12 తరగతుల బోర్డ్​ పరీక్షలపై సుప్రీం కీలక నిర్ణయం

author img

By

Published : Feb 23, 2022, 2:56 PM IST

Offline board exams supreme court: ఆఫ్​లైన్​లో నిర్వహించనున్న 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు చేయాలని, ప్రత్యామ్నాయ మార్గంలో నిర్వహించేలా సీబీఎస్​ఈ సహా అన్ని బోర్డులను ఆదేశించాలని దాఖలైన పిటిషన్​ను తిరస్కరించింది సుప్రీం కోర్టు. అది విద్యార్థుల్లో గందరగోళాన్ని సృష్టిస్తుందని స్పష్టం చేసింది.

supreme court
సుప్రీం కోర్టు

Offline board exams supreme court: ఈ ఏడాది సీబీఎస్​ఈ సహా ఇతర బోర్డులు ఆఫ్​లైన్​లో నిర్వహించే 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆఫ్​లైన్​కు బదులుగా ప్రత్యామ్నాయ మార్గంలో పరీక్షలు నిర్వహించేలా సీబీఎస్​ఈ, ఇతర బోర్డులను ఆదేశించాలని పిటిషనర్​ కోరారు. అయితే.. అలాంటి పిటిషన్లు తప్పుడు భావన, గందరగోళాన్ని సృష్టిస్తాయని పేర్కొంది జస్టిస్​ ఎంఏ ఖాన్విల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనం.

"ఇది పరీక్షలకు సిద్ధమవుతోన్న విద్యార్థుల్లో తప్పుడు ఆశలను కలిగించటమే కాకుండా గందరగోళాన్ని సృష్టిస్తుంది. విద్యార్థులను, అధికారులను వారి విధులు వారు నిర్వర్తించనివ్వాలి."

- సుప్రీం ధర్మాసనం.

ఏప్రిల్​ 26 నుంచి 10, 12వ తరగతుల టెర్మ్​-2 బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్​ఈ నిర్ణయించింది.

ఇదీ చూడండి: బాలికపై ట్యూటర్​ అత్యాచారం.. ఆపై హత్య.. ఆమె దుస్తులతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.