ETV Bharat / bharat

ఏరోఇండియా షో వేదికగా నేడు 'తేజస్​' కొనుగోలు ఒప్పందం

author img

By

Published : Feb 3, 2021, 6:27 AM IST

Updated : Feb 3, 2021, 6:32 AM IST

బెంగళూరులోని యలహంక ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​లో నేడు 13వ ఏరోఇండియా-2021 ప్రదర్శన ప్రారంభం కానుంది. ఇదే వేదికగా.. తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్​ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

Tejas aircraft deal
తేజస్ యుద్ధ విమానాలు

నేటి నుంచి 13వ ఏరోఇండియా-2021 ప్రదర్శన ప్రారంభం కానుంది. బెంగళూరు యలహంకలోని ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​లో నిర్వహించనున్నారు. ఈ నెల 5 వరకు కొనసాగనున్న ఎయిర్​ షోను రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రారంభించనున్నారు.

Tejas aircraft deal
ఏరోఇండియా-2021

తేజస్​ కొనుగోలుకు ఒప్పందం..

తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం లాంఛనంగా ఒప్పందం కుదుర్చుకోనుంది. హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​(హాల్​) నుంచి రూ. 48 వేల కోట్ల విలువైన 83 తేజస్​ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై.. రక్షణ శాఖ, హాల్​ అధికారులు సంతకాలు చేయనున్నారు. బెంగళూరులో జరుగుతున్న 'ఏరో ఇండియా' ప్రదర్శనలో.. రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​, వైమానిక దళ ఉన్నతాధికారుల సమక్షాన ఈ కార్యక్రమం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'రక్షణ రంగ కేటాయింపుల్లో 60 ఏళ్ల రికార్డ్ రిపీట్!'

Last Updated : Feb 3, 2021, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.