ETV Bharat / bharat

'50 పెట్రోల్​ బాంబులు పేల్చి వారిని చంపేయాలి!'.. ఆడియో లీక్​ కేసులో కార్పొరేటర్​ అరెస్ట్​

author img

By

Published : Oct 16, 2022, 2:13 PM IST

కర్ణాటకలోని మడికేరికి చెందిన ఓ కార్పొరేటర్​, రియల్​ ఎస్టేట్​ వ్యాపారి మాట్లాడుకున్న ఆడియో కాల్.. కలకలం సృష్టిస్తోంది. ఓ వర్గం వారు గుమిగూడిన ప్రాంతంలో పెట్రోల్​ బాంబులు వేసి వార్ని చంపేయాలంటూ వారిద్దరూ ప్లాన్​ వేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్​ చేశారు. అసలు మాట్లాడుకుంది ఎవరు? ఏం మాట్లాడుకున్నారు? వారి ప్లాన్​ ఏంటి?
petrol-bombing-conversation-viral-two-accused-detained-corporator-arrested
petrol-bombing-conversation-viral-two-accused-detained-corporator-arrested

Petrol Bomb Audio Leak: "ఆ వర్గం వారు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో పెట్రోల్​ బాంబులు వేయాలి. మడికేరిలో 50 బాంబులు పేల్చి భయాందోళనలు సృష్టించాలి. భాజపా అధికారంలోకి మరోసారి రాకూడదు" అంటూ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఓ ఆడియో కాల్​.. కర్ణాటకలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ కాల్​లో మాట్లాడుకున్నవారిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. మడికేరికి చెందిన శేషప్పరాయ్ అనే వ్యక్తి ఏదో పనిమీద నిందితుల్లో ఒకరికి ఫోన్​ చేశాడు. ఆ తర్వాత అతడు కాల్​ కట్​ చేయడం మర్చిపోయాడు. మళ్లీ ఓ సారి ఫోన్​ చూసినప్పటికీ.. కార్పొరేటర్​ ముస్తఫా​, రియల్ ఎస్టేట్​ వ్యాపారి అబ్దుల్​ మాట్లాడుకుంటున్నారు. వారిద్దరూ మాట్లడుకున్నంత సేపు.. శేషప్పరాయ్​ సైలెంట్​గా ఉండి కాల్​ రికార్డ్​ చేశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఏం మాట్లాడుకున్నారంటే?
"ఆ వర్గం ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో పెట్రోల్​ బాంబులు పెట్టి పేల్చాలి. వారిని ఊరికే వదలకూడదు. బాంబులతో చంపేయాలి. మడికేరి నగరం మొత్తం ధ్వంసమవ్వాలి. మనం చనిపోయినా పర్వాలేదు. వారిని మాత్రం విడిచిపెట్టకూడదు. ఎంత ఖర్చయినా పర్లేదు. రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు చందాలు వసూలు చేసి మరీ ఈ పని చేసేద్దాం" అంటూ ప్లాన్​ వేశారు.

అయితే మడికేరిలో పెట్రోలు బాంబుల దాడికి సంబంధించిన ఆడియో కాల్​ లీక్​ అయ్యి వైరల్ కావడం పట్ల విరాజ్‌పేట ఎమ్మెల్యే కేజీ బోపయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎనిమిదేళ్ల క్రితం మడికేరిలోని నాడుపేట్ తాలూకాలోని కాఫీ తోటలో అబ్దుల్ మదానీ అనే ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు కూడా జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మళ్లీ ఇప్పుడు పెట్రోల్​ బాంబు దాడికి సంబంధించి ఆడియో లీక్​ కావడం కలకలం రేపింది.

ఇవీ చదవండి: మద్యం కుంభకోణం కేసులో డిప్యూటీ సీఎంకు సీబీఐ సమన్లు

రేప్​ కేసు దోషికి 15 రోజుల పెరోల్.. భార్యను గర్భవతిని చేసేందుకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.