ETV Bharat / bharat

ఊరంతా పాములు- వాటితోనే పిల్లల ఆటలు

author img

By

Published : Jun 24, 2021, 7:15 PM IST

snakes village
పాముల గ్రామం

చిన్న పాము కనిపిస్తేనే.. 'అమ్మో పాము' అంటూ ఆమడ దూరం పారిపోతాం. అదే ఊరికి ఊరే సర్పాలకు అడ్డా అయితే? ఇది ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా! కర్ణాటకలోని ఆ గ్రామస్థులంతా పాములతో సహజీవనం చేసేవాళ్లే. అది కూడా కోబ్రాలతో.. మరి అలాంటి ఊరు గురించి తెలుసుకోవాలని ఉందా?

సర్పాలతో సహజీవనం చేస్తున్న గ్రామస్థులు

ఆ ఊరు కోబ్రాలకు నిలయం(home to cobra snakes). ఇంట్లో పెంచుకునే శునకాలతో, పిల్లులతో ఆడుకున్నట్లు.. చిన్నపిల్లల నుంచి పెద్దలు వరకు ఆ ఊరిలో పాములతో సరదాగా గడుపుతుంటారు. అయితే.. ఇంతవరకు సర్పాలతో వారికి ఎలాంటి సమస్యలు రాలేదట. ఇంకా చెప్పాలంటే.. ఏ ఒక్కరూ పాము కాటుతో చనిపోలేదట! ఇది నిజమేనా? ఇదేం ఊరురా బాబు..? అని మీకు అనిపించక మానదు! ఆ ఊరు పేరే నాగెనహళ్లి. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఉంది.

పిల్లలకు పాములంటే భయమే లేదు!

నాగనహళ్లి.. చిన్నగిరి తాలూక పరిధిలో ఉంది. ఈ ఊరునే స్థానికంగా 'పాముల గ్రామం(village of snakes)' అని పిలుస్తారట. ఇది చదవగానే అర్థమైయ్యే ఉంటుంది.. ఆ గ్రామంలో ఎన్ని పాములుంటాయో లెక్కేలేదు. అంతేకాదు మనుషులతో పాటు అవీ కలిసే తిరుగుతాయి. ఆ ఊరులోని చిన్నపిల్లలు.. ఆంజనేయ, శివాలయాల వద్ద సర్పాలతో ఆడుకుంటారు.

snakes village
నాగెనహళ్లి గ్రామం
People of this village live with snakes
సర్పంతో ఆడుకుంటున్న గ్రామస్థులు

సర్పాలతో సమస్యల్లేవ్​!

పాములు ఎప్పుడూ మనుషులతో కలిసే ఉంటాయి. తరుచూ చుట్టం చూపుగా వచ్చి పోతుంటాయి. అలా రావడం ఆంజనేయ, ఈశ్వరుడు చేస్తున్న అద్భుతాలని వారి నమ్మకం. పురాతన కాలం నుంచీ ఇలాగే జరుగుతుందని ఆ గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సర్పాలతో ఎలాంటి సమస్యలు ఎదురవలేదని అంటున్నారు.

People of this village live with snakes
ఊరులో సంచరిస్తున్న పాము

పాము కాటుకు ఆంజనేయ తీర్థం

ఒకవేళ పాము కరిచిస్తే.. ఆంజనేయ తీర్థం తీసుకుంటే నయం అయిపోతుందట. ఆంజనేయ గుడిలో మూడు రోజుల పాటు ఉంటూ.. తీర్థం తాగితే నయం అయిపోతుందని వారు నమ్ముతారు.

People of this village live with snakes
కోబ్రా

పాములకు అంత్యక్రియలు..

ప్రమాదవశాత్తూ సర్పాలు చనిపోతే.. మనుషులకు చేసినట్లే గ్రామస్థులంతా కలిసి వాటికి అంత్యక్రియలు చేస్తారు.

ఇదీ చూడండి: పెంపుడు శునకాన్ని కరిచిందని చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.