ETV Bharat / bharat

'పబ్​జీ' ప్రేమాయణం.. పాకిస్థాన్ టు భారత్ వయా నేపాల్​.. అక్రమంగా వచ్చి పోలీసులకు చిక్కి..

author img

By

Published : Jul 5, 2023, 7:51 AM IST

ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు నేటి తరం ప్రేమికులు. ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతున్నారు. ఇదే తరహాలో పాకిస్థాన్​కు చెందిన ఓ యువతి ప్రేమ కోసం దేశం దాటి వచ్చింది. పబ్​జీ గేమ్ ఆడుతూ ఓ యువకుడితో ప్రేమలో పడిన ఆమె.. అతడి కోసం ఏకంగా పాకిస్థాన్​ నుంచి భారత్​కు అక్రమంగా వచ్చేసింది.

noida police arrested pakistani woman
noida police arrested pakistani woman

Pakistan Woman Pubg Noida : పబ్​జీ గేమ్​లో పరిచయమైన ప్రేమికుడి కోసం దేశాలు దాటుకుని వచ్చింది పాకిస్థాన్​కు చెందిన ఓ మహిళ. నలుగురు పిల్లలతో కలిసి అక్రమంగా భారత్​లోకి ప్రవేశించి ఇక్కడే కాపురం పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో జరిగింది.

ఇదీ జరిగింది
పాకిస్థాన్​కు చెందిన ఓ మహిళకు.. పబ్​జీ గేమ్​ ఆడుతుండగా నోయిడాకు చెందిన సచిన్​తో పరిచయమైంది. అనంతరం వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. తర్వాత వీరిద్దరూ ఒక చోట కలుసుకోవాలని భావించారు. అందుకోసం నేపాల్​ కాఠ్​మాండులోని ఓ హోటల్​లో కలుసుకుని.. వారం రోజులు అక్కడే ఉన్నారు. అనంతరం మహిళ షార్జా వెళ్లగా.. సచిన్​ నోయిడాకు తిరిగివచ్చారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని జీవించాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం పాకిస్థాన్​లో ఉన్న భూమిని విక్రయించి.. నలుగురు పిల్లలతో భారత్​కు బయలుదేరింది. ముందుగా టూరిస్ట్ వీసాపై నేపాల్​ వెళ్లిన ఆమె.. ఆ తర్వాత అక్రమంగా భారత్​లోకి ప్రవేశించింది. ఆ తర్వాత రబుపరాలోని ఇంట్లో కాపురం పెట్టారు. పెళ్లికి కావాల్సిన ధ్రువపత్రాలను సమకూర్చుకునే పనిలో పడింది మహిళ. ఈక్రమంలోనే పోలీసులకు సమాచారం అందడం వల్ల.. శనివారం నలుగురు పిల్లలు సహా ప్రేమికుడితో పారిపోయింది. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. హరియాణాలోని బల్లాభగఢ్​లో వీరిని పట్టుకున్నారు.

noida police arrested pakistani woman
పోలీసుల అదుపులో పాకిస్థాన్ మహిళ, ప్రేమికుడు

"మహిళకు పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్​లోని గులామ్ హైదర్​తో 2014లో వివాహం జరిగింది. 2019లో అతడు పనికోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే మహిళ పబ్​జీ ఆడుతుండగా.. నోయిడాకు చెందిన సచిన్​తో పరియచమైంది. వీరి వద్ద నుంచి రెండు వీడియో క్యాసెట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక సిమ్, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్, వివాహ ధ్రువీకరణ పత్రం, మూడు ఆధార్ కార్డులు, ఒక పాకిస్థాన్ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం, పొఖారా- కాఠ్​మండూ నుంచి దిల్లీకి బస్సు టికెట్లను స్వాధీనం చేసుకున్నాం."
--సాద్​ మియా ఖాన్​, డీసీపీ

మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను ప్రశ్నించారు. తాను సచిన్​ను పెళ్లి చేసుకునేందుకే.. భారత్​కు వచ్చినట్లు మహిళ చెప్పిందని పోలీసులు వివరించారు. దీంతో పాకిస్థాన్​లో తెలిసిన వారి వివరాలు అడగగా.. ఆమె చెప్పిన సమాచారం తప్పని తేలింది. ఆమెపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. భద్రతా సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు.

ఇవీ చదవండి : Software Prashanth: ప్రేయసి కోసం పాక్​కి వెళ్లి.. నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చి..

పాక్ యువకుడితో ప్రేమ.. దేశం దాటి వెళ్లేందుకు యత్నం.. అధికారులు అడ్డుపడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.