ETV Bharat / bharat

New Parliament Building Opening Ceremony : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఉభయసభలు రేపటికి వాయిదా

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 9:49 AM IST

Updated : Sep 19, 2023, 3:55 PM IST

new parliament building opening ceremony
new parliament building opening ceremony

15:53 September 19

రాజ్యసభ రేపటి(సెప్టెంబర్ 20)కి వాయిదా పడింది. తిరిగి బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది.

15:31 September 19

'ప్రశ్నించలేని మహిళలకే అవకాశాలు'.. ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. నిర్మల ఫైర్
మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లోనే లోక్​సభలో ఆమోదం పొందిందని, కానీ దాన్ని అడ్డుకున్నారని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఎస్సీలు, వెనుకబడిన తరగతుల మహిళలకు సరైన అవకాశాలు రావడం లేదన్న ఖర్గే.. బలహీనమైన మహిళలను పార్టీలు ఎంపిక చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. చదువుకున్నవారికి, వెనకబడిన వర్గాల మహిళలకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని అన్నారు. అన్ని పార్టీలు.. మహిళలను చిన్నచూపు చూస్తున్నాయన్న ఖర్గే.... ప్రశ్నించలేని మహిళలకు అవకాశం ఇచ్చారని వ్యాఖ్యానించారు.

'మేం సాధికారత సాధించాం'
అయితే, ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలపై సభలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. మహిళా నేతలను ఖర్గే కించపరిచారని ఆరోపించారు.

"రాజ్యసభలో విపక్ష నేత పట్ల మాకు గౌరవం ఉంది. కానీ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. సమర్థమైన మహిళలను ఎంపిక చేయడం లేదంటూ మాట్లాడటం ఆమోదయోగ్యం కాదు. మా పార్టీ, ప్రధాని ప్రోత్సాహంతో మేం సాధికారత సాధించాం. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ సైతం సాధికారత సాధించిన మహిళే" అంటూ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

15:07 September 19

'ఇది కొత్త భవనం మాత్రమే కాదు.. సరికొత్త ప్రారంభానికి చిహ్నం'.. రాజ్యసభలో ప్రధాని మోదీ
నూతన పార్లమెంట్​లో అడుగుపెట్టిన ఈరోజు అందరికీ గుర్తుండి పోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది నూతన పార్లమెంట్ భవనం మాత్రమే కాదని, సరికొత్త ప్రారంభానికి చిహ్నమని గుర్తు చేశారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోదీ... జీ20 సదస్సు సందర్భంగా దేశ సమాఖ్య వ్యవస్థ.. భారత శక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిందని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు జీ20 సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రతి రాష్ట్రం ఉత్సాహంతో ఇందులో పాల్గొన్నట్లు పేర్కొన్న ఆయన.. ఇదే సమాఖ్య వ్యవస్థ శక్తి అని తెలిపారు.

'ఈరోజు అందరికీ గుర్తుండిపోవడమే కాదు.. చరిత్రలో నిలిచిపోతుంది. మన రాజ్యాంగంలో రాజ్యసభను పెద్దల సభగా పేర్కొన్నారు. ఈ సభ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ దేశానికి దిశానిర్దేశం చేస్తుందని రాజ్యాంగ నిర్మాతల భావన. కొత్త తరం ఎక్కువ కాలం ఎదురుచూసే పరిస్థితులు లేవు. కాబట్టి, పార్లమెంట్ సభ్యులుగా మనమంతా లక్ష్యాలను వీలైనంత త్వరగా సాధించాలి. ఇక్కడ మాకు (ఎన్​డీఏకు) మెజారిటీ లేదు. కానీ, దేశహితం కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారని అనుకుంటున్నా. మీ (ఎంపీలు) పరిణతి వల్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. గతకొంతకాలంగా మహిళా సాధికారత కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి. అందులో మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది అతిపెద్ద ముందడుగు అవుతుంది' అని మోదీ పేర్కొన్నారు.

14:50 September 19

వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైంది. ఇకపై దేశ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే దిశగా సభ్యులంతా పనిచేయాలని సభాపతి ధన్​ఖడ్ పిలుపునిచ్చారు. అనారోగ్యకరమైన అలవాట్లను విడిచిపెట్టాలని కోరారు. ఈ సందర్భంగా సభ్యులకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.

14:29 September 19

  • లోక్‌సభలో మహిళారిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
  • మహిళారిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి మేఘ్వాల్‌
  • నారీశక్తి వందన్‌ పేరుతో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి మేఘ్వాల్‌
  • 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మేఘ్వాల్‌
  • బిల్లు ప్రతులను తమకు ఇవ్వేలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన విపక్షాలు
  • డిజిటల్‌ ఫార్మాట్‌లో అందుబాటులోకి తెచ్చామన్న మేఘ్వాల్‌
  • లోక్​సభ బుధవారానికి వాయిదా.

14:27 September 19

రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే మధ్యాహ్నం 2.47 నిమిషాలకు వాయిదా పడింది. ఫ్లోర్ లీడర్లతో చర్చ జరిపేందుకు రాజ్యసభ ఛైర్మన్ జగ్​దీప్ ధన్​ఖడ్​​ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

14:16 September 19

లోక్​సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్​రామ్ మేఘ్వాల్‌ మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారు.

13:54 September 19

  • ప్రసంగంలో మహిళా రిజర్వేషన్లను ప్రస్తావించిన మోదీ
  • మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు: మోదీ
  • అనేక రంగాల్లో మహిళలు నేతృత్వం వహిస్తున్నారు: మోదీ
  • కొత్త భవనంలో నారీశక్తిని బలోపేతం చేసేలా తొలి నిర్ణయం తీసుకోబోతున్నాం: మోదీ
  • మహిళా రిజర్వేషన్ బిల్లును నిన్న కేంద్రం ఆమోదించింది: మోదీ
  • అభివృద్ధి ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం మరింత పెంచాలనుకుంటున్నాం: మోదీ

13:44 September 19

  • 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు కొత్త పార్లమెంటు భవనం ప్రతీక: మోదీ
  • చేదు జ్ఞాపకాలను మరచి కొత్త అధ్యాయం ప్రారంభిద్దాం: మోదీ
  • ప్రతి పౌరుడికి స్ఫూర్తినిచ్చేలా కొత్త పార్లమెంటులో మన చర్యలుండాలి: మోదీ
  • కొత్త పార్లమెంటు భవన నిర్మాణ కూలీల శ్రమను స్మరించుకున్న ప్రధాని మోదీ
  • దేశసేవకు పార్లమెంటు అత్యున్నత వేదిక: ప్రధాని మోదీ
  • పార్లమెంటులో పార్టీల అభివృద్ధికి కాక జాతి అభివృద్ధికి కృషి చేయాలి: మోదీ

13:33 September 19

  • మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం
  • మహిళా రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం
  • లోక్‌సభ, అసెంబ్లీల్లో మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించేలా బిల్లు
  • దిల్లీ అసెంబ్లీలోనూ మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించేలా బిల్లు
  • విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా బిల్లు
  • డీలిమిటేషన్‌ తర్వాతే అమల్లోకి మహిళా రిజర్వేషన్లు
  • పదిహేనేళ్ల పాటు అమల్లో ఉండనున్న మహిళా రిజర్వేషన్లు
  • డీలిమిటేషన్‌ తర్వాత రొటేషన్‌ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు

13:28 September 19

  • కొత్త పార్లమెంట్‌ భవనంలో ప్రధాని మోదీ తొలి ప్రసంగం
  • కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభించుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు: మోదీ
  • ఆజాదీ అమృత కాలంలో ఇది ఉషోదయ కాలం: మోదీ
  • కొత్త భవనంలోకి కొత్త సంకల్పం తీసుకుని వెళ్లాలి: మోదీ
  • చంద్రయాన్‌ 3 విజయం దేశవాసులను గర్వపడేలా చేసింది: మోదీ
  • జీ 20 సమావేశాల సమర్థ నిర్వహణ భారత ప్రతిష్టను పెంచింది: మోదీ
  • ప్రాచీన ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక భారతీయతత్వాల కలబోత ఈ కొత్త భవనం: మోదీ
  • గణేశ్‌ చతుర్థి రోజు కొత్త భవనం ప్రారంభించుకోవడం శుభసూచకం: మోదీ
  • శుభ దినాన కొత్త యాత్రను మనం ప్రారంభించబోతున్నాం: మోదీ

13:15 September 19

  • కొత్త పార్లమెంటు భవనంలో ప్రారంభమైన కార్యకలాపాలు
  • కొత్త పార్లమెంటు భవనంలో స్పీకర్ ప్రసంగం

13:13 September 19

  • కొత్త పార్లమెంటు భవనంలోకి పాదయాత్రగా వెళ్తున్న ఎంపీలు
  • కొత్త పార్లమెంటు భవనంలోకి వెళ్తున్న ప్రధాని, కేంద్రమంత్రులు, ఎంపీలు
  • కొత్త పార్లమెంటు భవనంలోకి వెళ్తున్న అమిత్‌షా, రాజ్‌నాథ్‌, జేపీ నడ్డా
  • మధ్యాహ్నం 1.15 గం.కు కొత్త భవనంలో ప్రారంభం కానున్న లోక్‌సభ
  • మధ్యాహ్నం 2.30 గం.కు కొత్త భవనంలో ప్రారంభం కానున్న రాజ్యసభ

12:53 September 19

ఎంపీలంతా పాత పార్లమెంటు భవనం నుంచి కొత్త భవనానికి చేరుకున్నారు. అనేక మంది సభ్యులు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పాదయాత్ర చేస్తూ కొత్త భవనానికి వెళ్లారు. మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌సభ, మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్యసభ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈరోజే లోక్​సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.

12:40 September 19

  • ఇకపై సంవిధాన్‌ సదన్‌గా పాత పార్లమెంట్‌ భవనం: ప్రధాని మోదీ
  • పాత పార్లమెంట్‌ భవనాన్ని సంవిధాన్‌ సదన్‌గా పిలుచుకుందాం: ప్రధాని మోదీ
  • రాజ్యాంగకర్తల స్ఫూర్తిని భావితరాలకు అందిద్దాం: ప్రధాని మోదీ

12:27 September 19

  • గణేశ్‌ చతుర్థి రోజు కొత్త పార్లమెంటు భవనంలో అడుగుపెట్టబోతున్నాం: ప్రధాని మోదీ
  • పార్లమెంటు ప్రతిష్టను మసకమార్చబోమని మనం సంకల్పం తీసుకోవాలి: ప్రధాని మోదీ

12:24 September 19

  • ప్రపంచ మార్కెట్‌ను మన తయారీ రంగం అందుకోవాలి: ప్రధాని మోదీ
  • చంద్రయాన్‌ 3 విజయం తర్వాత యువతలో సాంకేతిక ఆకాంక్షలు పెరిగాయి: ప్రధాని మోదీ
  • సామాజిక న్యాయం సాధించకుండా ఎంత అభివృద్ధి సాధించినా ఫలితం ఉండదు: ప్రధాని మోదీ
  • సమాజంలోని చివరి వ్యక్తి వరకూ సామాజిక న్యాయం అందాలి: ప్రధాని మోదీ
  • సామాజిక న్యాయ సాధన ద్వారానే వికసిత సమాజం సాధ్యమవుతుంది: ప్రధాని మోదీ
  • అసంతులిత వికాసం సమాజానికి ఏమాత్రం వాంఛనీయం కాదు: ప్రధాని మోదీ
  • అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమైనప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుంది: ప్రధాని మోదీ
  • దేశంలో 100 జిల్లాలను ఎంచుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నాం: ప్రధాని మోదీ
  • ఈ 100 జిల్లాలు దేశంలోని మిగిలిన జిల్లాలకు నమూనాలుగా నిలుస్తాయి: ప్రధాని మోదీ
  • ప్రస్తుతం ప్రపంచం దృష్టి భారత్‌పైనే ఉంది: ప్రధాని మోదీ
  • విశ్వ మిత్రగా భారత్‌ గుర్తింపు తెచ్చుకుంటోంది: ప్రధాని మోదీ

12:14 September 19

  • చిన్న పటంలో పెద్ద చిత్రాన్ని గీయలేం.. పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా పెద్ద మార్పులు తీసుకురాలేం: ప్రధాని మోదీ
  • భవిష్యత్‌ తరాల కోసం నవ్య, దివ్య సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉంది: ప్రధాని మోదీ
  • భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.. త్వరలోనే మూడో స్థానానికి వెళ్తాం: ప్రధాని మోదీ
  • ఆత్మనిర్భర భారతాన్ని ఆవిష్కరించేందుకు సంకల్ప బలం కావాలి : ప్రధాని మోదీ
  • తయారీ రంగంలో దేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం: ప్రధాని మోదీ
  • మన యూనివర్సిటీలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలి: ప్రధాని మోదీ
  • 1500 ఏళ్ల క్రితమే ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు భారత్‌లో ఉండేవి: ప్రధాని మోదీ
  • జీ20 సమావేశాల్లోనూ నలంద విశ్వవిద్యాలయాల చిత్రాలు ప్రదర్శించాం: ప్రధాని మోదీ
  • దేశంలోని ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నం జరుగుతోంది : ప్రధాని మోదీ
  • ప్రపంచంలో ప్రస్తుతం నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరత ఉంది: ప్రధాని మోదీ
  • నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరతను భారత్‌ పూరించాలి: ప్రధాని మోదీ
  • నర్సింగ్‌ వనరుల కొరత చాలా ఉంది.. అందుకే ఒకేసారి 150 నర్సింగ్‌ కళాశాలలు ప్రారంభించాం: ప్రధాని మోదీ
  • దేశ అవసరాలే కాదు.. ప్రపంచ అవసరాలు తీర్చేలా వైద్య కళాశాలలు పెంచుతున్నాం: ప్రధాని మోదీ
  • సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం: ప్రధాని మోదీ
  • సరైన నిర్ణయాలు తీసుకునే విషయం మేం వెనుకడుగు వేయం: ప్రధాని మోదీ
  • శక్తి వనరుల కొరత తీర్చేందుకు మిషన్‌ హైడ్రోజన్‌ చేపట్టాం: ప్రధాని మోదీ

12:08 September 19

  • మనం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటామో అంత వేగంగా ఫలితాలు వస్తాయి: ప్రధాని మోదీ
  • సాంకేతికతను అందించడంలో మన దేశ యువత ముందువరుసలో ఉంది: ప్రధాని మోదీ
  • యూపీఐ, డిజిటల్‌ టెక్‌ వంటి సాంకేతికతలతో దేశం దూసుకెళ్తోంది: ప్రధాని మోదీ
  • ప్రజల ఆకాంక్షలు ఉజ్వలంగా ఎగసిపడుతున్నాయి: ప్రధాని మోదీ
  • ప్రజల ఆకాంక్షలను అందుకునే ప్రయత్నం నిరంతరం సాగాలి: ప్రధాని మోదీ
  • సమాజం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలి: ప్రధాని మోదీ
  • సంకల్పం తీసుకుని స్వప్నాలను సాకారం చేసుకోవాలి: ప్రధాని మోదీ
  • కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడి కొత్త చట్టాలను స్వాగతించాలి: ప్రధాని మోదీ
  • పార్లమెంటులో జరిగే ప్రతిచర్చ దేశ ఆకాంక్షలను ప్రతిబింబించాలి: ప్రధాని మోదీ
  • మనం తెచ్చే సంస్కరణలు దేశవాసులను ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి: ప్రధాని మోదీ

11:54 September 19

  • పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో ఈ సమావేశం భావోద్వేగంతో కూడుకుంది : ప్రధాని మోదీ
  • పార్లమెంట్‌ సెంట్రల్ హాల్‌ ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది: ప్రధాని మోదీ
  • మన రాజ్యాంగం ఈ సెంట్రల్‌ హాల్‌లోనే రూపుదిద్దుకుంది: ప్రధాని మోదీ: ప్రధాని మోదీ
  • ఆంగ్లేయుల నుంచి రాజ్యాధికారం అందుకున్నది కూడా ఈ సెంట్రల్‌ హాల్‌లోనే: ప్రధాని మోదీ
  • 1952 నుంచి 41 మంది వివిధ దేశాధ్యక్షులు ప్రసంగించారు
  • రాష్ట్రపతులు 86 సార్లు ఈ సెంట్రల్ హాల్‌ నుంచి ప్రసంగించారు: ప్రధాని మోదీ
  • ఇక్కడి నుంచే 4 వేలకు పైగా చట్టాలను ఆమోదించుకున్నాం: ప్రధాని మోదీ
  • అనేక కీలక చట్టాలను ఉమ్మడి సమావేశాల ద్వారా ఆమోదించుకున్నాం : ప్రధాని మోదీ
  • వరకట్ననిషేధ చట్టం, బ్యాంకింగ్‌ సంస్కరణల వంటి కీలక చట్టాలు ఆమోదించుకున్నాం: ప్రధాని మోదీ
  • తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, ట్రిపుల్‌ తలాక్‌ చట్టాలను ఇక్కడి నుంచే ఆమోదించుకున్నాం: ప్రధాని మోదీ
  • ఆర్టికల్‌ 370 నుంచి విముక్తి కూడా పార్లమెంట్ ద్వారానే జరిగింది: ప్రధాని మోదీ
  • ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ శాంతిపథంలో ప్రయాణిస్తోంది: ప్రధాని మోదీ
  • మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది: ప్రధాని మోదీ
  • మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్‌లో కొత్త చైతన్యం వస్తోంది: ప్రధాని మోదీ

11:40 September 19

  • సెంట్రల్‌ హాల్‌ నుంచే ట్రస్ట్‌ విత్‌ డెస్టినీ గురించి నెహ్రూ మాట్లాడారు: ఖర్గే
  • ప్రపంచం నిద్ర పోతున్న వేళ భారత్‌ మేల్కొంటుందని నెహ్రూ అన్నారు
  • మనమంతా ఒకటిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలి
  • స్వేచ్ఛ, సమగ్రతను కాపాడేందుకు మనమంతా ఒకటిగా ఉండాలి

11:33 September 19

  • కొత్త పార్లమెంటు భవనం విశాలంగా, సుందరంగా ఉంది: పీయూష్‌ గోయల్‌

11:33 September 19

  • భారత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ: అధీర్‌ రంజన్‌
  • 2047కల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని అంటున్నారు: అధీర్‌ రంజన్‌

11:13 September 19

  • 32 ఏళ్ల వయసులో పార్లమెంటులో అడుగుపెట్టా: మేనకాగాంధీ
  • ఎంపీగా ఇప్పటివరకు ఏడుగురు ప్రధానులను చూశా: మేనకాగాంధీ
  • మహిళల మేలు కాంక్షించే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం: మేనకాగాంధీ
  • మహిళల ఆశలు, ఆకాంక్షలకు కొత్త భవనం వేదిక కావాలని ఆశిస్తున్నా: మేనకాగాంధీ
  • బేటీ బచావో.. బేటీ పడావో.. అమలును నాకు అప్పగించారు: మేనకాగాంధీ

11:10 September 19

  • పార్లమెంట్‌ సెంట్రల్ హాల్‌లో సమావేశమైన ఎంపీలు
  • సమావేశంలో పాల్గొన్న ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌, ఖర్గే
  • సమావేశంలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే, పీయూష్ గోయల్‌
  • నేటినుంచి కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్నాం: ప్రహ్లాద్‌ జోషి
  • పాత పార్లమెంట్ భవనం బ్రిటిష్ వారి నుంచి భారత్​కు అధికార మార్పిడికి సాక్ష్యం: ప్రహ్లోద్ జోషి

11:04 September 19

మహిళా రిజర్వేషన్ బిల్లు మంగళవారం లోక్​సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్​రామ్ మేఘ్​వాల్​ ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ లోక్​సభలో బుధవారం జరగనుంది. అలాగే ఈ సెప్టెంబరు 21న రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనుంది కేంద్రం.

09:08 September 19

New Parliament Building Opening Ceremony : కొత్త పార్లమెంట్​లో సమావేశాలు షురూ.. ఎంపీల గ్రూఫ్ ఫొటో

New Parliament Building Opening Ceremony : కొత్త పార్లమెంట్​లో సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభల సభ్యులు పాత పార్లమెంట్ భవనం ఆవరణలో గ్రూఫ్ ఫొటోలు దిగారు. పాత పార్లమెంటు భవనం ప్రాంగణంలో మూడు వేర్వేరు గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. మొదటిది రాజ్యసభ, లోక్‌సభ సభ్యులది కలిపి కాగా.. రెండు, మూడోది సభలవారీగా వేర్వేరుగా దిగారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీ నరహరి అమీన్‌ స్పృహతప్పి పడిపోయారు. కాసేపటి తర్వాత కోలుకుని.. ఫొటో సెషన్​లో భాగమయ్యారు. మరోవైపు.. లోక్‌సభ సెక్రటేరియట్.. కొత్త పార్లమెంట్​ భవనాన్ని భారత పార్లమెంట్​గా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పంతో పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ఉదయం 11 గంటలకు ఓ కార్యక్రమానికి నాయకత్వం వహించనున్నారు. దాదాపు గంటన్నర పాటు జరిగే ఈ కార్యక్రమం జాతీయ గీతంతో మొదలై.. జాతీయ గీతంతోనే ముగియనుంది. ఆ తర్వాత మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌సభ, మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్యసభ సమావేశాలు మొదలుకానున్నాయి.

సెంట్రల్ హాల్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్వాగత ప్రసంగం చేస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ పార్లమెంటేరియన్లైన మేనకా గాంధీ, శిబు సోరెన్ కూడా మాట్లాడనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగం కూడా ఉంటుందని తెలిసినప్పటికీ ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన హాజరు కాకపోవచ్చని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోదీ.. రాజ్యాంగ ప్రతిని పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్యక్రమం అనంతరం ఎంపీలకు భోజనం విరామం ఉంటుంది. ఆ తర్వాత నూతన పార్లమెంట్ భవనానికి సభ్యులను రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మార్గ నిర్దేశం చేయనున్నారు.

కొత్త పార్లమెంట్ భవనంలో మైక్‌లన్నీ ఆటోమేటిక్‌ వ్యవస్థ సాయంతో పనిచేస్తాయని సమాచారం. సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్‌ కేటాయించిన సమయం పూర్తి కాగానే.. మైక్రోఫోన్ ఆటోమెటిక్​గా స్విచ్ఛాప్‌ అవుతుంది. సభలో తమకు మైక్‌ ఇవ్వట్లేదంటూ ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆటోమేటిక్‌ మైక్‌ వ్యవస్థను ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదానీ గ్రూప్‌ ఆర్థిక అవకతవకలపై హిండెన్‌ బర్గ్‌ విడుదల చేసిన నివేదికపై విచారణ జరగాలని గత సమావేశాల్లో ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. తమ వాణి వినిపించకుండా ప్రభుత్వం మైక్‌ కట్‌ చేస్తోందని ఆరోపించారు. అలాగే ప్రతిపక్ష నేతలు మాట్లాడటానికి లేచిన సమయంలో పార్లమెంట్‌లో మైక్‌లు సరిగా పనిచేయవని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. విమర్శలు చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కూడా తనకు మైక్‌ ఇవ్వకుండా ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనలు తెలపడానికి వీలులేకుండా ఆ ప్రాంతాన్ని బాగా కుదించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త పార్లమెంటు భవనంలో కాగితరహిత కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రతి ఎంపీకి ఓ ట్యాబ్‌ ఇస్తారు. అందులోనే సభ నిర్వహణ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా జర్నలిస్టులకు కూడా ప్రవేశ నిబంధనలు కఠినతరం చేశారు.

Last Updated :Sep 19, 2023, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.