ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో బీజేపీ జోరు​- మేజిక్ ఫిగర్​ దాటిన కాషాయ పార్టీ

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 8:01 AM IST

Updated : Dec 3, 2023, 4:50 PM IST

Madhya Pradesh Election Result 2023 in Telugu : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. మేజిక్ ఫిగర్​ 116ను దాటి బంపర్​ మెజారిటీ దిశగా సాగుతోంది.

Madhya Pradesh Election Result 2023 in Telugu
Madhya Pradesh Election Result 2023 in Telugu

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

4.44 PM

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ అఖండ మెజార్టీతో విజయం దిశగా పయనిస్తోంది. మేజిక్​ ఫిగర్​ 116 సీట్లను దాటి, మరో 50 కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.​ కాంగ్రెస్‌ 33 సీట్లలో గెలిచి, మరో 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

4.10 PM

మధ్యప్రదేశ్​లో సెంచరీ కొట్టింది అధికార బీజేపీ. సుమారు 100కు పైగా స్థానాల్లో విజయం సాధించగా, మరో 60 కిపైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్​ 28 సీట్లలో గెలిచి, 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

3.10 PM

మధ్యప్రదేశ్​లో 36 స్థానాల్లో విజయం సాధించగా, మరో 120 కిపైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్​ 17 స్థానాల్లో గెలుపొందగా, 50కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ విజయం సాధించారు.

  • #WATCH | Bhopal: Madhya Pradesh CM Shivraj Singh Chouhan, Union Ministers Jyotiraditya Scindia, Narendra Singh Tomar and state BJP president VD Sharma, in Bhopal as the party heads towards a massive victory in the state. pic.twitter.com/kFFf5KDTrP

    — ANI (@ANI) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • 2.30 PM

మధ్యప్రదేశ్​లో అధికారం దిశగా దూసుకుపోతున్న బీజేపీ, 19 స్థానాల్లో గెలిచింది. 130కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ 65కి లోపు సీట్లతో వెనుకంజలో ఉంది. నర్సింగాపుర్​ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్​ గెలుపొందగా, మరో కేంద్రమంత్రి ఫగాన్​ సింగ్ కులస్తే పరాజయం పాలయ్యారు. మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​ భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా కొనసాగుతున్నారు. బుధ్ని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న 50వేలకు పైగా మెజారిటీతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్​ కమల్​నాథ్​ 15వేలకుపైగా మెజారిటీతో ఉన్నారు

  • 1.35 PM
    మధ్యప్రదేశ్​లో అధికార బీజేపీ మరోసారి విజయం దిశగా సాగుతోంది. 159 స్థానాల్లో కనబరుస్తోంది. రెండు చోట్ల విజయం సాధించింది.
  • 1.00 PM

మధ్యప్రదేశ్​లో అధికార బీజేపీ గెలుపు దిశగా దూసుకుపోతుంది. బీజేపీ 160కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ 65కి లోపు సీట్లతో వెనుకంజలో ఉంది. మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​ భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా కొనసాగుతున్నారు. బుధ్ని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న 50వేల మెజారిటీతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్​ కమల్​నాథ్​ 15వేలకుపైగా మెజారిటీతో ఉన్నారు

  • 12.28 PM

మధ్యప్రదేశ్​లో అధికార బీజేపీ తన హవాను కొనసాగిస్తోంది. బీజేపీ 160కి పైగా సీట్లలో ఆధిక్యంతో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్​ 70కి లోపు సీట్లతో వెనుకంజలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్, కాంగ్రెస్​ పీసీసీ చీఫ్​ కమల్​నాథ్, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​, ప్రహ్లాద్​ సింగ్​ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా వెనుకంజలో ఉన్నారు.

  • 11.58 AM

మధ్యప్రదేశ్​లో అధికార బీజేపీ దూసుకుపోతుంది. బీజేపీ 150కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ 70కి పైగా సీట్లతో వెనుకంజలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్, కాంగ్రెస్​ పీసీసీ చీఫ్​ కమల్​నాథ్, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​, ప్రహ్లాద్​ సింగ్​ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా వెనుకంజలో ఉన్నారు.

  • 10.54 AM

మధ్యప్రదేశ్‌ బీజేపీ మేజిక్​ ఫిగర్​ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార బీజేపీ 160కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 64 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

  • 9.56 AM

మధ్యప్రదేశ్​లో అధికార బీజేపీ దూసుకుపోతుంది. బీజేపీ 160కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ 60కి పైగా సీట్లతో వెనుకంజలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ పీసీసీ చీఫ్​ కమల్​నాథ్ వెనుకంజలో ఉన్నారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ మందజలో ఉండగా.. బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా వెనుకంజలో ఉన్నారు.

  • 9.37 AM

మధ్యప్రదేశ్​లో ఎగ్జిట్ పోల్స్​ అంచనాలను తలకిందులు చేస్తూ అధికార బీజేపీ దూసుకుపోతుంది. బీజేపీ 130కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ 55 లోపు సీట్లతో వెనుకంజలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్​ పీసీసీ చీఫ్​ కమల్​నాథ్ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా వెనుకంజలో ఉన్నారు.

  • 9.15 AM

మధ్యప్రదేశ్​లో అధికార పార్టీ బీజేపీ తన హవాను కొనసాగిస్తోంది. ప్రస్తుతం బీజేపీ 78 స్థానాల్లో ముందజలో ఉండగా.. కాంగ్రెస్​ 32 సీట్లలో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.

  • 8.30AM
  • మధ్యప్రదేశ్​లో బీజేపీ 15 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 2 స్థానాల్లో లీడింగ్​లో ఉంది.
  • 8.00AM

Madhya Pradesh Election Result 2023 in Telugu : మధ్యప్రదేశ్​లో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 52 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ మొదలైంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు పటిష్ఠంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్​ను పోలీసులు అమలులోకి తెచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మధ్యప్రదేశ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 230 కాగా, మెజార్టీకి 116 స్థానాలు అవసరం. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోరు నెలకొంది. నవంబర్‌ 17వ తేదీన ఒకే విడతలో జరిగిన ఎన్నికల్లో 76.22 శాతం పోలింగ్‌ నమోదైంది. 1956లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్‌ కావడం విశేషం. 2018లో జరిగిన ఎన్నికల్లో 75.63 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?
మధ్యప్రదేశ్​లో మళ్లీ బీజేపీకే అధికారం రావచ్చని మెజారిటీ ఎగ్జిట్​పోల్స్ అంచనా వేశాయి. మరికొన్ని మాత్రం కాంగ్రెస్ అధికారం దక్కించుకోవచ్చని తెలిపాయి. అంటే మధ్యప్రదేశ్​లో అధికార బీజేపీ, కాంగ్రెస్​ల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 15 నెలలకే జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం వల్ల కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలింది. దీంతో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సారథ్యంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Last Updated : Dec 3, 2023, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.