ETV Bharat / bharat

'కరోనా కట్టడికి రూ.20వేల కోట్ల ప్యాకేజీ'

author img

By

Published : Jun 4, 2021, 1:25 PM IST

Updated : Jun 4, 2021, 1:48 PM IST

కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం రూ.20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకు అదనంగా వ్యాక్సినేషన్​కు మరో రూ.1,500 కోట్లు సమకూర్చనుంది.

kerala covid package, కేరళ కరోనా ప్యాకేజీ
రూ.20వేల కోట్ల భారీ ప్యాకేజ్​ను ప్రకటించిన ప్రభుత్వం!

కరోనా మహమ్మారి రెండో దశను ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం రూ.20వేల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకు అదనంగా ఉచిత వ్యాక్సినేషన్​ కోసం రూ.1000 కోట్లు, టీకా పంపిణీకి సంబంధించిన వసతుల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించింది. శుక్రవారం ఈ ఏడాది బడ్జెట్​ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ వివరాలు వెల్లడించింది.

'అందరికీ ఆహారం, ఆరోగ్యమే కొత్త బడ్జెట్​ లక్ష్యం. మహమ్మారిని కట్టడి చేసి రాష్ట్రంలో మూడో దశ ఏర్పడకుండా చర్యలు చేపడతాం' అని కేరళ ఆర్థిక మంత్రి కేఎన్​ బాలగోపాల్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి : ఆర్​టీసీల మధ్య వివాదం- ఆ రాష్ట్రానిదే విజయం

Last Updated : Jun 4, 2021, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.