ETV Bharat / bharat

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Jun 8, 2022, 9:23 AM IST

Updated : Jun 8, 2022, 10:03 AM IST

Slug COVID CASES
Slug COVID CASES

India Covid cases: భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 5,233 మందికి వైరస్​ సోకింది. మరో ఏడుగురు చనిపోయారు.

India Covid Cases: దేశంలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 5,233 మంది వైరస్​ బారినపడ్డారు. ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 3345 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.72 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.07 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.12% గా వద్ద ఉంది. 93 రోజుల తర్వాత రోజువారీ కేసులు ఐదువేలకు పైగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కరోనా కేసులు:4,31,90,282‬‬
  • మొత్తం మరణాలు: 5,24,715
  • యాక్టివ్​ కేసులు: 28,857
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,36,710

Vaccination India: భారత్​లో మంగళవారం 14,94,086 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,43,26,416కు చేరింది. మరో 3,13,361 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 5,42,669 కేసులు వెలుగుచూశాయి. మరో 1510 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 536,473,762కు చేరింది. మరణాల సంఖ్య 6,323,279కు చేరింది. ఒక్కరోజే 650,670 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 507,524,529గా ఉంది.

  • తైవాన్​లో 83,027 కొవిడ్​ కేసులు, 124 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో 81,332 కొత్త కేసులు, 339 మరణాలు వెలుగుచూశాయి.
  • బ్రెజిల్​లో 71,045 మంది వైరస్​ బారిన పడ్డారు. 294 మంది చనిపోయారు.
  • జర్మనీలో 67 వేలు, ఉత్తర కొరియాలో మరో 61 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

ఇవీ చదవండి: కొత్త వేరియంట్ వల్లే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా?

మహారాష్ట్రలో తగ్గిన కరోనా కేసులు

Last Updated :Jun 8, 2022, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.