ETV Bharat / bharat

ఆ రాశుల వారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 5:05 AM IST

Horoscope Today 28 December 2023
Horoscope Today December 28th 2023

Horoscope Today December 28th 2023 : డిసెంబర్​ 28న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today December 28th 2023 : డిసెంబర్​ 28న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి సాధారణంగా గడుస్తుంది. కొత్త పనులు ప్రారంభించవచ్చు. కానీ త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీదైన శైలిలో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారి తారాబలం అంత బాగాలేదు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇవాళ ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. కొత్త వ్యవహారాలు ఏమీ మొదలుపెట్టకూడదు. చదవకుండా కీలకమైన పత్రాలపై సంతకాలు చేయకూడదు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి అద్భుతంగా ఉంటుంది. కొత్త దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. అలాగే కృషితో మంచి ఘనకార్యాలు నెరవేర్చుతారు.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కీలమైన నిర్ణయాలు ఇవాళ తీసుకోకపోవడమే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు చెలరేగవచ్చు. ఇవి మిమ్మల్ని తీవ్రమైన నిరాశకు గురిచేస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి కలిసి వస్తుంది. స్నేహితులు మీకు తోడుగా నిలుస్తారు. ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి ఇది మంచి అవకాశం. కనుక విలువైన సమయాన్ని, అవకాశాలను జారవిడుచుకోకూడదు.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి చాలా బాగుంటుంది. ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్నింటా విజయం సాధిస్తారు. కొత్త పనులు, ప్రాజెక్టు లాభాలను కురిపిస్తాయి. పదోన్నతలు లభించవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. కానీ సహోద్యోగుల సహకారం మీకు లభించదు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. విదేశాల నుంచి ఓ శుభవార్త వింటారు.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రణాళికలు వాయిదా వేయాలి. ఇవాళ మీ తారాబలం అంత బాగాలేదు. ఖర్చులు పెరగవచ్చు. కానీ భౌతిక సుఖాలు ఇవాళ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పనులు కూడా త్వరగా నెరవేరుతాయి.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. సహోద్యోగుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీలోని సృజనాత్మకతను ప్రపంచానికి వెల్లడిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇవాళ మీరు సంతోషంగా గడుపుతారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి చాలా బాగుంటుంది. వ్యాపారులు, వృత్తి నిపుణులు, గృహిణులు, విద్యార్థులు అందరికీ మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభాలను చేకూరుస్తాయి. కుటుంబమంతా ఆనందంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఓ కీలమైన విషయంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒంటరిగా ప్రయాణం చేయడమే మంచిది. మీ బలహీనతలను బలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త!

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి సాధారణంగా గడుస్తుంది. కానీ కొత్త ప్రాజెక్టులు, పనులు ప్రారంభించవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో గట్టి పోటీ ఎదురవుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.