ETV Bharat / bharat

ఫోన్​లో గేమ్ ఆడొద్దన్న తండ్రిని గొంతుకోసి చంపిన మైనర్​

author img

By

Published : Sep 3, 2021, 10:53 AM IST

Gujarat : A 17-year-old son killed his father over refusal of playing a game on a mobile phone
ఫోన్​లో గేమ్ ఆడోద్దన్న తండ్రిని గొంతుకోసి చంపిన కుమారుడు

పిల్లలు స్మార్ట్​ఫోన్లకు బానిసలైతే ఎంత ప్రమాదకరమో తెలియజేసే మరో ఘటన గుజరాత్​లో జరిగింది. ఫోన్లో గేమ్ ఆడనివ్వలేదని కన్నతండ్రినే హత్య చేశాడు 17ఏళ్ల కుమారుడు. అంతేగాక దీన్ని యాక్సిడెంట్​గా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోలీసుల విచారణలో దొరికిపోయాడు.

గుజరాత్​ సూర​త్​లోని హజీరాలో దారుణం జరిగింది. స్మార్ట్​ఫోన్​లో గేమ్స్​కు బానిసైన 17 ఏళ్ల కుమారుడు కన్నతండ్రినే హత్య చేశాడు. గేమ్​ ఆడొద్దని తండ్రి మందలించినందుకే ఈ దురాఘతానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఈ విషయాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.

ఇచ్చాపుర్​కు చెందిన 40 ఏళ్ల అర్జున్.. తన కుమారుడు రోజంతా ఫోన్లో గేమ్​ ఆడటాన్ని గమనించి వద్దని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన మైనర్.. తండ్రితో గొడవపడ్డాడు. ఆవేశంతో అతని గొంతుకోసి చంపాడు. ఈ విషయాన్ని తల్లికి కూడా తెలియకుండా దాచాలనుకున్నాడు. శవాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి.. జారిపడిపోయినట్లు చిత్రీకరించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఇది హత్య అని వైద్యులు నిర్ధరించారు. దీంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయపడింది.

తన కుమారుడే ఈ పని చేశాడని తెలిసి తల్లి షాక్​కు గురైంది. అతడిపై కేసు పెట్టింది.

ఇదీ చదవండి: ఆ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న పురందేశ్వరి వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.