ETV Bharat / entertainment

రూ. 30 కోట్ల టికెట్లు సోల్డ్ - 40 ఏళ్ల క్రితమే చైనాలో రికార్డు - సినిమా, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టే - Bollywood Movie in China

author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 9:52 AM IST

Updated : May 17, 2024, 10:28 AM IST

70s Super Hit Bollywood Movie in China : చైనాలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రిలీజై అక్కడి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాయి. అయితే 70స్​లో ఓ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుని అనేక రికార్డులు సాధించింది. ఇంతకీ ఆ మూవీ ఏదంటే? అంతగా హిట్ కావడానికి కారణం ఏంటంటే?

Super Hit Bollywood Movie in China
Super Hit Bollywood Movie in China (Source : Getty Images)

70s Super Hit Bollywood Movie in China : పాన్​ఇండియా మేనియా నడుస్తున్న తరుణంలో ఎన్నో చిత్రాలు ఓవర్సీస్​లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. ఇప్పుడిది ట్రెండ్ అయినప్పటికీ ఒకప్పుడు ఓ సినిమా వరల్డ్​వైడ్ క్రేజ్ సంపాదించింది అంటే అది పెద్ద విషయం అని చెప్పాలి. స్టోరీ, యాక్టర్స్ ఇలా అన్నింటిలోనూ పర్ఫెక్ట్​గా ఉంటేనే ఆ సినిమా అంతటి సక్సెస్ సాధిస్తుంది. ఇదే కోవకు చెందిన ఓ 70స్​ బాలీవుడ్ మూవీ చైనాలో ఎన్నో రికార్డులు తిరగరాసింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

1979లో బాలీవుడ్ సూపర్​స్టార్ జితేంద్ర, ఆశా పరేఖ్ నటించిన 'కారవాన్' మూవీ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్​లోనూ మంచి టాక్ అందుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తండ్రి నాజిర్ హుస్సేన్ డైరెక్షన్​లో వచ్చింది ఈ సినిమా. నాజర్ హుస్సేన్ సోదరుడు తాహిర్ హుస్సేన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. అరుణా ఇరానీ, మెహమూద్ జూనియర్, హెలెన్, రవీంద్ర కపూర్, మదన్ పూరీ లాంటి స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. అప్పట్లోనే ఈ చిత్రం దాదాపు రూ. మూడున్నర కోట్లు వసూళ్లు సాధించి సూపర్ హిట్ టాక్ అందుకుంది.

అయితే ఎనిమిదేళ్ల తర్వాత అదే సినిమాను చైనాలో విడుదల చేస్తే, దాదాపు రూ.30 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. అక్కడ కూడా బ్లాక్​బస్టర్ అయ్యింది. ఆ సినిమా అంతగా హిట్ కావడానికి ప్రధాన కారణం ఆర్ డి బర్మన్ సంగీతం. ఇప్పటికీ ఆ సాంగ్స్​ ట్రెండింగ్ ఉన్నాయంటే అవి మూవీ లవర్స్​పై ఎంతటి ఇంపాక్ట్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'చడ్తి జవాని', 'పియా తూ', 'కిత్నా ప్యారా వాదా హై' లాంటి సెన్సేషనల్ సాంగ్​ ఈ సినిమాలోనివే.

1977లో అనౌన్స్​మెంట్​ 2024లో రిలీజ్​కు సిద్ధం - రూ.1000 కోట్ల బడ్జెట్​తో రానున్న సినిమా! - MEGALOPOLIS MOVIE

హీరో, డైరెక్టర్ కాంట్రవర్సీ - ఏకంగా ఫేస్​బుక్​లో మూవీ రిలీజ్ - tovino thomas movie in facebook

Last Updated :May 17, 2024, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.