ETV Bharat / bharat

అలెర్ట్- ఆ 17యాప్​లు ఫుల్​ డేంజర్​- మీ ఫోన్​లో ఉంటే డిలీట్ చేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 4:48 PM IST

Alert! Google Removes 17 Apps From Play Store; Urgently Delete If You Have These Too
Google Removed 17 Apps From Play Store

Google Removed 17 Apps : 17లోన్​ యాప్​లను ప్లేస్టోర్ నుంచి తొలగించింది టెక్​ దిగ్గజం గూగుల్​. స్లోవాక్​ సాఫ్ట్​వేర్​ కంపెనీ ESET ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. మరి వాటిలో ఏ యాప్ అయినా మీ ఫోన్ లో ఉందా?

Google Removed 17 Apps : తక్కువ వడ్డీకే లోన్​ ఇస్తామని వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్న 17 మోసపూరిత ఆండ్రాయిడ్​ ఆన్​లైన్ రుణ యాప్​లను ప్లేస్టోర్​ నుంచి తొలగించింది ప్రముఖ టెక్​ దిగ్గజం గూగుల్. స్లోవాక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ESET ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 5న ఈ హానికరమైన అప్లికేషన్​లను ఆండ్రాయిడ్​ డివైజుల్లో గుర్తించింది గూగుల్​. SpyLoanగా పేర్కొనే ఈ రకమైన యాప్స్​ను ఈ ఏడాది దాదాపు 1.2 కోట్ల మంది యూజర్స్​ ప్లేస్టోర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకున్నారు.

ఈ స్పైలోన్​ యాప్‌లు చట్టబద్ధమైన పర్సనల్ లోన్ సర్వీసెస్​ అప్లికేషన్​​లుగా చెప్పుకుంటూ ఫండ్స్​ను త్వరగా మరింత సులభతరంగా యాక్సెస్​ చేసుకోవచ్చనే నమ్మకాన్ని యూజర్స్​కు కలిగిస్తున్నాయని రిపోర్ట్ నివేదించింది. అంతేకాకుండా రకరకాల ఆకర్షణీయమైన ఆఫర్స్​తో పాటు మార్కెట్​ వడ్డీ రేటు కంటే తక్కువ శాతం వడ్డీల​ను ప్రకటిస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని సాఫ్ట్‌వేర్ సంస్థ ESET వెల్లడించింది. చివరకు బాధితుల బ్యాంక్​ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని లోన్​ యాప్​లు సేకరించి వారి నుంచి పెద్ద మొత్తంలో నగదును దండుకుంటున్నాయని నివేదికలో చెప్పింది.

ప్లేస్టోర్​ నుంచి గూగుల్​ తొలగించిన SpyLoan యాప్స్​ ఇవే(Google Play Store Removed Apps List)

  1. AA Kredit
  2. Amor Cash
  3. GuayabaCash
  4. EasyCredit
  5. Cashwow
  6. CrediBus
  7. FlashLoan
  8. PréstamosCrédito
  9. Préstamos De Crédito-YumiCash
  10. Go Crédito
  11. Instantáneo Préstamo
  12. Cartera grande
  13. Rápido Crédito
  14. Finupp Lending
  15. 4S Cash
  16. TrueNaira
  17. EasyCash

ఈ రుణ యాప్‌లు ప్రధానంగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్​ అమెరికాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది.

స్పైలోన్ యాప్‌లు అంటే ఏమిటి?
ఈ యాప్​లు ఆండ్రాయిడ్ యూజర్స్​కు వ్యక్తిగత రుణాలను అందిస్తాయి. ఇవి తమను తాము ఓ చట్టబద్ధత కలిగిన ఆర్థిక సేవలందించే వాటిగా చిత్రీకరించుకుంటాయి. మార్కెట్​లో ఉన్న దానికంటే అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్​ లోన్స్​ను ఇస్తామని వినియోగదారులను నమ్మబలికిస్తాయి. వీటితో పాటు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తాయి. ఇలా రుణం మంజూరు చేశాక తమ విశ్వరూపాన్ని బాధితులపై ప్రదర్శిస్తాయి. యూజర్స్​కు సంబంధించిన ఆర్థికపరమైన వివరాలను సేకరించి బ్లాక్​మెయిల్​ చేయడం మొదలుపెడతాయి.

వీటిని యాక్సెస్​ చేస్తాయి
'ఈ స్పైలోన్​ యాప్​ల ద్వారా సదరు వ్యక్తి రుణం పొందాలంటే ముందుగా అప్లికేషన్​ అడిగే అన్నీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే లోన్​ మంజూరు అవ్వదు. దీనినే ఆసరాగా చేసుకుని వందలకొద్దీ యాప్స్​ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సులువుగా సేకరిస్తున్నాయి. తద్వారా వాటి సాయంతో బెదిరింపులకు పాల్పడుతున్నాయి' అని స్లోవాక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ESET ప్రచురించింది. ఈ సమాచారాన్ని కాల్​ లాగ్స్, క్యాలెండర్​ ఈవెంట్స్, డివైజ్​ ఇన్ఫో, ఇన్​స్టాల్డ్​ యాప్స్​, వై-ఫై నెట్​వర్క్​ ఇన్ఫో, డివైజ్​లోని ఫైల్స్​కు చెందిన సమాచారం, కాంటాక్ట్​ లిస్ట్​, లొకేషన్​ డేటా, SMS సందేశాల ద్వారా యాక్సెస్​ చేస్తాయి. కాగా, గూగుల్​ ఇప్పటివరకు 200కుపైగా ఇలాంటి యాప్స్​ను ప్లేస్టోర్​ నుంచి తొలగించింది.

బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేసి ఉంచడం లాభమా? నష్టమా?

జియో e-సిమ్​తో బోట్ స్మార్ట్​వాచ్ - ఇక మొబైల్​తో పనే లేదు! ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.